సాయిరాజ్ బహుతులే

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సాయిరాజ్ బహుతులే
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
సాయిరాజ్ వసంత్ బహుతులే
పుట్టిన తేదీ (1973-01-06) 1973 జనవరి 6 (వయసు 51)
Muముంబైbai
బ్యాటింగుఎడమచేతి వాటం
బౌలింగుLegbreak
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 235)2001 మార్చి 18 - ఆస్ట్రేలియా తో
చివరి టెస్టు2001 ఆగస్టు 29 - శ్రీలంక తో
తొలి వన్‌డే (క్యాప్ 108)1997 డిసెంబరు 22 - శ్రీలంక తో
చివరి వన్‌డే2003 నవంబరు 6 - న్యూజీలాండ్ తో
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డేలు
మ్యాచ్‌లు 2 8
చేసిన పరుగులు 39 23
బ్యాటింగు సగటు 13.00 7.66
100లు/50లు 0/0 0/0
అత్యధిక స్కోరు 21* 11
వేసిన బంతులు 366 294
వికెట్లు 3 2
బౌలింగు సగటు 67.66 141.50
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0
అత్యుత్తమ బౌలింగు 1/32 1/31
క్యాచ్‌లు/స్టంపింగులు 1/– 3/–
మూలం: ESPNcricinfo, 2006 ఫిబ్రవరి 4

సాయిరాజ్ బహుతులే (జననం 1973 జనవరి 6) మాజీ భారతీయ క్రికెట్ ఆటగాడు. అతను లెగ్ స్పిన్ బౌలింగ్‌లో నైపుణ్యం కలిగిన ఆల్‌రౌండరు. ముంబై తరపున, ఆ తరువాత విదర్భ తరఫున దేశీయ క్రికెట్ ఆడాడు.

ఇరానీ ట్రోఫీలో 13-వికెట్ల మ్యాచ్ పంటతో సహా అద్భుతమైన ప్రదర్శనలు అతనికి 1997లో భారత జట్టులో స్థానం సాధించి పెట్టాయి. మూడు సంవత్సరాల తర్వాత, అనిల్ కుంబ్లేకు గాయం కారణంగా అతను ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో ఆడాడు. కానీ అతను తన రెండు టెస్టుల్లోనూ ఇబ్బంది పడ్డాడు.

బహుతులే గత 5 వేసవి సీజన్లలో ప్రీమియర్ విభాగంలో సర్రే ఛాంపియన్‌షిప్ జట్టు రీగేట్ ప్రియరీ కోసం ఇంగ్లాండ్‌లో ఆడాడు. 2005లో బహుతులే బ్యాట్, బాల్‌లతో చేసిన ప్రదర్శనల సహకారంతో ఆ జట్టు టైటిల్‌ను గెలుచుకుంది.

బహుతులే 2013 జనవరి 1 న ఫస్ట్-క్లాస్ క్రికెట్ నుండి రిటైరయ్యాడు [1]

కోచింగ్ కెరీర్[మార్చు]

సాయిరాజ్, 2014 జూన్‌లో కేరళ క్రికెట్ జట్టు కోచ్‌గా వెళ్ళాడు. [2] 2015 జూలైలో బెంగాల్ క్రికెట్ జట్టు కోచ్‌గా నియమితుడయ్యాడు. [3]

2018 ఫిబ్రవరిలో, అతను రాజస్థాన్ రాయల్స్‌కు స్పిన్ బౌలింగ్ కోచ్‌గా చేరాడు. [4] [5]

ట్రివియా[మార్చు]

1988లో లార్డ్ హారిస్ షీల్డ్ ఇంటర్-స్కూల్ గేమ్‌లో శారదాశ్రమ్ విద్యామందిర్ తరపున సచిన్ టెండూల్కర్, వినోద్ కాంబ్లీ లు 664 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించినప్పుడు సెయింట్ జేవియర్స్ హైస్కూల్ బౌలర్లలో బహుతులే ఒకడు.

మూలాలు[మార్చు]

  1. "Sairaj Bahutule announces first-class retirement". Wisden India. 2 January 2013. Archived from the original on 23 ఆగస్టు 2017. Retrieved 21 ఆగస్టు 2023.
  2. "Sairaj Bahutule appointed Kerala coach". ESPNcricinfo. 11 June 2014. Retrieved 12 June 2014.
  3. "Sairaj Bahutule to coach Bengal". ESPN Cricinfo. Retrieved 6 March 2022.
  4. "IPL: Sairaj Bahutule joins Rajasthan Royals as spin bowling coach". Hindustan Times. 27 February 2018. Retrieved 6 March 2022.
  5. "IPL 2018: Sairaj Bahutule named Rajasthan Royals' spin bowling coach". Indian Express. 27 February 2018. Retrieved 6 March 2022.