బొమ్మలు వ్యాసాన్ని మించెత్తకూడదు. వ్యాసం లోని పాఠ్యానికి అవి మద్దతుగా ఉండాలి.
వివాదాస్పదమైన విషయానికి లేదా సవాలు చేసే అవకాశం ఉన్న సమాచారానికి మద్దతుగా మూలాలను ఉల్లేఖించాలి.
బొమ్మలు
చిత్రాలు పాఠకులను విషయాన్ని అర్థం చేసుకోవడానికి సహాయపడతాయి. బొమ్మలు పాఠ్యపు వచనానికి మద్దతుగా ఉంటాయని భావిస్తేనే వాటిని చేర్చండి. ఈసరికే ఉన్న బొమ్మల స్థానంలో కొత్తవాటిని చేర్చదలిస్తే, పాత వాటి కంటే మెరుగ్గా ఉంటేనే బొమ్మలను మార్చండి. బొమ్మను సృష్టించేటప్పుడు, ఎక్కించేటపుడు, ఇది అధిక రిజల్యూషన్ కలిగి ఉండేలా చూడండి. అది సరైన ఫైలు ఆకృతిలో ఉండేలా చూసుకోండి.
బొమ్మలు వ్యాసమంతటా సమానంగా పరుచుకుని ఉండాలి. అవి పెట్టిన విభాగం లోని పాఠ్యానికి చెందినవై ఉండాలి. వాటికి వివరణాత్మకమైన వ్యాఖ్య ఉండాలి. బొమ్మలను చిన్న సూక్ష్మచిత్రాలుగా (థంబ్నెయిల్) చూపించబడతాయి. పేజీ పొందిగ్గా కనబడేందుకు గాని సాధారణంగా వాటిని పేజీకి కుడి వైపున పేరుస్తారు. అవసరమైతే, ఇతర ఆకృతుల్లో కూడా పెట్టుకోవచ్చు.. ఉదా. ఎడమ-వైపున, గ్యాలరీలు, పనోరామాలు.
చిన్న విభాగంలో అనేక చిత్రాలను ఇరికించకండి: అవి ఆ విభాగంలో పట్టవు కాబట్టి సహజం గానే కింది విభాగాల్లోకి చొచ్చుకుపోతాయి. . అవి చూడడానికి అనువుగా ఉండవు. (ప్రామాణిక లేఅవుట్ 1024 × 768 స్క్రీన్ రిజల్యూషనుకు అనుగుణంగా ఉంటుంది).
మూలాల నుండి కొటేషన్లను అతిగా ఉపయోగించవద్దు; వ్యాసాలను సాధారణంగా స్వంత వాక్యాల్లో రాయాలి. విషయం గురించి చెబుతున్న మూలాల్లోని సారాంశాన్ని గ్రహించాలి.
విశ్వసనీయ వనరులను ఉపయోగించండి.
వ్యాసంలో ఈ సరికే ఉన్న ఉల్లేఖనా శైలిని వాడండి. వ్యాసానికి అడుగున మూలాల జాబితాను చేర్చండి
వివాదాస్పదమైన విషయాలను లేదా సవాలు చేసే అవకాశం ఉన్న విషయాలను చేర్చేటప్పుడు, ఎవరినైనా కోట్ చేసేటప్పుడు, జీవిస్తున్న వ్యక్తి జీవిత విశేషాలను చేర్చేటప్పుడు, బొమ్మను ఎక్కించేటపుడూ మూలాలను ఉదహరించాలి. ఉల్లేఖనలను సరిగ్గా ఫార్మాట్ చేసినా లేకున్నా, పాఠకుడికి మూలాన్ని గుర్తించడానికి అవసరమైన సమాచారాన్నంతటినీ మాత్రం తప్పక చేర్చాలి; ఆకృతినిసవరించే పని అవసరమైతే వేరెవరైనా చెయ్యగలరు .
చిత్రాలకు ఉన్నట్లుగానే, ఉల్లేఖనలకూ ఒక డిఫాల్ట్ శైలి ఉంది. కానీ కొన్నిసార్లు వేరే ఆకృతి శైలిని ఉపయోగించే అవకాశం కూడా ఉంది (ఉదా. బ్రాకెట్లలో మూలాలు). క్రొత్త ఉల్లేఖనలను చేర్చేటప్పుడు, వ్యాసంలో ఇప్పటికే ఉపయోగించిన శైలినే ఉపయోగించండి. ఒకవేళ మార్చాలనుకుంటే, ముందు చర్చ పేజీలో ఏకాభిప్రాయం సాధిందండి. వ్యాసంలో చొప్పించిన ఇన్లైన్ సూచనలు ఆటోమాటిగ్గా వ్యాసం అడుగున ఉండే "మూలాలు" విభాగం లోకి చేరుతాయి (వీటిని "ఇవి కూడా చూడండి" విభాగానికి క్రింద, "బాహ్య లింకులు" విభాగానికి పైన ఉంచాలి)