అరి
స్వరూపం
| అరి మై నేమ్ ఈజ్ నో బడీ | |
|---|---|
| దర్శకత్వం | వి.జయశంకర్ |
| నిర్మాత | శ్రీనివాస్ రామిరెడ్డి, శేషు మారంరెడ్డి |
| తారాగణం | సాయికుమార్, శుభలేఖ సుధాకర్, అనసూయ, సురభి ప్రభావతి |
నిర్మాణ సంస్థ | ఆర్వీ సినిమాస్ పతాకం |
విడుదల తేదీ | 2025 అక్టోబర్ 10 |
| దేశం | భారతదేశం |
| భాష | తెలుగు |
అరి కృష్ణతత్వంతో రూపొందిన తెలుగు సినిమా. వి.జయశంకర్ దర్శకత్వం వహించాడు. కాగా అరిషడ్వర్గాలలోని కామ, క్రోధ, లోభ, మొహ, మద, మాత్సర్యాల చుట్టూ తిరిగే కథాచిత్రంలో సుమన్, ఆమని, సాయికుమార్, శుభలేఖ సుధాకర్, అనసూయ, సురభి ప్రభావతి తదితరులు ప్రధానపాత్రలలో నటించారు.[1]
ఈ చిత్రంలోని కాసర్ల శ్యామ్ రాసిన చిన్నారి కిట్టయ్య సిత్రాల కిట్టయ్యా.. అంటూ శ్రీ కృష్ణుడుపై సాగే భక్తి గీతం అనూప్ రూబెన్స్ స్వరాలు సమకూర్చగా మంగ్లీ ఆలపించింది. ఈ పాట యూట్యూబ్‌లో మార్చి 2023లో విడుదల చేయగా ఇప్పటికీ అత్యధిక వీక్షణలు సొంతం చేసుకుంటూ దూసుకెళ్తోంది. అలాగే ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఈ మూవీ ట్రైలర్‌ను 2023 మార్చి 12న విడుదల చేయగా అనూహ్య రీతిలో స్పందన లభించింది.[2]
ఈ సినిమా 2025 అక్టోబర్ 10న విడుదలైంది.[3]
తారాగణం
[మార్చు]- సాయికుమార్
- శుభలేఖ సుధాకర్
- అనసూయ
- సురభి ప్రభావతి
- వైవా హర్ష
- శ్రీకాంత్ అయ్యంగార్
- శ్రీనివాస రెడ్డి
- చమ్మక్ చంద్ర
- మంగ్లీ
సాంకేతిక నిపుణులు
[మార్చు]- సమర్పణ : ఆర్ వీ రెడ్డి
- రచన, దర్శకత్వం : వి.జయశంకర్[4]
- నిర్మాతలు : శ్రీనివాస్ రామిరెడ్డి, శేషు మారం రెడ్డి
- సంగీతం : అనూప్ రూబెన్స్
- సాహిత్యం : కాసర్ల శ్యామ్ , వనమాలి
- కొరియోగ్రఫీ - భాను, జీతు
- సినిమాటోగ్రఫీ : శివశంకర వరప్రసాద్
మూలాలు
[మార్చు]- ↑ "ARI Trailer: అంతః శత్రువులను జయిస్తేనే | ex vice president venkaiah naidu appreciates ari trailer". web.archive.org. 2023-09-06. Archived from the original on 2023-09-06. Retrieved 2023-09-06.
{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "Jayashankarr: గోపాల బాల.. శ్రీకృష్ణలీల | jayashankarr talks about ari movie krishna song". web.archive.org. 2023-09-06. Archived from the original on 2023-09-06. Retrieved 2023-09-06.
{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "రివ్యూ: అరి; సాయికుమార్, అనసూయల మూవీ ఎలా ఉంది?". Eenadu. 10 October 2025. Archived from the original on 10 October 2025. Retrieved 10 October 2025.
- ↑ "అరి.. ఆధునిక భగవద్గీతలా ఉందన్నారు". Eenadu. 9 October 2025. Archived from the original on 9 October 2025. Retrieved 9 October 2025.