Jump to content

సరబ్ జోత్ సింగ్

వికీపీడియా నుండి
సరబ్ జోత్ సింగ్
Personal information
Nationalityబారతీయుడు
Born (2001-09-30) 2001 సెప్టెంబరు 30 (age 23)
Occupationషూటర్
Sport
Countryభారతదేశం
Sportషూటింగ్
Event10 మీటర్ల ఎయిర్ పిస్టల్
Medal record
Representing  భారతదేశం
ఒలింపిక్ క్రీడలు
Bronze medal – third place 2024 పారిస్ 10మీ ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్
ఆసియా క్రీడలు
Gold medal – first place 2022 హాంగ్జౌ 10మీ ఎయిర్ పిస్టల్ టీమ్
Silver medal – second place 2022 హాంగ్జౌ 10మీ ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్
ప్రపంచ కప్
Gold medal – first place 2023 భోపాల్ 10మీ ఎయిర్ పిస్టల్ పురుషులు
Gold medal – first place 2023 బాకు 10మీ ఎయిర్ పిస్టల్ మిక్స్ టీమ్
ఆసియా ఛాంపియన్‌షిప్‌
Bronze medal – third place 2023 చాంగ్వాన్ 10మీ ఎయిర్ పిస్టల్
Bronze medal – third place 2019 దోహా 10మీ ఎయిర్ పిస్టల్ (పురుషుల జట్టు)
Gold medal – first place 2019 దోహా 10మీ ఎయిర్ పిస్టల్ (మిక్స్ టీమ్)
ప్రపంచ ఛాంపియన్‌షిప్
Gold medal – first place 2019 సుహ్ల్ 10మీ ఎయిర్ పిస్టల్ జూనియర్ పురుషులు (వ్యక్తిగతం)
జూనియర్ ప్రపంచ కప్
Silver medal – second place 2019 జర్మనీ 10మీ ఎయిర్ పిస్టల్ పురుషులు (వ్యక్తిగతం)
Gold medal – first place 2019 జర్మనీ 10మీ ఎయిర్ పిస్టల్ (జట్టు)
Silver medal – second place 2019 జర్మనీ 10మీ ఎయిర్ పిస్టల్ (మిక్స్ టీమ్)

సరబ్ జోత్ సింగ్ (జననం 2001 సెప్టెంబరు 30) ఒక భారతీయ షూటర్ క్రీడాకారుడు. ఆయన ఒలింపియన్ పతక విజేత. ఆయన 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో పోటీపడతాడు. ఆయన 2024 పారిస్‌లో జరిగిన సమ్మర్ ఒలింపిక్స్‌లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో మను భాకర్‌తో కలిసి కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు, ఇది ఆ ఒలింపిక్స్‌లో భారతదేశానికి రెండవ పతకం.

ప్రారంభ జీవితం

[మార్చు]

సరబ్ జోత్ హర్యానాలోని బరారా బ్లాక్ అంబాలాలోని ధీన్ గ్రామానికి చెందినవాడు. అతను జతీందర్ సింగ్ అనే రైతు, గృహిణి అయిన హర్దీప్ కౌర్‌ల కుమారుడు.[1] చండీగఢ్‌లోని సెక్టార్ 10లోని డిఎవి కాలేజీలో ఆయన చదువుకున్నాడు.[2][1] అతను సెంట్రల్ ఫీనిక్స్ క్లబ్‌లోని కోచ్ అభిషేక్ రాణా అంబాలా కాంట్-ఆధారిత ఎఆర్ షూటింగ్ అకాడమీలో శిక్షణ పొందుతున్నాడు.[1]

కెరీర్

[మార్చు]

2022 ఆసియా క్రీడలు, చైనాలోని హాంగ్‌జౌలో పాల్గొన్న భారత షూటింగ్ జట్టులో ఆయన ఒక సభ్యుడు.[3] 2022 ఆసియా క్రీడల్లో సరబ్‌జోత్ సింగ్, అర్జున్ సింగ్ చీమా, శివ నర్వాల్‌లతో కూడిన భారత 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ జట్టు చైనాను ఓడించి స్వర్ణం సాధించింది.[4] ఆసియా క్రీడల షూటింగ్ పోటీ మిక్స్‌డ్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్‌లో దివ్య టీఎస్‌తో కలిసి సరబ్ జోత్ భారత్‌కు రజత పతకాన్ని అందించాడు.[5][6][7]

అంతకుముందు 2021లో, అతను ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ల వ్యక్తిగత, టీమ్ ఈవెంట్‌లలో స్వర్ణం గెలుచుకున్నాడు. 2019లో ISSF జూనియర్ ప్రపంచకప్‌లో స్వర్ణం సాధించాడు.

అతను 2024 సమ్మర్ ఒలింపిక్స్‌లో పారిస్‌లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో మను భాకర్‌తో కలిసి కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు.[8]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 "Sarabjot adds another feather in DAV College's cap with team shooting gold at Asiad". Hindustan Times (in ఇంగ్లీష్). 2023-09-29. Retrieved 2023-11-19.
  2. "ఆర్కైవ్ నకలు". adanisportsline.com. Archived from the original on 2023-10-09. Retrieved 2023-09-30.
  3. "Indian shooters at Asian Games: Events, key dates, format and rules". ESPN (in ఇంగ్లీష్). 2023-09-24. Retrieved 2023-09-28.
  4. "Asian Games 2023: Shooters Sarabjot Singh, Arjun Singh Cheema And Shiva Narwal Power India To 6th Gold, Win 10m Air Pistol Team Event". Zee News (in ఇంగ్లీష్). Retrieved 2023-09-28.
  5. "Sarabjot, Divya get silver after losing thriller to China, Indian shooters bag their 19th medal at Asian Games 2023". Hindustan Times (in ఇంగ్లీష్). 2023-09-30. Retrieved 2023-09-30.
  6. "Asian Games 2023: Shooters Sarabjot Singh, Divya TS Add Silver Medal To India's Medal Tally". English Jagran (in ఇంగ్లీష్). 2023-09-30. Retrieved 2023-09-30.
  7. Sportstar, Team (2023-09-28). "Indian shooters clinch gold in 10m air pistol team event at Asian Games 2023". Sportstar (in ఇంగ్లీష్). Retrieved 2023-09-28.
  8. "Olympics 2024: భారత్‌కు మరో పతకం.. షూటింగ్‌లో కాంస్య సాధించిన మను బాకర్‌, సరబ్‌జ్యోత్‌ సింగ్". EENADU. Retrieved 2024-07-30.