సహాయం:వికీపీడియా శైలి గురించి పరిచయం/4
శైలి
వ్యాసం లోని విభాగాలు
బొమ్మలు, మూలాలూ
లింకులు
ఏకరీతిగా
సారాంశం
|
లింకులు![]() హైపర్ లింకుతో లింకు వేయడం వికీపీడియా లోని ముఖ్యమైన లక్షణం. అంతర్గత లింకులు (లేదా "వికీలింకులు") ప్రాజెక్టు లోని పేజీలను ఒకదానితో ఒకటి అనుసంధానిస్తాయి. ప్రాజెక్టు లోని స్థానాలకు లింకులు తక్షణ మార్గాలను అందిస్తాయి. పాఠకులు చదువుతూన్న అంశంపై అవగాహనను పెంచుతాయి. ఈ పాఠాల్లోని ఎడిటింగు విభాగంలో లింకులను ఎలా చేర్చాలో మీరు నేర్చుకుంటారు. ఒక వ్యాసంలో ఎన్ని అంతర్గత లింకులను చేర్చవచ్చో నిర్ణయించుకునే ముందు, "ఈ విషయం చదివేవారికి ఆ ఇతర వ్యాసంపై ఆసక్తి ఉంటుందా? ఈ వ్యాసంలో క్లుప్తంగా వివరించబడిన ఒక భావనను వివరించడానికి ఈ లింకు సహాయపడుతుందా లేక పాఠకుడికి అది అయోమయం కలిగిస్తుందా?" అనే ప్రశ్నలు వేసుకోవాలి. సాధారణంగా, ఒక ముఖ్యమైన పదం వ్యాసంలో మొదటిసారి వచ్చినపుడు ఆ అంశానికి సంబంధించిన వ్యాసంతో లింకు చెయ్యాలి (ఆ తరువాతి సందర్భాల్లో లింకు ఇవ్వనక్కరలేదు). మరీ ఎక్కువ లింకులు చేర్చకండి. అలా ఉంటే, పాఠకుడి దృష్టి మరలిపోయి, చదవడానికి వీలుగా ఉండదు. "బయటి లింకులు" విభాగంలో బయటి లింకులను (వికీపీడియా కాకుండా ఇతర వెబ్సైట్లకు) చేర్చవచ్చు. వాటి పక్కనే చిన్నపాటి వివరణ కూడా ఇవ్వండి. ఇవి చాలా సందర్భోచితం ఉండి, వ్యాసంలో ఉన్న సమాచారానికి అదనంగా మరిన్ని వివరాలను అందిస్తున్నట్లయితే మాత్రమే వీటిని చేర్చాలి. వ్యాసం లోని పాఠ్యానికి మద్దతుగా నిలిచే సైట్లను "మూలాలు" విభాగంలో ఉంచాలి.
|