Jump to content

సద్గురు పూలాజీ బాబా

వికీపీడియా నుండి

శ్రీ శ్రీ శ్రీ పరమహంస సద్గురు పూలాజీ బాబా (30 ఆగష్టు 1925- 25 డిసెంబర్ 2018) పరమయోగి ఆధ్యాత్మిక[1] గురువు,సిద్ధ మహా యోగ పీఠ‌ ధర్మ సేవా సమితి సిద్ధేశ్వర్ సంస్థాన్ పట్నాపూర్ మండలం జైనూర్ కుంరంభీం ఆసిఫాబాద్ జిల్లా.మహారాష్ట్ర లోని పర్భణీ జిల్లా తాలుకా నాగ్ నాథ్ ఔండా,సావళి సమీపంలోని బయాన్ రావు అను గ్రామంలో 30 ఆగష్టు1925 లో అంధ్ సామాజిక వర్గం నిరుపేద గిరిజన కుటుంబంలో ధోండోజీ ఇంగ్లే,పుంజా బాయి దంపతులకు జన్మించారు.[2][3][4]

శ్రీ సద్గురు పూలాజీ బాబా
శ్రీ సద్గురు పూలాజీ బాబా యొక్క చిత్రపటం
పరమహంస సద్గురు పూలాజీ బాబా
జననంఆగష్టు 30 , 1925
సావళి బాయాన్ రావు గ్రామము తాలుకా; నాగ్ నాథ్ ఔండా జిల్లా;పర్భణి మహారాష్ట్ర
మరణండిసెంబర్ 25, 2018 సమాధి (సిద్ధేశ్వర్ సంస్థాన్ పట్నాపూర్ జైనూర్ కంరంభీం ఆసిఫాబాద్ తెలంగాణ భారతదేశం
మరణ స్థలం మహారాష్ట్ర నాంధేడ్ జిల్లా కేంద్రంలోని ఒక ప్రైయివేటు ఆసుపత్రిలో
వృత్తి సామాజిక సంస్కర్త
సుపరిచితుడు/
సుపరిచితురాలు
ఆధ్యాత్మిక గురువు,సద్గురు పరమహంస, పరమయోగి,
తల్లిదండ్రులు
  • ధోండోజీ ఇంగ్లే (తండ్రి)
  • పుంజాబాయి (తల్లి)

బాల్యం కుటుంబం

[మార్చు]

సద్గురు పూలాజీ బాబా మహారాష్ట్ర లోని పర్భాణీ జిల్లా నాగ్ నాథ్ ఔంధ్ తాలుకా లోని సావళి గ్రామ సమీపంలోని బాయనారావు గ్రామంలో అంధ్ ఆదివాసీ తెగ లోని నిరుపేద వ్యవసాయ కుటుంబంలో దోండోజీ ఇంగ్లే,పుంజాబాయి పుణ్య దంపతులకు జన్మించారు.తల్లి పుంజాబాయి గొప్ప శివ భక్తురాలు, భజనలు,పూజలు, సత్సంగ్ కార్యక్రమాల్లో పాల్గోని ఆమె భగవత్ సాక్షాత్కారం పొందినట్లు గ్రామ పెద్దలు చెపారు.అప్పట్లో ఆమె దేవుడికి చేస్తున్న పూజలను,చేష్టలను ప్రజలు బాణామతి గా వక్రీకరించారు.చిన్న వయస్సులోనే వారి తండ్రి దోండోజీ ఇంగ్లే బతుకు తెరువు కోసం కుంరంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలోని పాట్నాపూర్ ఆంధ్ గూడా గ్రామానికి 1947 లో శాశ్వతంగా వలస వచ్చినారు.వ్యవసాయం చేస్తూ జీవనం కొనసాగించారు. తల్లి పుంజాబాయి, గురువు గణపతి వాడ్గురే భోధనలతో ప్రభావితమై పంచాగ్ని యోగసాధన తో పాటు వేదాలు,ఉపనిషత్తులు,ఆధ్యాత్మిక గ్రంథాలను చదివి పరమయోగి గా మారాడు.

బాబా కుటుంబ సభ్యులు :- తండ్రి పేరు ధోండోజీ,తల్లి పేరు పుంజాబాయి వీరికి ఇద్దరు కుమారులు,ఇద్దరు కూమార్తెలు మొదటి వాడు పూలాజీ బాబా,రెండో కుమారుని పేరు చాంపత్ రావు,కూతుళ్ళు జనాబాయి, జయాబాయి.పూలాజీ బాబా సతీమణులు సోనాబాయి,ద్రౌపత బాయి సోనాబాయికి ఒక కుమారుడు పేరు రాంచందర్,కుమార్తె పేరు సులోచనబాయి ద్రౌపతాబాయికి ఇద్దరు కుమారులు ఒక కుమార్తె కేశవ్,వామన్ కుమారులు కాగ కుమార్తె పేరు రుక్మాబాయి.

తత్త్వం

[మార్చు]

పూలాజీ బాబా తల్లి,గురువు గణపతి వాడ్గురే భోధనతో జ్ఞానాన్ని పొందారు.అనంత విశ్వంలో మనమున్నాము మనలోనూ విశ్వం దాగి ఉంది.పంచభూతాల నిలయం మానవ దేహం.ఈ దేహమే దేవాలయం,శరీరంలోని కుండలినీ శక్తిని ఉత్తేజితం చేయాలని ఇడ, పింగళ, సుషుమ్నా నాడుల త్రివేణి సంగంమై భృకుటివద్ద మనషును ఏకీకృతం చేస్తే ఆత్మసాక్షాత్కారం లభిస్తుందని బోధించాడు.దాని ద్వారా భగవత్ సాక్షాత్కారం లభించి ప్రశాంత జీవితం పొందగలరని ఆయన ఉద్భోధించాడు.జీవుడే దేవుడు అంటూ భక్తుల మానసిక వికాసానికి జీవితాంతం కృషి చేసి, గురు పీఠం గౌరవాన్ని పెంచిన పరమయోగి.శ్రీ సిద్ధి యోగ పీఠం శ్రీ సిద్ధేశ్వర సంస్థాన్ నెలకొల్పారు. దాదాపు ఐదు వందల కు పైగా ధ్యాన కేంద్రాలు స్థాపించి నాడు.[5]

తపస్సు

[మార్చు]

పూలాజీ బాబా 1965-66 లో ఆత్మసాక్షాత్కారమైంది. ఆ పరమేశ్వరుడు ఆత్మ సాక్షాత్కారం ప్రాప్తింపజేసి ధ్యానవస్థలో కూర్చోబెట్టారు.అప్పుడే దివ్యదృష్టి ప్రాప్తించింది అని అంటారు. మలంగి తపోభూమి లో పన్నెండు సంవత్సరాలు తప్పస్సు చేశారు.మలంగి అరణ్య ప్రదేశము దట్టమైన వృక్షాలు, చెట్లు,పొదలతో ఉండెను ఒక చిన్న నది తీర ప్రదేశంలో ఒక అల్లనేరేడు వృక్షం ఉండెను.నదిలో ఒక మడుగు ఉండెది. ఆ స్థలంలో ఆకాశం నుండి మేఘం కొన్ని క్షణాల వరకు మడుగులో సప్త వర్ణముల వర్షం కురిసి శక్తిపాతం జరిగింది.ఈ దివ్య అద్భుత ప్రదేశం పవిత్ర తీర్థక్షేత్రమైనది.ఈ క్షేత్రానికి శ్రీ సిద్ధేశ్వర సంస్థానం మలంగి అని నామకరణం చేశారు.ఖానాపూర్ శాసన సభ్యులైన గోవింద్ నాయక్ ఇచట భక్తుల కోసం సభా మండపము నిర్మించారు.బాబా ఇచటనే ధ్యాన స్థితిలో కూర్చునేవారు.ఈ స్థానం నుండే బాబా ధ్యాన మార్గ దర్శనం చేయడం ఆరంభించారు.ఇచటనే బాబా ఆధ్యాత్మిక సాక్షాత్కారము పొందారు.

బోధనలు

[మార్చు]

పూలాజీ బాబా జైనూర్ మండలం పాట్నాపూర్ లోని తన స్వంత చేనులో తొలి సారిగా సిద్ధ మహాయోగ పీఠ ధర్మ సేవా సమితి సిద్ధేశ్వర్ సంస్థాన్ ను స్థాపించారు. ప్రతి గురువారమున ఈ ధ్యాన కేంద్రంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్,మహారాష్ట్ర మొదలగు రాష్ట్రాల నుండి సుమారు మూడు వందల నుండి ఐదు వందల పిచ్చి పిచ్చిగా ప్రవర్తించే బాణామతి కలవారు,వివిధ శరీర,మానసిక రోగాలతో బాధపడుతున్న భక్తులు ఒక నెల లోని ఐదు గురువారాలు బాబా వారి దర్శనం చేసుకొనే వాళ్ళు.ధనవంతులు మొదలు కొని కటిక దరిద్రుల వరకు అనేకులు బాబా బోధనలతో తమ జీవితాలను మార్చుకున్నారు. అనేక మంది భక్తులు పులాజీ బాబా వారి భక్తి మార్గంలో నడిచి మాంసాహారులు శాఖాహారులు గా మారారు. పొగతాగడం మద్యం సేవించడం మొదలగు చెడు అలవాట్లు లకు దూరమై తమ జీవితాల్లో బంగారు బాట వేసుకున్నారు. బాబా బోధనలు ఎందరిలోనో ఆత్మవిశ్వాసాన్ని నింపాయి. బాబా బోధనల వలన అనేక మంది జీవితాలు ఇతరులకు ఆదర్శమయ్యాయి. బాబాను విమర్శించే వాళ్ళు బాబా పాదాక్రాంతులయ్యారు. బాబా భక్తులు నేటికి వారి సన్మార్గంలో జీవిస్తు వారి వారి గ్రామాల్లో ధ్యాన కేంద్రాలు నెలకొల్పారు.ఇప్పటికి బాబా వారి ధ్యాన కేంద్రాలు ఐదు వందల కంటే ఎక్కువే.మూడు నమ్మకాలకు చరమగీతం పాడి భక్తులలో సత్ప్రవర్తనను పెంచినారు. వేయల మంది హృదయాలలో నేటికి సుస్థిర స్థానం సంపాదించుకున్నారు.


సద్గురు దివ్య శ్లోకం

[మార్చు]

ఓం నమో పూలేశ్వరా సిద్ధయోగీ సిద్ధేశ్వర్ !

ప్రభూ సద్గురు యోగేశ్వరా త్రికాల జ్ఞానేయ ధ్యానేశ్వరా !!

ఓం శ్రీ పూలాజీ జ్ఞానేశ్వరా ,జ్ఞానోదయా చైతన్యేశ్వరా !

సద్గురు దివ్య నామ స్మరణ కరీతా జీవపాపే హారతి ముక్తేశ్వరా !!

ఓం ఆధ్యాత్మిక అరుణోదయా,దివ్యజ్ఞాని తేజేశ్వరా !

ఆది అనాదీ ఆత్మేశ్వరా,సత్యయుక్త మూళధర్మ విజేశ్వరా !!

ఓం పంచతత్వ నిరాకారేశ్వరా,కోటి-కోటి ప్రాణి ఆధారేశ్వరా !

దివ్య జ్ఞాన శక్తి పరమేశ్వరా,చరాచర సృష్టి నీలబిందు నీలేశ్వరా !!

ఓం వేదాంత సార వేదేశ్వరా, ఉపనిషదయుక్త సర్వేశ్వరా !

గీతామృత వర్ణన జగదీశ్వరా,శ్రీ పూలాజీ యోగీ మహేశ్వరా !!

పట్నాపూర్ భూమి పవిత్రాయ,రత్నజన్మలే పుంజాయి ధోండోజీ సుత !

పూలాజీ నామాయ పరమపావనం, తుజనమో సాష్టాంగ ప్రణామమ్ ప్రాణిపాత !

శ్రీ సచ్చిదానంద సద్గురు పూలాజీ సమర్థాయ నమః !

ఆరతి

[మార్చు]

ఆరతి తుఝీ కరీతో మీ త న్ మన్ అర్పూణ్ ఆజ్ సర్వ్ సుఖాచా దాతా ఆహె తూ జయ జయ జయ పూలరాజ్  !!ధయాళా!!

ఆగస్ట్ తీస్ లా జన్మ ఘేవునీ ,కేలె జగాచె కళ్యాణ్ నాస్తి కానా శుద్ధ బనవిలె,దేవుని ఆత్మజ్ఞాన  !!పూలాయె!!

తవ కృపేనె తుటతీల్ సారె, చౌర్యాంశీ బంధనే కరుణా కరశీ జీవన్ సవర్ శీ, పుంజాయీచ్యా నందనా  !! పూలాయె!!

జీవ శివాచె మిలన్ కరూని,కరశీ సాక్షాత్కార్ మానవతేచా ధర్మ జాగవీ ,థోర్ తుఝే ఉపకార్  !! పూలాయె!!

భక్త జనాలా వావిలీ ,లీలా నిరాకార్ సిద్ధిచా తూ సిద్ధ మహాత్మా శోభే జటాచే భార్  !!పూలాయె!!

విశ్వహితాచి తుమ్చి వాణీ , విశ్వహితాచె బోల్! దీన జనాలా ఉపదేశ కరశీ ,జ్ఞాన్ తుఝే ఆన్ మోల్  !! పూలాయె!!

సాంజ్, సకాళీ ఓవాళీన్ మీ, ఆరతి పంచప్రాణ్ దాస్ తుఝా మీ తవ చరమాశీ, గాయీన్ తుఝే గుణగాన్.  !!పూలాయె!! (రచన:దాదారావ్ మాఘాడె)

నినాదాలు

[మార్చు]
  • నేను మరణించవచ్చు

నా ధ్యానం మరణించవచ్చు కాని నా జ్ఞానం ఎన్నటికీ మరణించదు..... సద్గురు పూలాజీ బాబా

  • అనంత విశ్వంలో మనమున్నాం.

మనలో విశ్వం దాగి ఉంది. అదే ఈశ్వర రూపం..... సద్గురు పూలాజీ బాబా

  • కమలం చుట్టూ ఉన్న రేకులు

విభిన్న మతాలకు ప్రతీక రేకులన్నీ కలిస్తేనే పుష్పం తయారవుతుంది. అదే విధంగా సర్వధర్మాలు ఇదే సత్యాన్ని తెలియజేస్తున్నాయి. ధ్యానం చేయడం ద్వారా జ్ఞాన నేత్రాలు వికసిస్తాయి స్వస్వరూపాన్ని తెలుసుకొని భవ సాగరాన్ని అవలీలగా దాటి గమ్యాన్ని చేరుకోవచ్చు.....సద్గురు పూలాజీ బాబా

సంస్థలు

[మార్చు]

సద్గురు పూలాజీ బాబా పేరుతో బాబా వారి భక్తులు అతని పేరు తో అనేక ధ్యాన కేంద్రాలు పూలాజీ బాబా పాఠశాలాలు, పూలాజీ బాబా కళాశాలాలు,పూలాజీ బాబా డిగ్రీ కాలెజీలు, [6][7][8]విత్తనాల దుకాణాలు, పురుగుల మందుల దుకాణాలు, మెడికల్ షాపులు, మొబైల్ షాపులు ,కిరాణా దుకాణాలు ,బట్టల దుకాణాలు ఇలా అనేక దుకాణాలు నెలకొల్పారు.

చిత్రమాలిక

[మార్చు]

మరణం

[మార్చు]

తొంభై సంవత్సరాల పూలాజీ బాబా శ్వాసకోస వ్యాధితో బాదాపడుతు తేదీ:25 డిసెంబర్ 2018 న మహారాష్ట్ర నాందేడ్ జిల్లా లోని ఒక ప్రైయివెటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.అతని పార్థివ దేహాన్ని తెలంగాణా ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలోని పాట్నాపూర్ గ్రామంలో తాను నిర్మించుకున్న సమాధి లోనే ఖననం చేశారు. ఆ రోజున ఆసిఫాబాద్ జిల్లా పాలనాధికారి సేలవు ప్రకటించారు. మన తెలంగాణా ప్రభుత్వం అతని జన్మదిన వేడుకలను అధికారికంగా నిర్వహిస్తుంది.[9][10]

మూలాలు

[మార్చు]
  1. ABN (2021-03-15). "పూలాజీ బాబా బాటలో నడవాలి". Andhrajyothy Telugu News. Retrieved 2024-04-13.
  2. vskteam (2019-01-03). "గిరిజనులను సన్మార్గంలో నడిపించిన పూలాజీ బాబా". VSK Telangana (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2024-04-13.
  3. "Pulaji Baba Archives". VSK Telangana (in అమెరికన్ ఇంగ్లీష్). 2019-01-03. Retrieved 2024-04-13.
  4. "Sri Sri Sri Paramahansa Sadguru Phulaji Baba - Utnoor". wikimapia.org (in ఇంగ్లీష్). Retrieved 2024-04-13.
  5. ABN (2022-01-31). "పూలాజీ బాబా ధ్యాన కేంద్ర వార్షికోత్సవం". Andhrajyothy Telugu News. Retrieved 2024-04-13.
  6. "Sri Pulaji Baba Degree College". www.collegesindia.net. Retrieved 2024-04-13.[permanent dead link]
  7. vidyavision.com. "Sri Pulaji Baba Degree College, Adilabad - Courses, Fees, Placements & Apply". Vidyavision. Retrieved 2024-04-13.
  8. "Sri Pulaji Baba Degree College, # 1-36/1, Near IB Chowk, Utnoor - Course's, Admissions, Scholarship, Hostel Contact, Website, Facilities 2024-2025". College Directory (in ఇంగ్లీష్). Retrieved 2024-04-13.
  9. telugu, NT News (2022-11-24). "పూలాజీ బాబా జీవితం ఆదర్శం". www.ntnews.com. Retrieved 2024-04-13.
  10. ABN (2023-08-23). "30న పూలాజీబాబా జన్మదిన వేడుకలు". Andhrajyothy Telugu News. Retrieved 2024-04-13.