షేన్ బాండ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
షేన్ బాండ్
2009లో యూనివర్సిటీ ఓవల్ వద్ద బాండ్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
షేన్ ఎడ్వర్డ్ బాండ్
పుట్టిన తేదీ (1975-06-07) 1975 జూన్ 7 (వయసు 49)
క్రైస్ట్‌చర్చ్, కాంటర్‌బరీ, న్యూజీలాండ్
మారుపేరుJames Bond, Bondy, 007
ఎత్తు1.85 మీ. (6 అ. 1 అం.)
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఫాస్ట్
పాత్రబౌలర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 216)2001 22 November - Australia తో
చివరి టెస్టు2009 24 November - Pakistan తో
తొలి వన్‌డే (క్యాప్ 124)2002 11 January - Australia తో
చివరి వన్‌డే2010 13 March - Australia తో
వన్‌డేల్లో చొక్కా సంఖ్య.27
తొలి T20I (క్యాప్ 13)2005 21 October - South Africa తో
చివరి T20I2010 10 May - England తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1996/97–2009/10Canterbury
2002Warwickshire
2008Hampshire
2010Kolkata Knight Riders
కెరీర్ గణాంకాలు
పోటీ Test ODI T20I FC
మ్యాచ్‌లు 18 82 20 60
చేసిన పరుగులు 168 292 21 830
బ్యాటింగు సగటు 12.92 16.22 4.20 16.60
100లు/50లు 0/0 0/0 0/0 1/2
అత్యుత్తమ స్కోరు 41* 31* 8* 100
వేసిన బంతులు 3,372 4,295 465 10,263
వికెట్లు 87 147 25 225
బౌలింగు సగటు 22.09 20.88 21.72 24.34
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 5 4 0 12
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 1 0 0 1
అత్యుత్తమ బౌలింగు 6/51 6/19 3/18 7/66
క్యాచ్‌లు/స్టంపింగులు 8/– 15/– 4/– 24/–
మూలం: Cricinfo, 2010 10 May

షేన్ ఎడ్వర్డ్ బాండ్ (జననం 1975, జూన్ 7) న్యూజీలాండ్ మాజీ క్రికెటర్, క్రికెట్ కోచ్. ముంబై ఇండియన్స్ ప్రస్తుత బౌలింగ్ కోచ్ గా పనిచేశాడు.[1] "సర్ రిచర్డ్ హాడ్లీ తర్వాత న్యూజీలాండ్ అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్" గా రాణించాడు.[2][3] టెస్ట్, వన్డే, ట్వంటీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో న్యూజీలాండ్‌కు ప్రాతినిధ్యం వహించాడు. న్యూజీలాండ్ దేశీయ క్రికెట్‌లో కాంటర్‌బరీ, ఇంగ్లీష్ దేశీయ క్రికెట్‌లో వార్విక్షైర్ తరపున ఆడాడు. కుడిచేతి ఫాస్ట్ బౌలర్ గా 2003 ప్రపంచకప్‌లో భారత్‌పై అత్యంత వేగవంతమైన డెలివరీ 156.4 కిమీ/గం వద్ద నమోదైంది.[4]

క్రికెట్ రంగం

[మార్చు]

2001/02 సీజన్‌లో అరంగేట్రం చేసినప్పటి నుండి, తన 34 సంవత్సరాల వయస్సులో 2009 డిసెంబరులో టెస్ట్ క్రికెట్ నుండి రిటైర్ అయ్యే ముందు న్యూజీలాండ్ తరపున 18 టెస్ట్ మ్యాచ్‌లలో మాత్రమే కనిపించగలిగాడు.[2][5]

2008 మార్చిలో జరిగిన 'రెబెల్' ఇండియన్ క్రికెట్ లీగ్‌లో ఢిల్లీ జెయింట్స్‌తో బాండ్ పాల్గొనడం వల్ల[6] కెరీర్ కూడా 18 నెలల విరామం ఎదుర్కొంది, దీని కారణంగా న్యూజీలాండ్ క్రికెట్ బోర్డుసెంట్రల్ కాంట్రాక్ట్‌ను 2008 జనవరిలో రద్దు చేసింది.[7] అయినప్పటికీ, 2009 జూన్ లో బాండ్ తిరుగుబాటు లీగ్‌తో సంబంధాలను తెంచుకున్నాడు. మరోసారి జాతీయ జట్టుకు ఎంపికయ్యేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించుకున్నాడు.[8] 2010 జనవరిలో, కోల్‌కతా నైట్ రైడర్స్ తరపున ఇండియన్ ప్రీమియర్ లీగ్ 3వ సీజన్‌లో ఆడేందుకు బాండ్ ఎంపికయ్యాడు. 2010 మే 13న అన్ని రకాల ఆటల నుండి రిటైర్ అయ్యాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 4వ సీజన్‌లో ఆడలేదు. క్రిక్‌ఇన్‌ఫోలో బ్రైడన్ కవర్‌డేల్ అతన్ని న్యూజీలాండ్ అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్‌గా అభివర్ణించాడు.[9]

జార్జ్ లోమాన్ తర్వాత బాండ్ ప్రస్తుతం టెస్ట్ మ్యాచ్ క్రికెట్‌లో ఆల్ టైమ్ అత్యుత్తమ బౌలింగ్ స్ట్రైక్ రేట్‌ను కలిగి ఉన్నాడు (కనీసం 2,500 బంతులు వేసిన బౌలర్లలో).[10]

మూలాలు

[మార్చు]
  1. "Bond named New Zealand Bowling Coach". Wisden India. 18 October 2012. Archived from the original on 26 December 2013. Retrieved 19 October 2012.
  2. 2.0 2.1 "Shane Bond quits Test cricket | Cricket | ESPN Cricinfo". Cricinfo.com. Retrieved 2017-07-14.
  3. "The best of Bond". ESPNcricinfo. Retrieved 11 March 2017.
  4. Top 10 World’s Fastest Deliveries in the Cricket History Archived 31 డిసెంబరు 2012 at the Wayback Machine. Retrieved 6 January 2013.
  5. "Brief but brilliant". ESPNcricinfo. Retrieved 11 March 2017.
  6. Bond's New Zealand days appear over. Cricinfo, retrieved 28 March 2008
  7. New Zealand terminate Bond contract. Cricinfo, retrieved 27 March 2008
  8. "Bond available for New Zealand | Cricket | ESPN Cricinfo". Cricinfo.com. 2009-06-20. Retrieved 2017-07-14.
  9. "Shane Bond retires from all cricket". ESPNcricinfo. 14 May 2010. Retrieved 15 May 2010.
  10. "Best Test career strike rates". ESPNcricinfo. Retrieved 6 April 2008.

బాహ్య లింకులు

[మార్చు]