సంజీవ వీరసింహ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సంజీవ వీరసింహ
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
కొలంబేజ్ డాన్ ఉదేశ్ సంజీవ వీరసింఘే
పుట్టిన తేదీ1 March 1968 (1968-03) (age 56)
కొలంబో, శ్రీలంక
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగులెగ్‌బ్రేక్ గూగ్లీ
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
ఏకైక టెస్టు (క్యాప్ 30)1985 సెప్టెంబరు 6 - భారతదేశం తో
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్ట్ ఫస్ట్-క్లాస్
మ్యాచ్‌లు 1 44
చేసిన పరుగులు 3 845
బ్యాటింగు సగటు 3.00 17.97
100లు/50లు 0/0 1/2
అత్యధిక స్కోరు 3 112*
వేసిన బంతులు 114 4,593
వికెట్లు 0 103
బౌలింగు సగటు 24.03
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 6
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 2
అత్యుత్తమ బౌలింగు 8/77
క్యాచ్‌లు/స్టంపింగులు 0/– 39/–
మూలం: Cricinfo, 2017 ఏప్రిల్ 11

కొలంబేజ్ డాన్ ఉదేశ్ సంజీవ వీరసింఘే, శ్రీలంక-ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్.[1] 1985లో ఒక టెస్టులో ఆడాడు.[2][3]

జననం[మార్చు]

కొలంబేజ్ డాన్ ఉదేశ్ సంజీవ వీరసింఘే 1968, మార్చి 1న శ్రీలంకలోని కొలంబోలో జన్మించాడు.

క్రికెట్ రంగం[మార్చు]

శ్రీలంక టెస్ట్ స్క్వాడ్‌లో స్కూల్‌బాయ్ క్రికెటర్‌గా ఎంపికయ్యాడు. 1985 సెప్టెంబరులో పి. సారా ఓవల్‌లో భారతదేశానికి వ్యతిరేకంగా తన టెస్ట్ అరంగేట్రం చేసాడు. ఇది చారిత్రాత్మకంగా శ్రీలంక మొట్టమొదటి టెస్ట్ విజయాన్ని కూడా అందించింది.[4] ఇది ఇతని ఏకైక అంతర్జాతీయ మ్యాచ్.

సంజీవ ఇసిపథాన కళాశాలలో చదువుకున్నాడు. 17 సంవత్సరాల 269 రోజుల వయస్సులో శ్రీలంకకు ప్రాతినిధ్యం వహించిన అతి పిన్న వయస్కుడైన టెస్ట్ ఆటగాడిగా గుర్తింపు పొందాడు.[5] ప్రస్తుతం ఆస్ట్రేలియాలో నివాసం ఉంటున్నాడు.

2020 ఫిబ్రవరిలో ఆస్ట్రేలియాలో ఛారిటీ బుష్ ఫైర్ టీ20 మ్యాచ్‌లో ఆడిన శ్రీలంక ఆటగాళ్ళలో అతను ఒకడు.[6]

మూలాలు[మార్చు]

  1. "Melbourne's Sri Lankan connection". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-19.
  2. "Sanjeewa Weerasinghe". Cricinfo. Retrieved 2021-02-21.
  3. "Sanjeewa Weerasinghe Profile - ICC Ranking, Age, Career Info & Stats". Cricbuzz (in ఇంగ్లీష్). Retrieved 2023-08-19.
  4. "When Sri Lanka beat India to win their first ever Test match". Cricket Country. 2013-09-11. Retrieved 2023-08-19.
  5. "Sanjeewa Weerasinghe: What happened to Sri Lanka's youngest-ever Test cricketer?". Nation Online. Retrieved 2023-08-19.[permanent dead link]
  6. "Former Sri Lankan players to play Bushfire T20 in Australia". Bdcrictime. 2020-02-04. Retrieved 2023-08-19.

బాహ్య లింకులు[మార్చు]