Jump to content

సారాలంకారం

వికీపీడియా నుండి

సారాలంకారం తెలుగు భాషలో ఒక అలంకారము.

అలంకారాలు రెండు రకాలు.అలంకారాలు అనగా అందమైన ఆభరణ విశేషాలు.కావ్య సరస్వతికి హార,కంకణకటకాదుల వలె సౌందర్యాన్ని కల్గించేవి అలంకారాలు.[1]

సౌందర్యమలంకార మని భామహుడు తెలిపారు.మనిషికి రెండు రకాలు అలంకారాలుంటాయి.అవి బహిర్గత(మంచి దుస్తులు,నగలు మెదలైనవి),అంతర్గత అలంకారాలు(నీతి,నిజాయితీ మొదలైనవి).ఈ రెండు అలంకారాలు సంపూర్ణ మానవులుగా పేరుగాంచుతారు.అదే విధంగా భాషకు అందాన్ని చేకూర్చేవి అలంకారాలు.ఇవి చమత్కారంగా ఉండి మనస్సును ఆకర్షించడానికి ఉపయోగపడతాయి.ఆ అలంకారాలు అర్థాలంకారం,శబ్దాలంకారం భేదంతో రెండు రకాలు. ఈ సారాలంకారమనేది అర్థాలంకారములోని భాగము.

సారాలంకారం లక్షణం
పూర్వపూర్వముల కంటే ఉత్తరోత్తరాలకు ఉత్కర్ష కలిగించడం సారాలంకారం. ముందున్న వాటి కంటే తర్వాత వచ్చేవాటికి గొప్పతనాన్ని కలిగించడం ఉత్తరోత్తర ఉత్కర్ష అంటారు.
ఉదాహరణ
రాజ్యములో భూమి గొప్పది. భూమిలో కూడా పట్టణం గొప్పది. పట్టణంలోనూ భవనం గొప్పది. భవనంలో శయ్య గొప్పది. శయ్యమీద సర్వాంగ శోభిత అయిన జవరాలు గొప్పది.
వివరణ
ముందు భూమి గొప్పదని, దానికంటె పట్టణం, పట్టణం కంటే భవనం, భవనం కంటే శయ్య, శయ్య కంటే జవరాలు గొప్పదని - ఇలా ముందున్న వాటి కంటే తరువాతి వాటికి గొప్పతనం చెప్పడం వల్ల ఇది సారాలంకారం.

పూర్వులు వాడుకలు

[మార్చు]


1.జయదేవుడు-చంద్రాలోకం

తేనె మధురము.దాని కంటే అమృతము మధురము.దాని కంటే కవి వాక్యం మధురము

వివరణ

ముందు తేనె గొప్పదని, దానికంటె అమృతం, అమృతం కంటే కవి వాక్యం - ఇలా ముందున్న వాటి కంటే తరువాతి వాటికి గొప్పతనం తెలుపుతుంది కనుక ఈ వాక్యం సారాలంకారంగా మారింది.

మరికొన్ని ఉదాహరణలు

[మార్చు]


నన్నయ-భారతం

మతజల పూరితంబులగు నూతులు నూఱిటికంటె సూనృత

వ్రతయొకబావిమేలు మఱి బావులు నూఱిటికంటెనొక్క స

త్క్రతువదిమేలు తత్క్రతుశతంబున కంటె సుతుండుమేలు త

త్పుత శతకంబు కంటె నొక సూనృత వాక్యము మేలు సూడఁగన్[2]


వేమన శతకం


పనసతొనలకన్న పంచదారకన్న

జుంటితేనె కన్న జున్నుకన్న

చెఱకుగడలకన్న చెలిమాట తీపిరా

విశ్వదాభిరామ! వినుర వేమ ![3]

మూలాలు
[మార్చు]

1.అలంకారములు - 1 : అలంకారములు : వ్యాకరణము : పోతన తెలుగు భాగవతము

2.మన పద్యం – మన వ్యక్తిత్వం – ఈమాట Archived 2024-12-03 at the Wayback Machine

3.వేమన పద్యాలు - వికీసోర్స్

1.మన తెలుగు - సారాలంకారం

  1. సాంబశివరావు, శ్రీ ఊలపల్లి. "అలంకారములు - 1 : అలంకారములు : వ్యాకరణము : పోతన తెలుగు భాగవతము". telugubhagavatam.org. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2025-12-09.
  2. "మన పద్యం – మన వ్యక్తిత్వం – ఈమాట" (in అమెరికన్ ఇంగ్లీష్). the original నుండి 2024-12-03 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2025-12-09.
  3. "వేమన పద్యాలు - వికీసోర్స్". te.wikisource.org. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2025-12-09.