Jump to content

సహారా పంపు సిద్ధాంతం

వికీపీడియా నుండి
తడి కాలంలో సహారాలో కనిపించే జంతుజాలపు కుడ్య చిత్రాలు. మధ్య సహారాలోని తస్సిలి వద్ద వీటిని కనుగొన్నారు.

లెవాంట్ ప్రాంతంలోని భూవంతెన ద్వారా యురేషియా, ఆఫ్రికాల మధ్య వృక్ష, జంతుజాలాలు ఎలా వలస వెళ్ళాయో వివరించే పరికల్పనే సహారా పంపు సిద్ధాంతం. ఆఫ్రికాలో అనేక వేల సంవత్సరాల విస్తారమైన వర్షపాతం (ప్లూవియల్ పీరియడ్స్) కారణంగా ఏర్పడిన "తడి- సహారా" దశలో ఆఫ్రికాలో పెద్ద సరస్సులు, బోలెడు నదులూ ఉండేవి అని ఈ పరికల్పన ప్రతిపాదిస్తుంది [1] ఈ ప్రాంతంలో కనిపించే వృక్ష, జంతుజాలాల్లో మార్పులకు ఇది కారణభూతమైంది. ఎడారి దశలో 18 – 8 లక్షల సంవత్సరాల కిందట, నైలు నది పూర్తిగా ఎండిపోయి, అప్పుడప్పుడూ మాత్రమే ప్రవహిస్తూ ఉండేది. ఆ సమయంలో నైలు నది వెంట వలసలు ఆగిపోయాయి. నైలు నది ప్రాంతంలో భూమి పైకి ఉబ్బిన కారణంగా ఇది జరిగింది.[2]

మెకానిజమ్

[మార్చు]

తడి సహారా లేదా హరిత సహారా కాలంలో, సహారా, అరేబియాలు సవానా గడ్డి భూములుగా మారాయి. ఆఫ్రికన్ వృక్ష, జంతుజాలాలు ఈ రెండూ ఆ ప్రాంతాల్లో కనిపించేవి.[3] అతివృష్టి కాలాల మధ్యంతర కాలంలో బెట్టగా ఉండే కాలాల్లో సహారా ప్రాంతం తిరిగి ఎడారి పరిస్థితులకు వచ్చేది. సాధారణంగా పశ్చిమ ఆఫ్రికా రుతుపవనాలు దక్షిణ దిశగా తిరోగమించడం కారణంగా, ఇది జరిగేది. వర్షపాతాన్ని మించి, బాష్పీభవనం ఉండేది. చాద్ సరస్సు వంటి సరస్సులలో నీటి మట్టం పడిపోయేది. నదులు ఎండిపోయేవి. వృక్ష, జంతుజాలాలు ఉత్తరంగా అట్లాస్ పర్వతాలకు, దక్షిణ దిశగా పశ్చిమ ఆఫ్రికాలోకి, లేదా తూర్పువైపు నైలు లోయలోకి మళ్ళేవి. ఒకే జాతికి చెందిన వివిధ జనాభాలు ఆయా ప్రాంతాల్లోని వేర్వేరు శీతోష్ణస్థితులకు తగినట్లుగా మార్పులకు లోనై ఆయా స్థానిక పరిస్థితులకు అలవాటు పడేవి.

ప్లయో-ప్లైస్టోసీన్

[మార్చు]

ప్లయో-ప్లైస్టోసీన్ కాలాల్లో ఆఫ్రికాకు వలస వెళ్ళిన వాటిలో - క్యాప్రినే లు (32 లక్షల సంవత్సరాల క్రితం ఒకసారి, 27-25 లక్షల సంవత్సరాల క్రితం రెండో సారి); నైక్టెర్యూట్స్ (25 లక్షల సంవత్సరాల క్రితం), ఈక్వస్ (23 లక్షల సంవత్సరాల క్రితం) ఉన్నాయి. 26 లక్షల సంవత్సరాల క్రితం హిప్పోట్రాగస్ ఆఫ్రికా నుండి శివాలిక్ పర్వతాల వద్దకు వలస వచ్చింది. ఆసియా బోవిడ్లు ఆఫ్రికా నుండి ఐరోపాకు తిరిగి ఐరోపాకూ తరలాయి. ప్రైమేట్ థెరోపిథెకస్ జనాభా కృశించింది. దాని శిలాజాలు ఐరోపా, ఆసియాల్లో మాత్రమే కనిపించాయి. హోమో, మకాకా లు విస్తారమైన ప్రాంతాల్లో స్థిరపడ్డాయి.[4]

1,85,000–20,000 సంవత్సరాల క్రితం

[మార్చు]

సుమారు 133, 122 వేల సంవత్సరాల క్రితం సహారన్-అరేబియా ఎడారి దక్షిణ భాగాలు అబ్బాసియా ప్లూవియల్ కాలపు ప్రారంభాన్ని చూసాయి. ఋతుపవనాల ద్వారా వర్షపాతం పెరిగిన (సంవత్సరానికి సుమారు 200–100 మి.మీ.) తడి కాలమది. యూరేసియాలో జీవిస్తున్న జీవజాలం ఆఫ్రికాకు ప్రయాణించడానికి, ఇక్కడి జీవజాలం అటు వెళ్ళడానికీ ఇది అనువైన కాలం.[5] వర్షాలు వచ్చినపుడే పెరిగే స్పీలియోథెమ్‌లు హోల్-జోకా, అషాలిమ్, ఎవెన్-సిడ్, మాలె-హా-మేషార్, క్టోరా క్రాక్స్, నగేవ్ జవోవా గుహల్లో పెరిగినట్లు కనిపించింది. ఆ సమయంలో కఫ్జే, ఎస్ స్కూల్ గుహల్లో అవపాతం, సంవత్సరానికి 600–1000 మి.మీ. ఉండేది. కఫ్జే-స్కూల్ రకానికి చెందిన శరీర నిర్మాణపరంగా ఆధునిక మానవుల అవశేషాలు ఈ కాలం నాటివే. కానీ, తరువాతి బెట్ట కాలంలో అక్కడ మానవ నివాసం ముగిసినట్లు కనిపిస్తోంది.

140 వేల సంవత్సరాలకు ముందు, 115 వేల సంవత్సరాలకు తరువాత ఎర్ర సముద్ర తీర మార్గం చాలా పొడిగా ఉండేది. 90–87 వేల సంవత్సరాల క్రితం కాస్త తడి పరిస్థితులు కనిపిస్తాయి గానీ, ఇది 125 వేల సంవత్సరాల క్రితం నాటి వర్షపాతంలో కేవలం పదోవంతు మాత్రమే. ఎవెన్-సిడ్ -2 లో మాత్రమే స్పీలోథెమ్‌లు కనిపించాయి.[5]

దక్షిణ నెగెవ్ ఎడారిలో 185–140 వేల సంవత్సరాల మధ్య (ఎంఐఎస్ 6), 110–90 వేల సంవత్సరాల మధ్య (ఎంఐఎస్ 5.4–5.2), 85 వేల సంవత్సరాల క్రితం తర్వాత, అంతర్‌హిమనదీయ కాలంలోను (ఎంఐఎస్ 5.1), హిమనదీయ కాలం లోనూ, హోలోసీన్ లోనూ స్పేలియోథెమ్‌లు పెరగలేదు. ఈ కాలాలలో దక్షిణ నెగెవ్ పొడిగానూ, బాగా పొడిగానూ ఉండేదని ఇది సూచిస్తుంది.[5]

చివరి హిమనదీయ సమయంలో పశ్చిమ మధ్యధరా చుట్టూ ఉండే తీర మార్గం కొన్ని సమయాల్లో బయటపడి ఉండవచ్చు; హోల్-జాఖ్, నాగేవ్ జావోవా గుహల్లో స్పీలోథెమ్‌లు పెరిగాయి. స్పీలోథెమ్ పెరగడాన్ని, కాల్సైట్‌లతో పోలిస్తే, తడి కాలాలు కేవలం పదులు లేదా వందల సంవత్సరాలు మాత్రమే ఉన్నాయని తెలుస్తోంది.[5]

60-30 వేల సంవత్సరాల క్రితం నుండి ఆఫ్రికాలోని చాలా ప్రాంతాల్లో బాగా పొడి పరిస్థితులు నెలకొని ఉన్నాయి.[6]

చివరి హిమనదీయ గరిష్టం

[మార్చు]

చివరి హిమనదీయ గరిష్టం (ల్యాస్ట్ గ్లేసియర్ మాక్జిమం - LGM) తర్వాత సహారన్ పంపుకు ఉదాహరణ ఒకటి సంభవించింది. చివరి హిమనదీయ గరిష్ఠం సమయంలో సహారా ఎడారి విస్తీర్ణం ఇప్పటి కంటే ఎక్కువ ఉండేది. ఉష్ణమండల అడవుల విస్తీర్ణం బాగా తగ్గిపోయింది.[7] ఈ కాలంలో, తక్కువ ఉష్ణోగ్రతల కారణంగా హాడ్లీ సెల్ బలం తగ్గింది. తద్వారా ఇంటర్-ట్రాపికల్ కన్వర్జెన్స్ జోన్ (ఐటిసిజెడ్)లో పైకి ఎగుస్తున్న ఉష్ణమండల గాలులు ఉష్ణమండలానికి వర్షాన్ని తేగా, 20 డిగ్రీల ఉత్తర అక్షాంశం వద్ద కిందికి దిగుతున్న పొడి గాలులు భూమధ్యరేఖ వైపు ప్రవహించి, ఈ ప్రాంతానికి ఎడారి పరిస్థితులను తెచ్చాయి. ఈ దశలో ఉత్తర ఉష్ణమండల అట్లాంటిక్ నుండి ఖనిజ ధూళి గాల్లో కొట్టుకుని వచ్చింది.

సుమారు సా.శ.పూ 12,500 లో సహారాలో చాలా తేమ పరిస్థితులు ఏర్పడ్డాయి. వేసవిలో ఉత్తరార్ధగోళంలో ఐటిసిజెడ్ ఉత్తరం వైపు విస్తరించడంతో, సహారాలో తేమతో కూడిన తడి పరిస్థితులు, సవానా వాతావరణం ఏర్పడింది. ఇది (యంగర్ డ్రైయస్‌తో సంబంధం ఉన్న చిన్న పొడి స్పెల్ కాకుండా) సా.పూ 4000 నాటికి గరిష్ట స్థాయికి చేరుకుంది. నైలు నది డెల్టాలో పేరుకున్న అవక్షేపాలను పరిశీలిస్తే, ఈ కాలంలో బ్లూ నైలు ఉపనది నుండి ఎక్కువ అవక్షేపాలు వచ్చి నైలు నదిలో కలిసాయని తెలుస్తోంది. దీన్ని బట్టి ఇథియోపియా ఎగువ ప్రాంతాల్లో ఎక్కువ వర్షపాతం నమోదయిందని తెలుస్తోంది. ఉప-ఉష్ణమండల ప్రాంతాలలో రుతుపవనాలు బలంగా ఉండడం దీనికి ప్రధాన కారణం. ఈ ఋతుపవనాలు భారతదేశం, అరేబియా, సహారాలను ప్రభావితం చేసాయి. విక్టోరియా సరస్సు ఇటీవలి కాలం లోనే వైట్ నైల్ నదికి ప్రధాన వనరుగా మారింది. సుమారు 15 వేల సంవత్సరాల క్రితం అది దాదాపుగా ఎండిపోయింది.[8]

మానవ వలసలు

[మార్చు]

ఆఫ్రికా నుండి అనేక మానవ వలసల తరంగాలు ఎప్పుడు జరిగాయో తెలుసుకోడానికి సహారా పంపు ఉపయోగపడింది. అవి: [9][10]

  • దిగువ రాతియుగం: హోమో ఎరెక్టస్ (ఎస్ఎస్పి ఎర్గాస్టర్) ఆగ్నేయ, తూర్పు ఆసియా లోకి బహుశా రెండుసార్లు వలసలు జరిగాయి. ఒకసారి ఓల్డోవాన్ సాంకేతికతను తీసుకుని చైనా, భారతదేశం వెళ్ళి, అక్కడ ఛాపర్ సంప్రదాయాన్ని సృష్టించారు. రెండవ వలసలో, అషూలియన్ చేగొడ్డలిని తీసుకుని భారత ఉపఖండం వరకూ వెళ్ళారు.
  • మధ్య పాతరాతియుగం: మధ్యప్రాచ్యం, పశ్చిమ ఐరోపాలోకి హోమో హైడెల్బెర్గెన్సిస్ వలస వెళ్ళింది.
  • ఎగువ రాతియుగం: హోమో సేపియన్స్ (తొలి "ఆఫ్రికా నుండి బయటకు" తరంగం, 80,000 సంవత్సరాల క్రితానికి మునుపే తగ్గుముఖం పట్టింది. 70,000 సంవత్సరాల క్రితం, "తీర వలసల" తరంగం వీరి స్థానాన్ని ఆక్రమించింది)
  • ఎపీపాతరాతియుగం: ఆఫ్రికా నుండి పాలస్తీనా లోకి సెమైట్లు చేపట్టిన వలస
  • కొత్తరాతియుగం: 5.9 కిలోయియర్ ఈవెంట్: కొత్త రాతియుగంలో జరిగిన కొన్ని వలసలకు దీనితో సంబంధం ఉంది
  • న్యూ కింగ్డమ్ చివరలో ఈజిప్టు లోకి లిబు, మెష్వేష్ ల వలసలతో కాంస్య యుగాంతం మొదలైంది. సహారాలో రథాలు కనిపించాయి.[11]

మూలాలు

[మార్చు]
  1. van Zinderen-Bakker E. M. (1962-04-14). "A Late-Glacial and Post-Glacial Climatic Correlation between East Africa and Europe". Nature. 194 (4824): 201–203. Bibcode:1962Natur.194..201V. doi:10.1038/194201a0. S2CID 186244151.
  2. Williams, Martin A.J.; Talbot, Michael R. (2009). "Late Quaternary Environments in the Nile Basin". The Nile. Monographiae Biologicae. Vol. 89. pp. 61–72. doi:10.1007/978-1-4020-9726-3_4. ISBN 978-1-4020-9725-6.
  3. Walker, Stephen (8 October 2013). "Gilf Kebir". Archived from the original on 8 డిసెంబరు 2023. Retrieved 20 December 2013.
  4. Hughesm, Jk; Elton, S; O'Regan, Hj (Jan 2008). "Theropithecus and 'Out of Africa' dispersal in the Plio-Pleistocene". Journal of Human Evolution. 54 (1): 43–77. doi:10.1016/j.jhevol.2007.06.004. ISSN 0047-2484. PMID 17868778.
  5. 5.0 5.1 5.2 5.3 Vaks, Anton; Bar-Matthews, Miryam; Ayalon, Avner; Matthews, Alan; Halicz, Ludwik; Frumkin, Amos (2007). "Desert speleothems reveal climatic window for African exodus of early modern humans" (PDF). Geology. 35 (9): 831. Bibcode:2007Geo....35..831V. doi:10.1130/G23794A.1. Archived from the original (PDF) on 2011-07-21.
  6. Mellars, P. (Jun 2006). "Why did modern human populations disperse from Africa ca. 60,000 years ago? A new model". Proceedings of the National Academy of Sciences. 103 (25): 9381–9386. Bibcode:2006PNAS..103.9381M. doi:10.1073/pnas.0510792103. ISSN 0027-8424. PMC 1480416. PMID 16772383.
  7. Adams, Jonathan. "Africa during the last 150,000 years". Environmental Sciences Division, ORNL Oak Ridge National Laboratory.
  8. Stager, J. C.; Johnson, T. C. (2008). "The late Pleistocene desiccation of Lake Victoria and the origin of its endemic biota". Hydrobiologia. 596: 5–16. doi:10.1007/s10750-007-9158-2. S2CID 42372016.
  9. Hoffman, Michael (September 2015). "1". Brain Beat: Scientific Foundations and Evolutionary Perspectives of Brain Health. New York, USA: Page Publishing, Inc. ISBN 978-1-68213-319-4.
  10. Harcourt, Alexander H. (2015) "Humankind: how biology and geography shape human diversity" (Pegasus Books)
  11. Anderson, Helen (2016) "Chariots in Saharan Rock Art: an aesthetic and cognitive review" (Journal of Social Archaeology Vol 16 no. 3)