అతిశయోక్త్యలంకారము
కవులు ఒక వస్తువును వర్ణిస్తూ నిజానికి సాధ్యం కాని ఎన్నో సంగతులు ఆ వస్తువుకి ఆపాదిస్తారు. అది కేవలం కల్పనను హెచ్చించటం కోసమే కానీ నిజంగా అలా ఉందని కవుల భావన కాదు.
ఉదాహరణ :
మా పాఠశాల భవనములు ఆకాశము నంటుచున్నవి.
ఇక్కడ పాఠశాల భవనం ఆకాశాన్ని అంటడం అనేది అసాధ్యం కానీ ఆ ఊహ మాత్రం చేత వాక్యానికి చాలా అందం వచ్చింది. ఇదే అతిశయోక్తి అలంకారం.
అలంకారములు రెండు రకాలు.అవి-శబ్దాలంకారాలు,అర్థాలంకారాలు[1]
అతిశయోక్తియలంకారము అర్థాలంకారమునందు చేరుతుంది.
ఉన్నదానికంటే ఎక్కువ చేసి చెప్పడం అతిశయక్తి అలంకారం. ఉదాహరణకి:- 1.ఆ అబ్బాయి తాటి చెట్టు అంతా పొడవు ఉన్నాడు.2. ఆమె ఆకాశానందకుంటుంది.[2]
అతిశయోక్త్యలంకారము-రకాలు
[మార్చు]అతిశయము అంటే అధికమని అర్ధం.ఉక్తి అంటే మాట.అధికం చేసి చెప్పడాన్ని అతిశయోక్తి అంటారు
ఈ అతిశయోక్త్యలంకారము 8 రకాలు-అవి
1.రూపకాతిశయోక్తి అలంకారం
2.సాపహ్నవాతిశయోక్తి అలంకారం
3.భేదకాతిశయోక్తి అలంకారం
4.సంబంధాతిశయోక్తి అలంకారం
5.అసంబంధాతిశయోక్తి అలంకారం
6.అక్రమాతిశయోక్తి అలంకారం
7.చపలాతిశయోక్తి అలంకారం
8.అత్యంతాతిశయోక్తి అలంకారం
1.రూపకాతిశయోక్తి అలంకారం
[మార్చు]పోలికను చెబుతూ విషయాన్ని దాచటం
ఉదా-నల్లకలువల జంట నుండి వాడియైన బాణములు వెలవడుతున్నవి
2.సాపహ్నవాతిశయోక్తి అలంకారం
[మార్చు]కప్పిపుచ్చుకొని ఎక్కువగా చెప్పడం
ఉదా-నీ సూక్తులందు అమృతమున్నది
3.భేదకాతిశయోక్తి అలంకారం
[మార్చు]భేదాన్ని చూపిస్తూ అతిశయంగా చెప్పడం
ఉదా-ఈ రాజు గాంభీర్యమే వేరు ధైైర్యమే వేరు
4.సంబంధాతిశయోక్తి అలంకారం
[మార్చు]సంబంధం లేని చోట సంబంధం ఉన్నట్లు వర్ణించటం
ఉదా-ఈ పురము నందలి మేడలు ఆకాశాన్నంటుచున్నవి
5.అసంబంధాతిశయోక్తి అలంకారం
[మార్చు]సంబంధం ఉన్నప్పుడు ,సంబంధం లేదని చెప్పటం
ఉదా-ఓ రాజా!నీవు ధాాతవై వుండగా మేము కల్పవృక్షములు ఆశించము
6.అక్రమాతిశయోక్తి అలంకారం
[మార్చు]కారణకార్యాలకు సహభావం తెలపటం
ఉదా-ఓ రాజా! నీ బాణములు నీ శత్రువులును సమముగా జ్వాలింగనము గావించుచున్నారు
7.చపలాతిశయోక్తి అలంకారం
[మార్చు]కారణం చెప్పేలోపే కార్యం జరగటం
ఉదా-నీవు వెళుతున్నావని చెప్పునంతలో ఆమె ఉంగరము కంకణమాయెను.
8.అత్యంతాతిశయోక్తి అలంకారం
[మార్చు]కార్యం ముందు కారణం తరువాత జరగటం
ఉదా-ఆమె కోపం పోయింది.తరువాత అతడు బతిమాలెను.
మూలాలు
[మార్చు]- ↑ సాంబశివరావు, శ్రీ ఊలపల్లి. "అలంకారములు - 1 : అలంకారములు : వ్యాకరణము : పోతన తెలుగు భాగవతము". telugubhagavatam.org. Retrieved 2025-12-03.
- ↑ "10.1063/1.4831988.2". Default Digital Object Group. 2013-11-15. Retrieved 2025-12-18.