సలీం దుర్రానీ

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
Salim Durani
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు Salim Aziz Durani
జననం (1934-12-11) 11 డిసెంబరు 1934 (వయస్సు: 83  సంవత్సరాలు)
kabul , Afghanistan
బ్యాటింగ్ శైలి Left-hand bat
బౌలింగ్ శైలి Slow left-arm orthodox
పాత్ర All-rounder
సంబంధాలు Abdul Aziz Durani (father)
అంతర్జాతీయ సమాచారం
జాతీయ జట్టు India
టెస్టు అరంగ్రేటం(cap 95) 1 December 1960 v Australia
చివరి టెస్టు 6 February 1973 v England
దేశవాళీ జట్టు సమాచారం
సంవత్సరాలు జట్టు
1953 Saurashtra cricket team
1954–1956 Gujarat cricket team
1956–1978 Rajasthan cricket team
కెరీర్ గణాంకాలు
Competition Test First-class
Matches 29 170
Runs scored 1202 8545
Batting average 25.04 33.37
100s/50s 1/7 14/45
Top score 104 137*
Balls bowled 6446 28130
Wickets 75 484
Bowling average 35.42 26.09
5 wickets in innings 3 21
10 wickets in match 1 2
Best bowling 6/73 8/99
Catches/stumpings 14/- 144/4
Source: CricketArchive, 12 June 2013

డిసెంబర్ 11, 1934అఫ్ఘనిస్తాన్ లోని కాబూలు లో జన్మించిన సలీం దుర్రానీ (Salim Aziz Durani) భారతదేశపు మాజీ క్రికెట్ క్రీడాకారుడు. ఇతడు 1960 నుంచి 1973 మధ్య కాలంలో భారత్ తరఫున 29 టెస్టులకు ప్రాతినిధ్యం వహించాడు. అప్ఘనిస్తాన్‌లో జన్మించి టెస్ట్ క్రికెట్ ఆడిన ఏకైక క్రీడాకారుడైన[1] దుర్రానీ బ్యాటింగ్ మరియు బౌలింగ్‌లలో మంచి ప్రావీణ్యం కల ఆల్‌రౌండర్.

1961-62 లో ఇంగ్లాండుతో జరిగిన టెస్ట్ సీరీస్‌లో కలకత్తా, మద్రాసు టెస్టులలో 8 మరియు 10 వికెట్లు చొప్పున పడగొట్టి భారత విజయానికి దోహదపడ్డాడు. దుర్రానీ భారత్ తరఫున 29 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి 25.04 సగటుతో 1202 పరుగులు చేశాడు. అందులో ఒక సెంచరీ మరియు 7 అర్థసెంచరీలు ఉన్నాయి. అతడి అత్యధిక స్కోరు వెస్ట్‌ఇండీస్ పై 1962లో సాధించిన 104 పరుగులు. బౌలింగ్‌లో కూడా 35.42 సగటుతో 75 వికెట్లు తీశాడు. అందులో ఒకే ఇన్నింగ్సులో 5 వికెట్లు 3 సార్లు, ఒకే టెస్టులో 10 వికెట్లను ఒకసారి సాధించాడు. అతడి అత్యుత్తమ బౌలింగ్ విశ్లేషణ 73 పరుగులకు 6 వికెట్లు.

క్రికెట్ నుంచి రిటైర్‌మెంట్ పొందిన తరువాత పర్వీన్ బాబీ సినిమాలో నటించాడు.

బయటి లింకులు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. http://users.skynet.be/hermandw/cricket/testntlt.html