సంయోగబీజాలు
Jump to navigation
Jump to search
ఈ వ్యాసంలో మూలాలను ఇవ్వలేదు. |
సంయోగబీజాలు (Gamete (from ప్రాచీన గ్రీకు γαμέτης gametes "husband" / γαμετή gamete "wife") ఒక ప్రత్యేకమైన కణాలు. లైంగిక ప్రత్యుత్పత్తిలో ఒక రకమైన సంయోగబీజం మరొక బీజకణంతో కలిసి ఫలదీకరణం చెందుతాయి. ఎక్కువ జీవ జాతులలో రెండు రకాల సంయోగబీజాలు తయారుచేస్తాయి. ఆడజీవులు సంయోగబీజాలలో పెద్దదైన అండము (Ovum) ఉత్పత్తిచేస్తే మగజీవి చిన్నదైన పురుషవీర్యకణం (Sperm) తయారుచేస్తుంది. కొన్ని జీవులలో రెండు సంయోగబీజాలు ఒకే పరిమాణంలో ఆకారంలోను ఉంటాయి.
సంయోగబీజాలు జన్యువు సమాచారాన్ని ఒక జీవి నుండి తర్వాతి తరానికి అందజేస్తుంది.
బీజకణోత్పత్తి
[మార్చు]జంతువులలో
[మార్చు]జంతువులు సంయోగబీజాలను బీజకోశాలలో క్షయకరణ విభజన ద్వారా తయారుచేస్తాయి. ఆడ, మగ జీవులు లైంగిక ప్రత్యుత్పత్తిలో భాగంగా విభిన్న పద్ధతులలో బీజకణోత్పత్తి (Gametogenesis) ని జరుపుతాయి.
- పురుష బీజకణోత్పత్తి (Spermatogenesis) (మగ)
- స్త్రీ బీజకణోత్పత్తి (Oogenesis) (ఆడ)