Jump to content

తిరువల్లాయ్

అక్షాంశ రేఖాంశాలు: 9°23′06″N 76°34′30″E / 9.385°N 76.575°E / 9.385; 76.575
వికీపీడియా నుండి
(శ్రీ వల్లభ క్షేత్రం నుండి దారిమార్పు చెందింది)


  ?తిరువల్లాయ్
కేరళ • భారతదేశం
అక్షాంశరేఖాంశాలు: 9°23′06″N 76°34′30″E / 9.385°N 76.575°E / 9.385; 76.575
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
జిల్లా (లు) పతనంతిట్ట జిల్లా
జనాభా 56,828 (2001 నాటికి)
కోడులు
పిన్‌కోడ్
ప్రాంతీయ ఫోన్ కోడ్

• 689101
• +91-469

తిరువల్లాయ్ (మలయాళం: തിരുവല്ല), కేరళ రాష్ట్రంలో పతనంతిట్ట జిల్లాలోని తాలూకా కేంద్రం, పట్టణం. ఇక్కడ నెడుంపురం పాలస్, పలియక్కర పాలస్ ఉన్నాయి. ఇక్కడి రైల్వే స్టేషను, తిరువనంతపురం మధ్యలో ఉంది.

ఈ ఊరికి తిరువల్లాయ్ అనే పేరు ఇక్కడ ప్రవహించే మణిమాల నది ముఖద్వారం పేరు మీద వచ్చింది (Valla vai (vai అంటే ప్రాచీన మలయాళంలో నదీ ముఖద్వారం). తిరువల్లాయ్ కి పశ్చిమంగా పంపా, మణిమాల అచెన్ కోవిల్ నదుల సంగమం అత్యంత సుందరంగా కనిపిస్తుంది.

వివరాలు:

[మార్చు]

కోలప్పిరాన్ - శెల్వత్తిరుక్కొళుందు తాయార్ - ఘంటాకర్ణ సరస్సు - తూర్పుముఖము - నిలుచున్నసేవ - చతురంగకోల విమానము - ఘంటాకర్ణునకు ప్రత్యక్షము - నమ్మాళ్వార్లు, తిరుమంగై ఆళ్వార్లు కీర్తించినది.

శ్రీ వల్లభ క్షేత్రం

[మార్చు]

ఇక్కడి శ్రీ వల్లభ క్షేత్రం వైష్ణవ దివ్యదేశాలు భారతదేశంలో ప్రాచీనమైనది. ఈ క్షేత్రమునకు 'తెన్ నగర్' అను తిరునామము ఉంది. దీనిని ద్వాపర యుగమున శ్రీకృష్ణుడు ప్రతిష్టించెనని చెప్పుదురు. దీనిని నమ్మాళ్వార్, తిరుమంగై ఆళ్వార్లు కీర్తించిరి.[1] శాసనాల ద్వారా లభించిన ఆధారాల ప్రకారం తిరువల్లాయ్ లో ప్రాచీనమైన ఆధ్యాత్మిక, వైదిక ప్రాముఖ్యత కలిగియుండి వేల కొలది విద్యార్థులకు విద్యనందించేది.

విశేషాలు:

[మార్చు]

ఈ క్షేత్రమునకు ' తెన్ నగర్ ' సుందరమైన దివ్యదేశము (తి.వా.మొ. 5-9-11) అను విలక్షణమైన తిరునామము ఉంది. ఈ క్షేత్రము ద్వాపర యుగమున శ్రీకృష్ణునిచే ప్రతిష్ఠింపబడినదని చెప్పుదురు. చతురంగ విమానమునకు వెనుక చక్రత్తాళ్వార్ వేంచేసియున్నారు. ఈ సన్నిధి లోపలకు స్త్రీలను రానీయరు. వెలుపలనుండియే సేవింపవలెను. కానీ ధనుర్మాసములో ఆర్ద్ర నక్షత్రమునాడు, మేష సంక్రాంతినాడు మాత్రము లోపలకు రానిత్తురు.

సర్వేశ్వరుని పొందుటకు ఉపాయము సర్వేశ్వరుడే. ఆతడే ఉపాయమని మనకు తెలియజేయునది ఆస్వామి కృపాగుణమే. ఆకృపాగుణమునే నమ్మాళ్వార్లు తిరువాయొల్ (5-6-9) లో పెరుమానదు తొల్లరుళే (సర్వేశ్వరుని స్వాభావికమైన కృప) యని కృపాగుణమును ప్రకాశింపజేసిరి. ఈ క్షేత్రమునకు శ్రీవల్లభక్షేత్రమనియు తిరునామము ఉంది.

మార్గము:

[మార్చు]

కొల్లం - ఎర్నాకుళం రైలు మార్గంలో తిరువల్లాయ్ స్టేషను నుండి 5 కి.మీ. బస్సు వసతి ఉంది. ఇచట సత్రములో దిగి బస ఏర్పాటు చేసికొని తిరుచ్చెంకున్ఱూరు వాని సమీప క్షేత్రములు సేవింపవచ్చును. తిరుచ్చెంకున్ఱూర్ కు ఉత్తరమున 10 కి.మీ. దూరములో ఈ క్షేత్రము ఉంది. తిరువణ్డ్‌ణూరుకు 8 కి.మీ.

సాహిత్యంలో తిరువల్లాయ్

[మార్చు]

శ్లోకము :
ఘంటాకర్ణ సరోవరేణ కలితే శ్రీ వల్లవాళ్ పత్తనే
భాతి ప్రాజ్ముఖ మండిత స్థితి యుతః కోలప్పిరాన్ నామకః
వైమానం చతురంగ మాప్య గృహిణీం శెల్వక్కొళుందాహ్వయాం
ఘంటాకర్ణ నిరీక్షితః కలిజిత స్తుత్య శ్శఠారే ర్మునేః

పాశురము:
మానేయ్‌నోక్కు నల్లీర్; వైగులుమ్‌ వినై యేన్మిలియ,
వానార్ వణ్‌కముకు; మ్మత్తు మల్లిగై కమలమ్‌
తేనార్ శోలైగళ్ శూమ్; తిరువల్లవాయ్‌ఱైయుమ్‌
కోనారై; యడియే; నడికూడువ తెన్ఱుకొలో - నమ్మాళ్వారు - తిరువాయిమొన్ 5-9-1.

మూలాలు

[మార్చు]
  1. తిరువల్లవాళ్ (తిరువల్లాయ్ లేదా శ్రీవల్లభక్షేత్రం), దివ్యదేశ వైభవ ప్రకాశికా, శ్రీమాన్ కిడాంబి గోపాల కృష్ణమాచార్య స్వామి, ఉభయ వేదాంత సభ, పెంటపాడు, 1997, పేజీ.83.