సయ్యద్ బద్రుద్దోజా
సయ్యద్ బద్రుద్దోజా | |
---|---|
కలకత్తా మేయర్ | |
In office 1943 - 1944 | |
వ్యక్తిగత వివరాలు | |
జననం | ముర్షిదాబాద్ జిల్లా, బెంగాల్ ప్రెసిడెన్సీ, బ్రిటిష్ ఇండియా | 1900 జనవరి 4
మరణం | 1974 నవంబరు 18 | (వయసు 74)
రాజకీయ పార్టీ | ముస్లిం లీగ్ |
సంతానం | 10 (సయ్యదా సకీనా ఇస్లాం, సయ్యదా రజియా ఫైజ్) |
వృత్తి | రాజకీయ నాయకుడు |
సయ్యద్ బద్రుద్దుజా (1900, జనవరి 4 - 1974, నవంబరు 18) బెంగాలీ రాజకీయ నాయకుడు, పార్లమెంటేరియన్, కార్యకర్త.[1] పశ్చిమ బెంగాల్ శాసనసభ సభ్యుడు, భారత పార్లమెంట్ లోక్ సభ సభ్యుడు, కలకత్తా మేయర్.[1] ఖిలాఫత్ ఉద్యమం, శాసనోల్లంఘన ఉద్యమం వంటి వలసవాద వ్యతిరేక ఉద్యమాలలో పాల్గొన్నాడు. హుసేన్ షహీద్ సుహ్రావర్ది యునైటెడ్ బెంగాల్ ప్రతిపాదనకు న్యాయవాది.[1]
ప్రారంభ జీవితం, విద్య
[మార్చు]బద్రుద్దుజా 1900, జనవరి 4న ముర్షిదాబాద్ జిల్లాలోని తాలిబ్‌పూర్ గ్రామంలో సయ్యద్ అబ్దుల్ గఫూర్‌కు జన్మించాడు. కలకత్తా మదరసా, కలకత్తా ప్రెసిడెన్సీ కళాశాల, కలకత్తా విశ్వవిద్యాలయంలో చదువుకున్నాడు. ఎంఏ, ఎల్.ఎల్.బి. సంపాదించాడు.
రాజకీయ జీవితం
[మార్చు]బద్రుద్దుజా ప్రోగ్రెసివ్ ముస్లిం లీగ్‌లో చేరి కార్యదర్శిగా పనిచేశాడు. చిత్త రంజన్ దాస్, సుభాష్ చంద్రబోస్, హుసేన్ షహీద్ సుహ్రవర్ది వంటి బెంగాలీ నాయకులతో కలిసి భారత స్వాతంత్ర్య ఉద్యమంలో పనిచేశాడు.[1] క్రిషక్ ప్రజా పార్టీతో కూడా సంబంధం కలిగి ఉన్నాడు.[2] తర్వాత ఇండిపెండెంట్ డెమోక్రటిక్ పార్టీ అధ్యక్షుడయ్యాడు.[2] బెంగాల్‌లోని ప్రోగ్రెసివ్ అసెంబ్లీ పార్టీ కార్యదర్శిగా, బెంగాల్ ప్రోగ్రెసివ్ కూటమి పార్టీ అధ్యక్షుడిగా కూడా పనిచేశాడు.[2] 1943 నుండి 1944 వరకు కోల్‌కతా మేయర్‌గా ఉన్నాడు. విభజన తర్వాత భారతదేశంలోనే ఉండాలని నిర్ణయించుకున్నాడు.[1][3]
నిర్వర్తించిన పదవులు
[మార్చు]- 1940-46 బెంగాల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యుడు
- 1946-47 బెంగాల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యుడు
- 1948-52, 1957-62 పశ్చిమ బెంగాల్ శాసనసభ సభ్యుడు
- 1962-67 మూడవ లోకసభ సభ్యుడు
- 1967-70 నాలుగవ లోకసభ సభ్యుడు[2]
వ్యక్తిగత జీవితం, మరణం
[మార్చు]బద్రుద్దుజా రాకియా ఖాతూన్‌ను వివాహం చేసుకున్నాడు.[4] వారికి సయ్యద్ సకీనా ఇస్లాం, సయ్యద్ మొహమ్మద్ అలీ (మ. 2010), సయ్యదా సల్మా రెహమాన్, సయ్యదా రజియా ఫైజ్ (1936–2013), సయ్యద్ హైదర్ అలీ, సయ్యదా అసియా ఖాదిర్, సయ్యద్ అష్రఫ్ అలీ (1939–2016), సయీదా ఫాతిమా ఇస్లాం, సయ్యద్ రెజా అలీ, సయ్యదా జాకియా అహ్సన్ అనే పిల్లలు ఉన్నారు.[5] ఇతను 1974, నవంబరు 18న మరణించాడు[6]
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 1.3 1.4 Islam, Sirajul (2012). "Badrudduja, Syed". In Islam, Sirajul; Syed, Mohammed (eds.). Banglapedia: National Encyclopedia of Bangladesh (Second ed.). Asiatic Society of Bangladesh.
- ↑ 2.0 2.1 2.2 2.3 "Members : Lok Sabha". Parliament of India. Retrieved 14 September 2017.
- ↑ Malik, Iftikhar H. (1991). Us-South Asian Relations 1940-47: American Attitudes Toward The Pakistan Movement (in ఇంగ్లీష్). Springer. p. 176. ISBN 9781349212163.
- ↑ "Former Islamic Foundation DG, scholar Syed Ashraf Ali dies". bdnews24.com. Retrieved 14 September 2017.
- ↑ Ahsan, Syed (12 October 2012). "Remembering Syed Mohammad Ali". The Daily Star. Archived from the original on 23 మార్చి 2023. Retrieved 14 September 2017.
- ↑ Ahsan, Syed (18 November 2015). "Syed Badrudduja . . . the erudite politician". The Daily Observer. Archived from the original on 18 జూలై 2023. Retrieved 14 September 2017.