సంజయ్ వామన్‌రావ్ డియోటాలే
సంజయ్ వామన్‌రావ్ డియోటాలే | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2010 నవంబరు 11 - 2014 సెప్టెంబరు 26 | |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 1995 - 2014 | |||
ముందు | మోరేశ్వర్ విఠల్‌రావు తెముర్డే | ||
---|---|---|---|
తరువాత | సురేష్ ధనోర్కర్ | ||
నియోజకవర్గం | వరోరా | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1963 మహారాష్ట్ర , భారతదేశం | ||
మరణం | 2021 ఏప్రిల్ 25 నాగ్‌పూర్, మహారాష్ట్ర , భారతదేశం | ||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
సంజయ్ వామన్‌రావ్ డియోటాలే మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మహారాష్ట్ర శాసనసభకు వరోరా శాసనసభ నియోజకవర్గం నుండి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై పర్యావరణ & సాంస్కృతిక వ్యవహారాల మంత్రిగా పని చేశాడు.
రాజకీయ జీవితం
[మార్చు]సంజయ్ డియోటాలే 1991లో వరోరా తహసీల్‌లోని మధేలి-నగరి సర్కిల్‌లో జిల్లా పరిషత్ సభ్యునిగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి ఆ తరువాత భారతీయ జనతా పార్టీలో చేరి 1995లో వరోరా శాసనసభ నియోజకవర్గం నుండి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన ఆ తరువాత 1999, 2004, 2009 ఎన్నికలలో వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నికై కాంగ్రెస్-ఎన్‌సిపి ప్రభుత్వంలో పృథ్వీరాజ్ చవాన్ మంత్రివర్గంలో పర్యావరణ & సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రిగా పని చేసింది.
సంజయ్ డియోటాలే 2014 లోక్‌సభ ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయాడు. ఆయనకు 2014 శాసనసభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ నిరాకరించడంతో కాంగ్రెస్‌ను వీడి భారతీయ జనతా పార్టీలో చేరి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు. ఆయన 2019 ఎన్నికల్లో శివసేనలో చేరి పోటీ చేసి ఓడిపోయి తిరిగి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సమక్షంలో మళ్లీ బీజేపీలో చేరాడు.
మరణం
[మార్చు]సంజయ్ డియోటాలే నాగ్‌పూర్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 2021 ఏప్రిల్ 25న ఆరోగ్యం క్షిణించడంతో గుండెపోటుతో మరణించాడు. ఆయనకు కొడుకు కరణ్, కుమార్తె కృతిక ఉన్నారు.[1][2][3]
మూలాలు
[మార్చు]- ↑ The Times of India (26 April 2021). "Former state minister Sanjay Deotale no more". Archived from the original on 13 December 2024. Retrieved 13 December 2024.
- ↑ "Former Mah Minister Sanjay Deotale no more" (in ఇంగ్లీష్). 26 April 2021. Archived from the original on 13 December 2024. Retrieved 13 December 2024.
- ↑ Deccan Herald (26 April 2021). "Former Maharashtra minister Sanjay Deotale dies due to cardiac arrest" (in ఇంగ్లీష్). Archived from the original on 13 December 2024. Retrieved 13 December 2024.