సాయోని ఘోష్
సయోని ఘోష్ | |
---|---|
లోక్ సభ సభ్యురాలు | |
Assumed office 2024 జూన్ 4 | |
అంతకు ముందు వారు | మిమీ చక్రవర్తి |
నియోజకవర్గం | జాదవ్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం |
పశ్చిమ బెంగాల్ రాష్ట్ర అధ్యక్షురాలు, ఆల్ ఇండియా తృణమూల్ యూత్ కాంగ్రెస్ | |
Assumed office 2021 జూన్ 5 | |
అంతకు ముందు వారు | అభిషేక్ బెనర్జీ |
వ్యక్తిగత వివరాలు | |
జననం | కోల్‌కతా, పశ్చిమ బెంగాల్, భారతదేశం | 1993 జనవరి 27
రాజకీయ పార్టీ | ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ (2021-ప్రస్తుతం) |
చదువు | హీరేంద్ర లీలా పాత్రనావిస్ స్కూల్ |
వృత్తి | నటి • రాజకీయవేత్త |
పురస్కారాలు |
|
సాయోని ఘోష్ (జననం 1993 జనవరి 27) ఒక భారతీయ బెంగాలీ చలనచిత్ర, టెలివిజన్ నటి, గాయని. ఆమె జాదవ్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంటు సభ్యురాలు కూడా.[1][2] ఆమె టెలిఫిల్మ్ ఇచే దానా తో నటనా రంగ ప్రవేశం చేసింది. ఇక పెద్ద తెరపై ఆమె అరంగేట్రం నోటోబోర్ నాట్అవుట్ చిత్రంలో చిన్న పాత్రతో జరిగింది.[3]
సయోని 2013, 2014లలో కలకత్తా ఫుట్‌బాల్ లీగ్‌ని ప్రత్యక్ష ప్రసార సమయంలో జల్షా మూవీస్ కోసం సహ-హోస్ట్ గా వ్యవహరించింది.
కెరీర్
[మార్చు]ఆమె 2011లో రాజ్ చక్రవర్తి రూపొందించిన చిత్రం షోట్రులో ఆమె ప్రధాన పాత్రలో నటించింది. ఆ తరువాత రాజ్ చక్రవర్తి రోజువారీ సీరియల్ ప్రోలోయ్ ఆషే లో పాత్రికేయురాలి పాత్రను పోషించింది.[4] ఆమె కనమాచి, అంతరాల్, ఏక్లా చోలో, అమర్ సాహోర్, బిట్నూన్, మేయర్ బీ, రాజ్కాహిని చిత్రాలలో ప్రధాన పాత్రలు పోషించింది.[1]
హిందూ మనోభావాలను దెబ్బతీసినందుకు తాతాఘతా రాయ్ ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తరువాత జనవరి 2021లో ఆమె రాజకీయాల్లోకి వచ్చింది.[5]ఆమె 2021 ఫిబ్రవరి 24న అఖిల భారత తృణమూల్ కాంగ్రెస్ చేరింది.
మార్చి 2021లో, ఆమె 2021 పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికలలో అసన్సోల్ దక్షిణ్ శాసనసభ నియోజకవర్గానికి ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీబడింది. అయితే ఆమె భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అగ్నిమిత్ర పాల్ చేతిలో ఓడిపోయింది.[6]
జూన్ 2021లో ఆమెను తృణమూల్ కాంగ్రెస్ యువజన విభాగం అధ్యక్షురాలిగా నియమించారు.[2] 2022 పశ్చిమ బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్ రిక్రూట్మెంట్ కుంభకోణంపై దర్యాప్తుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆమెను 2023 జూన్ 30న ప్రశ్నించింది.[7] 2024 భారత సార్వత్రిక ఎన్నికలలో, ఆమె జాదవ్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి తృణమూల్ అభ్యర్థిగా పోటీ చేసి రెండున్నర లక్షల ఓట్ల తేడాతో విజయం సాధించింది.[8]
ఫిల్మోగ్రఫీ
[మార్చు]సంవత్సరం | సినిమా | పాత్ర | గమనిక |
---|---|---|---|
2010 | నోట్బోర్ నోటౌట్ | ||
2011 | షోట్రు | పూజ సోదరి | |
2013 | కనమాచి | ||
2013 | అలిక్ సుఖ్ | నమితా | |
2013 | అంతారాల్ | ||
2013 | ఆగన్ | ||
2014 | గోల్పో హోలియో షోట్టీ | స్మితా | |
2014 | పునశ్చ | ||
2014 | అరణ్యదేబ్ | ||
2015 | ఏక్లా చోలో | రియా | |
2015 | బోధోన్ | ||
2015 | బిట్నూన్ | రుషా | |
2015 | చౌకాత్-ది థ్రెషోల్డ్ | ||
2015 | బావల్ | నుస్రత్ | |
2015 | నాటోకర్ మోటో-ఒక నాటకం లాగా | ఖెయా స్నేహితురాలు | |
2015 | ఆరో ఎక్బర్ | ||
2015 | మేయర్ బీయ్ | ||
2015 | బాబర్ నామ్ గాంధీ | ట్రినా | |
2015 | హషితే హషనా | ||
2015 | రాజకహిని | కోలి | |
2016 | అబార్ ఏక్లా చోలో | ||
2016 | బ్యోమకేష్ ఓ చిరియాఖానా | ముకుల్ | |
2016 | కిరితి రాయ్ | ||
2017 | మేఘనాథ్ బద్ రహస్యా | ఎలెనా | |
2017 | అమర్ సహోర్ | ||
2017 | అందర్కాహిని | ||
2017 | చలో లెట్స్ లైవ్ | ||
2017 | కిచ్చు నా బోలా కథా | ||
2018 | జోజో | ||
2018 | కా ఖా గా ఘ | ||
2018 | గుడ్ నైట్ సిటీ | ||
2018 | రీయునియన్ | ||
2019 | ద్విఖోండిటో | ||
2019 | కే తూమి నందిని | ||
2019 | రాంగ్ నంబర్ | ||
2019 | అడ్డా | ||
2019 | అతితి | ||
2019 | షక్కీ-జహా బోలిబో షొట్టి బోలిబో | ||
2019 | నెట్వర్క్ | ||
2019 | బ్రోమ్బోడోయిటో | ||
2019 | సంజబతి | శ్యామలి | |
2020 | ప్రతిధ్వని | ||
2020 | డ్రాకులా సర్ | రోమిలా | సినీ నటిగా చిన్న పాత్ర |
2022 | అపరాజితో | బిమలా రే, అపరాజితో భార్య | |
2022 | సిటీ ఆఫ్ జాకల్స్ | ||
2022 | ఉత్తవరన్ | ||
2023 | రహ్సిమోయ్ | ||
2023 | లాల్: సూట్‌కేసు తా దేఖెచెన్? |
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 "Saayoni Ghosh Movies: Latest and Upcoming Films of Saayoni Ghosh | eTimes". The Times of India. Retrieved 9 February 2021.
- ↑ 2.0 2.1 Singha, Aritra (5 June 2021). "West Bengal: Abhishek Banerjee appointed as TMC general secretary; Saayoni Ghosh takes charge as party's youth wing president". The Free Press Journal (in ఇంగ్లీష్).
- ↑ "Actress Sayoni Ghosh to feature in 'Lockdown Diary' - Times of India". The Times of India. Saayoni came into the limelight after featuring in the telefilm 'Ichche Dana'in 2009. (in ఇంగ్లీష్). Retrieved 9 February 2021.
- ↑ "Lokmat News | Sayoni Ghosh as journalist role in Raj Chakraborty's daily soap Proloy Asche". Lokmat English (in ఇంగ్లీష్). Retrieved 9 February 2021.
- ↑ Kundu, Indrajit (18 January 2021). "BJP's Tathagata Roy files complaint against actor Sayoni Ghosh over meme for 'hurting Hindu sentiments'". India Today.
- ↑ "Mamata Banerjee releases TMC's candidate list for Bengal elections". Business Insider.
- ↑ https://theprint.in/india/ed-grills-tmcp-leader-saayoni-ghosh-for-11-hours-in-school-jobs-scam-probe/1650016/
- ↑ https://www.dnaindia.com/entertainment/report-meet-actress-saayoni-ghosh-made-headlines-for-hurting-religious-sentiments-upset-bjp-in-lok-sabha-elections-3092081