సమర్థ రామదాసు
సద్గురు సమర్ధ రామదాసు | |
---|---|
జననం | నారాయణ 1608 (చైత్ర శుద్ధ నవమి) మరాఠ్వాడాలోని ఔరంగాబాద్ నందలి శంభాజీనగర్ కు 100 మైళ్ల దూరంలోని జామ్ అనే గ్రామం |
మరణం | 22-01-1682 (మాఘ బహుళ నవమి) |
మరణ కారణం | దేహ త్యాగంతో శివైక్యం |
ఇతర పేర్లు | సమర్ధ రామదాసు |
వృత్తి | సామాజిక ధ్యేయంతో పనిచేసిన యోగిపుంగవుడు |
ప్రసిద్ధి | సమర్ధ రామదాసు |
భార్య / భర్త | అవివాహితుడు |
తండ్రి | సూర్యాజీ పంత్ ఠోసాల్ (పూజారి) |
తల్లి | రాణూభాయి (గృహిణి) |
భారతదేశ చరిత్రలో సమర్దరామదాసు పాత్ర చాలా కీలకమైనది. ప్రధానంగా అనేక సంకటాలలో అణగారపోయిన హిందూ జాతిని జాగృతం చేయడంలో తను ప్రత్యేకమైన వ్యూహాత్మక ప్రణాళికను అవలంబించాడు.శివాజీకి మత గురువు ఛత్రపతి శివాజీ హిందవీ స్వరాజ్యాన్ని ఏర్పరచి మలుపు తిప్పటంలో సమర్ధ రామదాసు పాత్ర గురుతుల్యమైనది.
జన్మవృత్తాంతం
[మార్చు]1608 చైత్ర శుద్ధ నవమి (శ్రీరామ నవమి) రోజు సమర్ద రామదాసు జన్మించారు. మహారాష్ట్రలో ఇప్పటికీ ఈ రోజుని ‘దాస నవమి’గా జరుపుకుంటారు. ఔరంగాబాద్ లోని శంభాజీనగర్కు 100 మైళ్ళ దూరంలోని జామ్ అనే గ్రామంలో ఈయన జన్మించారు. తండ్రి సూర్యాజీపంత్ ఠోసాల్ ఆ గ్రామంలోని శ్రీరామ మందిరంలో పూజారి, తల్లి రాణూభాయి గృహిణి. ఒకనాడు సూర్యాజీ పంత్ శ్రీరామ మందిరంలో భక్తులకు శ్రీరామ జనన ఘట్టం వున్న అద్యాయాన్ని ప్రవచిస్తున్న సమయంలోనే రాణూబాయికి మగసంతానం కలిగిందట. అందుకే సూర్యనారాయణుని ప్రసాదంగా భావించి ఆ బాలుడికి ‘నారాయణ’ అని మొదట పేరు పెట్టారు. అలా నామకరణం జరిగిన రోజు వైశాఖ పూర్ణిమ. తల్లిదండ్రులతో పాటు జామ్ నగరమంతా ఆనందంతో సంబరాలు చేసుకున్నదట. ఆనందంతో నాట్యం చేస్తూ ఇలా పాటలు పాడారని ఇప్పటికీ చెప్పుకుంటుంటారు.
‘దోన్ ప్రహారీకాం గ శిరీ సూర్యథాంబలా - నారోబా జన్మలా గ సఖీ నారోబా జన్మలా’
(సరిగ్గా మిట్టమధ్యాహ్నం 12 గంటలకు సూర్యుడు కాసేపు ఆగిపోయాడు ఎందుకో తెలుసా? నారాయణుడు జన్మించాడు, సఖులారా, నారాయణుడు జన్మించాడు - అని ఆ పాటకు అర్ధం) నారాయణ కంటే మూడుసంవత్సరాలకు ముందు పుట్టి అతనికి అన్నస్థానంలో వున్న వాడు గంగాధర్. పిల్లలు లేరనుకుంటున్న సమయంలో రాణూభాయి, సూర్యాజీల వివాహం అయిన 24 సంవత్సరాల తర్వాత గంగాధర్ పుట్టాడు. ఆతర్వత 3 సంవత్సరాలకు నారాయణ జన్మించాడు
తాత్త్విక చింతన
[మార్చు]లోతుగా ఆలోచించడం ఇతనికి చిన్నతనం నుండే అబ్బింది. బాగా అల్లరి చేస్తున్నాడని ఒకనాడు తల్లి కోప్పడితే అలిగిన నారాయణ ఒక రోజంగా చీకటి గదిలో కూర్చుని ధ్యానం చేసుకుంటూ గడిపుతుండటం తల్లికి కనిపించింది.‘ నారాయణా ! ఏం చేస్తున్నావు నాయనా ( కాయ్ కరతా నారాయణా) అని తల్లి అడిగింది.
‘ప్రపంచం గురించి ఆలోచిస్తున్నాను ’ (చింతా కర్ తో విశ్వా చీ) అని ఆ పిల్లవాడు బదులిచ్చాడట. ఈ మాటలువినగానే సన్యాసిగా మారిపోయి తన బిడ్డ ఎక్కడికి వెళ్లిపోతాడో అని ఆ తల్లికి చింత ప్రారంభం అయ్యింది.
దేశాటన, అంతర్మధనం
[మార్చు]హనుమాన్ దేవాలయం, సారంగపూర్
[మార్చు]సమర్ధరామదాసు తెలంగాణలో కూడా తిరుగాడారు.నిజామాబాదుకి 5 కి.మీ. ల దూరంలో చిన్న కొండమీద వున్న గుడి ఇది. గుడి చిన్నదయినా ఆవరణ విశాలమైనది. చాలా ఆకర్షణీయంగా వుంటుంది. గుడి మొత్తం, ముందు ధ్వజ స్తంభంతోసహా సింధూర వర్ణంతో కనులవిందు చేస్తుంది. ఖిల్లా రఘునాధాలయంలాగానే ఈ ఆలయానికీ, ఛత్రపతి శివాజీకీ సంబంధముంది. ఛత్రపతి శివాజీ గురువైన ఇతను ఆ ఆలయంలోని ఆంజనేయస్వామి విగ్రహం ఆకారాన్ని స్వయంగా గీసి, ఆ రూపురేఖల ప్రకారం విగ్రహాన్ని చేయించి ఇక్కడ స్ధాపించారుట. చుట్టూ మఠాధిపతుల సమాధులు ఉన్నాయి.
బోధనలు
[మార్చు]పరమాత్మ చెట్టు యొక్క జీవశక్తి లాంటివాడు. దానివలన చెట్టు ఏర్పడుతుంది, జీవిస్తుంది, పెరుగుతుంది. అదే పువ్వు కాయ కొమ్మ ఆకులలో వ్యక్తం అవుతుంది. ఒక్కొక్క భాగం ఒక్కొక్క ప్రయోజనం కల్గియుంటుంది. కాని అన్నీ ఆప్రాణ రూపమే. దేవతలంతా ఇటువంటి వృక్ష భాగాలు పరమాత్మ ఆ వృక్షం యొక్క ప్రాణం దాని రూపం సద్గురువు. అసలు సమర్ధ రామదాసు 'దాసబోధ ' లో అంటారు. "సద్గురువును కొల్చేవారు వేరే దైవాలను కొలవనక్కర్లేకపోవడమే కాదు, కొలవడం అనుచితం కూడా ముక్తి నివ్వగల సద్గురువును కొల్చాక" అని అంటారీయన
దేహాన్ని చాలించుట
[మార్చు]చిత్రమాలిక
[మార్చు]-
వరప్రసాదితుడు
-
బాల్యం
-
తపస్సు
-
శ్రీరాముని ద్వారా ప్రాణ రక్షణ
-
శివాజీతో అపూర్వ కలయిక
-
సమర్థ రామదాసుని చరిత్రము పై 1931లో వెలువడిన ఒక పుస్తకం
బయటి లింకులు
[మార్చు]- తెగిపోయిన ఫైలులింకులు గల పేజీలు
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- Wikipedia articles with ISNI identifiers
- Wikipedia articles with GND identifiers
- Wikipedia articles with BNF identifiers
- 1608 జననాలు
- 1682 మరణాలు
- మహారాష్ట్ర వ్యక్తులు
- హిందూ రచయితలు
- మరాఠీ రచయితలు
- ఆధ్యాత్మిక గురువులు