Jump to content

సారంగధర (1937 సినిమా)

వికీపీడియా నుండి
సారంగధర
(1937 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం పి.పుల్లయ్య
నిర్మాణం రామయ్య
తారాగణం బందా కనకలింగేశ్వరరావు (సారంగధరుడు),
పి.శాంతకుమారి (చిత్రాంగి),
కన్నాంబ,
శ్రీరంజని సీనియర్,
అద్దంకి శ్రీరామ మూర్తి (రాజ రాజ నరేంద్రుడు),
పులిపాటి వెంకటేశ్వరులు
సంగీతం ఆకుల నరసింహారావు
నేపథ్య గానం పి.శాంతకుమారి,
శ్రీరంజని సీనియర్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

సారంగధర 1937, ఫిబ్రవరి 5న విడుదలైన తెలుగు చలనచిత్రం. పి.పుల్లయ్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అద్దంకి శ్రీరామమూర్తి,బందా కనకలింగేశ్వరరావు,పులిపాటి వెంకటేశ్వర్లు, కొచ్చర్లకోట సత్యనారాయణ,శ్రీరంజని సీనియర్, కన్నాంబ, పి.శాంతకుమారి, బాలామణి తదితరులు నటించగా, ఆకుల నరసింహారావు సంగీతం అందించాడు.

తారాగణం

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]
  • దర్శకత్వం: పి.పుల్లయ్య
  • నిర్మాణం: రామయ్య
  • సంగీతం: ఆకుల నరసింహారావు
  • నేపథ్య గానం: పి.శాంతకుమారి,శ్రీరంజని సీనియర్

పాటలు

[మార్చు]
  1. అగ్నిసాక్షిగ పరిణయమానడిట్టి మగని (పద్యం) - పి. శాంతకుమారి
  2. అన్యచింతలేలా మనసా మూడు నాళ్ళ బ్రతుకే -
  3. అమృత రసప్రదాయి అమలచరిత వందనమో - శ్రీరంజని సీనియర్
  4. ఇక నాబ్రతుకేల తనయా అకటా నిను బాసి - శ్రీరంజని సీనియర్
  5. ఈవనలతికలాహా మోదమౌ వివిధ పుష్పిత వీవన లౌరా - పి. శాంతకుమారి
  6. ఈశా యిక బ్రోవగదే యీ దీనను వ్రతముల ఫలంబిక - శ్రీరంజని సీనియర్
  7. ఎట్టి నిరుపెదరాలికో పుట్టియున్నబ్రతికియుందువు (పద్యం) - శ్రీరంజని సీనియర్
  8. కనులెర్రజేసి యీ గర్జనలేల నీ బెదరింపులికకట్టి (పద్యం) - బందా కనకలింగేశ్వర రావు
  9. కలదో యెన్నటికేని పుత్రుగన భాగ్యంబంచు (పద్యం) - అద్దంకి శ్రీరామమూర్తి
  10. కొమరుంబ్రాయము రూపమున్ స్దిరమెలొకుల్ (పద్యం) - బందా కనకలింగేశ్వర రావు
  11. చంద్రోద్బాసిత శేఖరే స్మరహరే గంగాధరే శంకరే (పద్యం) - అద్దంకి శ్రీరామమూర్తి
  12. జగమునందున నిజయశశ్చ౦ద్రికలను (పద్యం) - బాలామణి
  13. తరుణిముఖలక్షణములె సిద్దాంతపరచు సద్యశంబున (పద్యం) - శ్రీరంజని సీనియర్
  14. తలమే యెన్నటికిని ప్రాగ్భవ నిసిద్దంబైన కర్మమంబులన్ (పద్యం) - ఆకుల నరసింహారావు
  15. దండాలు దండాలు మాసామొ మాదొడ్డసామొ సల్లంగ - బృందం
  16. దాక్షిణ్యమే గనవా దయాళో వ్రతముల ఫలమీ గతిగా - శ్రీరంజని సీనియర్
  17. దేవా నీవే బ్రోవలేవా ప్రీతిన్ వినుతింపన్ వశమా - బందా కనకలింగేశ్వర రావు
  18. దేవా యిటలీ తీరున నొసటన్ వ్రాసితివా నా పాప - బందా కనకలింగేశ్వర రావు
  19. పరిణయ మాడనోచని యభాగ్య చరితను కన్నులార (పద్యం) - పి. శాంతకుమారి
  20. పుడమిపై ధర్మమిక పోషింపన్ బడున్ (పద్యం) - ఆకుల నరసింహారావు
  21. ప్రతియౌనే శరదిందు బింబము ముఖాబ్జాతంబుతో (పద్యం) - అద్దంకి శ్రీరామమూర్తి
  22. ప్రాణపదుడగు పతిని గనుటేడ యేదైవమైన -బాలామణి
  23. మంగళం సర్వేశ నుహితగుణ తేజునకును - బృందం
  24. మంగళమో గౌరీ మాతా కరుణన్ గనుమా గిరివరతనయా - బాలామణి
  25. మొహనాకారా నిన్ పోల్పనా వశమౌనా భరియింప - పి. శాంతకుమారి
  26. మోమోటమా విశ్వమోహనాకారా మాటాడవేరా - పి. శాంతకుమారి
  27. రాగసుధారస పానము జేసి రంజిల్లవే మనసా - పి. శాంతకుమారి
  28. రాజిపు దూరలేడు చెలి ప్రాయపు బిత్తరి నీవు రూపరే (పద్యం) - పులిపాటి వెంకటేశ్వర్లు
  29. విరియన్ బూచిన పుష్పగుచ్చముల తావిన్ జల్లు (పద్యం) - అద్దంకి శ్రీరామమూర్తి
  30. శుకపికమయూరమధురామృత సుస్వర సుఖగీతా - బాలామణి
  31. సతతంబున్ నను భక్తిగొల్పు ప్రజ నా సౌఖ్యోన్నుతుల్ (పద్యం) - అద్దంకి శ్రీరామమూర్తి
  32. సుగుణాకర అరి భీకర సుందరంగ లాలి - శ్రీరంజని సీనియర్
  33. సురేశా మురారి దయాసాగర సురనాథగేయ - ఆకుల నరసింహారావు
  34. సైపనౌనా శంకరా నా పాపమే భరమాయేహో - అద్దంకి శ్రీరామమూర్తి
  35. స్పర్లోకవాహినీ జలములపై తేలియాడెడి కొదమరాయ (పద్యం) - బందా కనకలింగేశ్వర రావు
  36. హే దినమణి తరణి వేదవిదా కమలాప్తారురుణ -

మాలాలు

[మార్చు]