సహాయం:వికీపీడియా శైలి గురించి పరిచయం/2
శైలి
వ్యాసం లోని విభాగాలు
బొమ్మలు, మూలాలూ
లింకులు
ఏకరీతిగా
సారాంశం
|
![]() వ్యాసం, దాని విషయానికి సంబంధించిన సరళమైన సారాంశంతో మొదలు కావాలి. అక్కడి నుండి మరిన్ని వివరాల దిశగా పాఠకుడిని నడిపించాలి. తర్కబద్ధంగా ఉండే శీర్షికలతో పాఠ్యాన్ని విభాగాలుగా విభజించాలి. ప్రవేశికప్రవేశిక అనేది వ్యాసపు మొదటి భాగం. విషయ సూచిక కంటే పైన ఇది కనిపిస్తుంది. ప్రవేశిక మొదటి వాక్యం సాధారణంగా వ్యాస విషయాన్ని నిర్వచిస్తూ, విషయ ప్రాముఖ్యతను చూపించాలి. ప్రవేశికలోని మిగిలిన భాగం, వ్యాస సందర్భాన్ని పరిచయం చేస్తూ, దాని ముఖ్య అంశాలను సంగ్రహంగా చూపించాలి. ప్రవేశిక నాలుగు పేరాల దాకా పొడవు ఉండాలి. వ్యాసం మొత్తాన్నీ సంక్షిప్తంగా అవలోకనం చేస్తూ దానికదే ఒక సంక్షిప్త వ్యాసం లాగా ఉండాలి. ఓ వాక్యానికి ప్రవేశికలో ఎంత ప్రాముఖ్యత ఇస్తామనేది, వ్యాసంలో ఆ విషయానికి ఉన్న ప్రాముఖ్యతను బట్టి నిర్ణయించాలి. సాధారణంగా మిగతా వ్యాసంలో ఉన్న పాఠ్యం లోని ముఖ్యమైన భాగాలనే ప్రవేశికలో రాయాలి. అలా కాకుండా వేరే పాఠ్యాన్ని రాసినపుడు దానికి తగిన ఆధారాలను కూడా చేర్చాలి. వ్యాసం మొత్తం చదవాలనే ఉత్సాహం కలిగించేలా ప్రవేశిక ఉండాలి. వ్యాసం లోని మిగిలిన పాఠ్యం పాఠకులకు మరిన్ని వివరాలు ఇస్తుంది. విభాగాలు, శీర్షికలువ్యాసాలను విభాగాలు, ఉపవిభాగాలుగా విభజించాలి. ప్రతి చిన్న శీర్షిక విషయ సూచికలో కనిపిస్తుంది. సాధారణంగా, ఒకటి నుండి నాలుగు పేరాలు పొడవున్న విభాగాలు చదివేందుకు అనుకూలంగా ఉంటాయి. విభాగాల శీర్షికలు వీలైనంత క్లుప్తంగా ఉండాలి. విభాగం పేరులో వ్యాసం పేరు రాయకండి. శీర్షిక 1 అనేది వ్యాసం పేరు. దీన్ని సాఫ్టువేరే ఆటోమాటిగ్గా చూపిస్తుంది. వ్యాసం లోని విభాగాల శీర్షికలు రెండవ స్థాయిలో మొదలౌతాయి - (==శీర్షిక 2==). మూడవ స్థాయి (===శీర్షిక 3===),.. ఇలాగ. విభాగాల నుండి ఉప విభాగాలు వరుస లోనే ఉండాలి. ఒక స్థాయిని వదిలేసి తరువాతి స్థాయికి వెళ్ళకూడదు. (ఉదాహరణకు, రెండవ స్థాయి శీర్షిక తరువాత నేరుగా నాలుగో స్థాయి శీర్షికకు వెళ్ళకూడదు).
|