సజ్జిదా షా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సజ్జిదా షా
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
సజ్జిదా బీబీ షా
పుట్టిన తేదీ (1988-02-03) 1988 ఫిబ్రవరి 3 (వయసు 36)
హైదరాబాద్, పాకిస్తాన్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఆఫ్ బ్రేక్
పాత్రఆల్ రౌండర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 15)2000 జూలై 30 - ఐర్లాండ్ తో
చివరి టెస్టు2004 మార్చి 18 - వెస్టిండీస్ తో
తొలి వన్‌డే (క్యాప్ 24)2000 జూలై 23 - ఐర్లాండ్ తో
చివరి వన్‌డే2009 మే 26 - ఐర్లాండ్ తో
వన్‌డేల్లో చొక్కా సంఖ్య.12
తొలి T20I (క్యాప్ 9)2009 మే 25 - ఐర్లాండ్ తో
చివరి T20I2010 మే 8 - ఇండియా తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2005/06–2007/08హైదరాబాదు
2009/10–2010/11Zarai Taraqiati Bank Limited
2011/12Balochistan
2012/13Sindh
2012/13–2016/17హైదరాబాదు
కెరీర్ గణాంకాలు
పోటీ మటె మవన్‌డే మటి20 మలిఎ
మ్యాచ్‌లు 2 60 8 99
చేసిన పరుగులు 100 863 86 2,028
బ్యాటింగు సగటు 33.33 15.98 12.28 26.68
100లు/50లు 0/1 0/1 0/0 2/11
అత్యుత్తమ స్కోరు 98 52 27* 158
వేసిన బంతులు 6 2,724 72 4,007
వికెట్లు 0 51 3 86
బౌలింగు సగటు 28.88 24.00 23.72
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 1 0 1
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0 0
అత్యుత్తమ బౌలింగు 7/4 1/11 7/4
క్యాచ్‌లు/స్టంపింగులు 0/– 8/– 3/– 23/–
మూలం: CricketArchive, 2021 డిసెంబరు 11

సజ్జిదా బీబీ షా (జననం 1988, జూన్ 25) పాకిస్తానీ మాజీ క్రికెటర్. ఆల్ రౌండర్‌గా ఆడింది. కుడిచేతి వాటంతో బ్యాటింగ్ లో, కుడిచేతి ఆఫ్ బ్రేక్ బౌలింగ్ లో రాణించింది. 2000 - 2010 మధ్యకాలంలో పాకిస్తాన్ తరపున రెండు టెస్ట్ మ్యాచ్‌లు, 60 వన్డే ఇంటర్నేషనల్స్, ఎనిమిది ట్వంటీ 20 ఇంటర్నేషనల్స్‌లో ఆడింది. హైదరాబాద్, బలూచిస్తాన్, సింధ్, జరాయ్ తారకియాతి బ్యాంక్ లిమిటెడ్ తరపున దేశీయ క్రికెట్ ఆడింది.[1][2]

క్రికెట్ రంగం[మార్చు]

సజ్జిదా షా 2000, జూలై 23న కేవలం పన్నెండేళ్ళ వయసులో ఐర్లాండ్‌తో జరిగిన వన్డే ఇంటర్నేషనల్‌లో పాకిస్థాన్ తరపున అరంగేట్రం చేసింది.[3] ఆ పర్యటనలో నాలుగు వన్డేలు ఆడింది,[4] తన మొదటి టెస్ట్ మ్యాచ్ కూడా ఆడింది,[5] ఇప్పటి వరకు ఐర్లాండ్‌లో ఆడిన ఏకైక మహిళల టెస్టు అది.[6]

2001లో, కరాచీలో నెదర్లాండ్స్‌తో ఏడు వన్డేలు ఆడింది. 2002లో శ్రీలంకలో శ్రీలంకతో ఆరు వన్డేలు ఆడింది.[4]

నెదర్లాండ్స్‌లో జరిగిన 2003 అంతర్జాతీయ మహిళా క్రికెట్ కౌన్సిల్ ట్రోఫీలో, పాకిస్తాన్ మొత్తం ఐదు మ్యాచ్‌లలో ఆడింది.[4] జపాన్‌తో జరిగిన ఓపెనింగ్ మ్యాచ్‌లో, కేవలం నాలుగు పరుగులకే ఏడు వికెట్లు పడగొట్టి జపాన్ బ్యాటింగ్ లైనప్‌ను చిత్తు చేసింది.[7] ఇది టోర్నమెంట్‌లో అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శనగా,[8] మహిళల వన్డే క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ ఇన్నింగ్స్ బౌలింగ్ ప్రదర్శనగా మిగిలిపోయింది.[9] మొత్తం పన్నెండు వికెట్లు పడగొట్టి టోర్నమెంట్‌లో టాప్ వికెట్ టేకర్‌గా నిలిచింది.[10] మహిళల వన్డే చరిత్రలో (15 సంవత్సరాల 168 రోజుల వయస్సులో) ఐదు వికెట్లు తీసిన అతి పిన్న వయస్కురాలిగా నిలిచింది.[11]

మరుసటి సంవత్సరం, వెస్టిండీస్ పాకిస్తాన్‌లో పర్యటించింది. షా ఏడు వన్డేలు,[4] ఒక టెస్టు మ్యాచ్ ఆడాడు. ఈ టెస్టు ఆమెకు (పాకిస్థాన్‌కి)[12] ఇప్పటివరకు జరిగిన చివరి టెస్టు మ్యాచ్.[5] అప్పటినుండి, ఆమె దక్షిణాఫ్రికాతో రెండు ఆసియా కప్ టోర్నమెంట్లు, ఐదు వన్డేలు ఆడింది.[4]

మూలాలు[మార్చు]

  1. "Player Profile: Sajjida Shah". ESPNcricinfo. Retrieved 11 December 2021.
  2. "Player Profile: Sajjida Shah". CricketArchive. Retrieved 11 December 2021.
  3. Cricinfo profile
  4. 4.0 4.1 4.2 4.3 4.4 List of Women's ODIs played by Sajjida Shah Archived 2012-10-01 at the Wayback Machine at CricketArchive
  5. 5.0 5.1 Women's Test matches played by Sajjida Shah at Cricket Archive
  6. List of Women's Test matches played by Ireland Archived 2007-09-30 at the Wayback Machine at Cricket Archive
  7. Scorecard Archived 2012-08-02 at Archive.today of Pakistan Women v Japan Women match, 21 July 2003 at CricketEurope
  8. Best innings bowling for the 2003 IWCC Trophy Archived 2012-07-24 at Archive.today at CricketEurope]
  9. Best innings bowling in Women's ODIs Archived 2011-06-11 at the Wayback Machine at Cricket Archive]
  10. Bowling averages for players who took at least ten wickets in the 2003 IWCC Trophy Archived 2009-01-07 at the Wayback Machine at CricketEurope
  11. "Records | Women's One-Day Internationals | Bowling records | Youngest player to take five-wickets-in-an-innings | ESPN Cricinfo". Cricinfo. Retrieved 2017-05-03.
  12. List of women's Test matches played by Pakistan Archived 2011-06-11 at the Wayback Machine at Cricket Archive

బాహ్య లింకులు[మార్చు]