సహాయం:వికీపీడియా శైలి గురించి పరిచయం/1
శైలి
వ్యాసం లోని విభాగాలు
బొమ్మలు, మూలాలూ
లింకులు
ఏకరీతిగా
సారాంశం
|
![]() వికీపీడియా వ్యాసాల ఆకృతి ఎలా ఉండాలో వికీపీడియా:శైలి వివరిస్తుంది. ఈ మార్గదర్శకాలను అనుసరిస్తే, వికీపీడియా స్పష్టం గాను, ఏకరీతి గాను, స్థిరం గానూ ఉంటుంది తేలికైన పద్ధతి ఏంటంటే, చక్కగా రాసిన ఒక మంచి వ్యాసాన్ని చూసి దాని ఆకృతిని అనుసరించి పోవడమే. ఆకృతి గురించి మరింత సమాచారం కావాలంటే మాత్రం వికీపీడియా:శైలి ని, దాని అనుబంధ పేజీలనూ చూడడమే. శైలి అనేది ఒక మార్గదర్శకం మాత్రమే. దాన్ని బట్టీ పట్టనక్కరలేదు! పేజీ ఆకృతిని మలచేటపుడు ఏది ఉత్తమమైన పద్ధతో నిశ్చయించుకునేందుకు అది సాయపడుతుంది. అలాగే ఆకృతి విషయంలో వేరే వాడుకరులతో భిన్నాభిప్రాయం ఏర్పడినపుడు, నిర్ణయం తీసుకోవడానికి కూడా శైలి పనికొస్తుంది. ఏదేమైనప్పటికీ, ఆకృతి కంటే కంటెంటు ముఖ్యం. మీకు సందేహాలేమైనా ఉంటే, ఇతర వాడుకరులు సాయం చేస్తారు. (వాళ్ళు సదుద్దేశం తోనే సాయపడుతున్నారని గ్రహించండి).
|