Jump to content

సానా సతీష్ బాబు

వికీపీడియా నుండి
సానా సతీష్ బాబు
సానా సతీష్ బాబు


అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2024 డిసెంబర్ 13 - ప్రస్తుతం
ముందు మోపిదేవి వెంకటరమణ
నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్

వ్యక్తిగత వివరాలు

జననం (1972-08-19) 1972 ఆగస్టు 19 (వయసు 52)
తమ్మవరం గ్రామం,కాకినాడ (గ్రామీణ) మండలం, కాకినాడ జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
నివాసం శ్రీరామ్ నగర్, కాకినాడ, ఆంధ్రప్రదేశ్
వృత్తి రాజకీయ నాయకుడు
వెబ్‌సైటు [1]

సానా సతీష్ బాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యాపారవేత్త,[1] రాజకీయ నాయకుడు. ఆయనను 2024 డిసెంబర్ 10న తెలుగుదేశం పార్టీ తరపున రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటించగా,[2] డిసెంబర్ 13న రాజ్యసభ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు.[3]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

సానా సతీష్ బాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కాకినాడ జిల్లా, కాకినాడ గ్రామీణ మండలం, తమ్మవరం గ్రామంలో 1972 ఆగస్టు 19న సానా సుబ్బారావు, సత్యప్రభ దంపతులకు జన్మించాడు. ఆయన పీఆర్‌ ప్రభుత్వ కళాశాలలో ఇంటర్, పాలిటెక్నిక్‌ డిప్లొమా పూర్తి చేశాడు. ఆయనకు భార్య నాగజ్యోతి, ఇద్దరు పిల్లలు ఉన్నారు.[4]

ఉద్యోగ జీవితం

[మార్చు]

సతీష్‌ బాబు తండ్రి విద్యుత్తు ఉద్యోగిగా పనిచేస్తూ మరణించడంతో కారుణ్య నియామకం కింద 1994లో విద్యుత్తు శాఖలో ఉద్యోగం చేరి విద్యుత్తు శాఖ సబ్‌ ఇంజినీర్‌గా పని చేస్తూ 2005లో ఉద్యోగానికి రాజీనామా చేశాడు. ఆయన ఆ తర్వాత హైదరాబాద్‌ వెళ్లి వ్యాపారం మొదలుపెట్టి వాన్‌పిక్, మ్యాట్రిక్స్, మహాకల్ప ఇన్‌ఫ్రా లాంటి 14 కంపెనీల్లో డైరెక్టర్‌గా పని చేస్తూ రియల్ ఎస్టేట్, ఫుడ్‌ అండ్‌ బెవరేెజ్, సీపోర్టు, పవర్‌ అండ్‌ ఎనర్జీ రంగాల్లో రాణించాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

సతీష్‌ బాబు సానా సతీష్‌బాబు ఫౌండేషన్ ఏర్పాటు చేసి కాకినాడలో ఫౌండేషన్‌ ద్వారా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ రాజకీయాల పట్ల ఆసక్తితో 2024లో జరిగిన లో‍క్‍సభ ఎన్నికలలో కాకినాడ ఎంపీ సీటు ఆశించినా పొత్తుల్లో భాగంగా కూటమి నుండి జనసేనకు కేటాయించగా ఆ పార్టీ అభ్యర్థి తంగెళ్ళ ఉదయ్‌ శ్రీనివాస్‌కు మద్దతుగా ఎన్నికల్లో కూటమి విజయానికి కృషి చేశాడు. 2024 శాసనసభ ఎన్నికలలో రాష్ట్రంలో అధికారం కోల్పోయాక మోపీదేవి వెంకటరమణా వైసీపీ పార్టీకి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో ఈ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలలో సానా సతీష్ బాబును 2024 డిసెంబర్ 10న తెలుగుదేశం పార్టీ తరపున రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటించగా,[5] డిసెంబర్ 13న రాజ్యసభ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు.[6][7]

మూలాలు

[మార్చు]
  1. ABP Live (25 October 2023). "Dreams, Determination, And Cricket: The Story Of Sri Sana Satish Babu" (in ఇంగ్లీష్). Archived from the original on 15 December 2024. Retrieved 15 December 2024.
  2. The Week (10 December 2024). "TDP fields controversial industrialist Sana Sathish Babu for Rajya Sabha by-elections" (in ఇంగ్లీష్). Archived from the original on 15 December 2024. Retrieved 15 December 2024.
  3. The Times of India (13 December 2024). "NDA candidates elected unopposed in Andhra Rajya Sabha by-elections". Archived from the original on 15 December 2024. Retrieved 15 December 2024.
  4. Big TV (10 December 2024). "ఎన్నో త్యాగాలు..మరెన్నో పోరాటాలు.. సామాన్య కార్యకర్త 2 రాజ్యసభ ఎంపీ సానా సతీష్ బ్యాగ్రౌండ్". Archived from the original on 15 December 2024. Retrieved 15 December 2024.
  5. The Hindu (9 December 2024). "TDP fields Mastan Rao, S. Satish for Rajya Sabha by-elections, BJP picks R. Krishnaiah" (in Indian English). Archived from the original on 15 December 2024. Retrieved 15 December 2024.
  6. Andhrajyothy (14 December 2024). "రాజ్యసభ సభ్యులుగా సతీశ్‌, మస్తాన్‌రావు, కృష్ణయ్య". Archived from the original on 15 December 2024. Retrieved 15 December 2024.
  7. "TDP, BJP candidates elected uncontested to Rajya Sabha" (in Indian English). The Hindu. 13 December 2024. Archived from the original on 15 December 2024. Retrieved 15 December 2024.