సాహితీమేఖల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సాహితీమేఖల
సాహితీమేఖల
స్థాపన1934
వ్యవస్థాపకులుఅంబటిపూడి వెంకటరత్నం
కేంద్రీకరణసాహిత్య, సాంస్కృతిక సంస్థ
కార్యస్థానం
సేవలుగ్రంథ ప్రచురణ
ముఖ్యమైన వ్యక్తులుఅంబటిపూడి వెంకటరత్నం

చరిత్ర

[మార్చు]

సాహితీమేఖల 1934లో చండూరు గ్రామంలో అంబటిపూడి వెంకటరత్నం స్థాపించాడు.[1] చండూరు గ్రామంలో ఉన్న ప్రజలంతా ఈ సంస్థ సభ్యులు. అంబటిపూడి వెంకటరత్నం తన కావ్యము మైనాదేవిని చదివినప్పుడు, అది విన్న సిరిప్రెగడ వెంకటరాయ లక్ష్మీనరసింహారావు అనే వ్యక్తికి సాహితీమేఖల స్థాపించాలన్న సంకల్పం కలిగింది. అతని సోదరుడు రామారావు కూడా ఈ సంస్థకు చేయూతను అందించాడు. పులిజాల హనుమంతరావు, ధవళా శ్రీనివాసరావు ఈసంస్థకు వ్యవహర్తలుగా వ్యవహరించారు. సాహితీపిపాస కలిగిన జిజ్ఞాసువులందరూ ఈ సంస్థలో సభ్యులే. 1982 నుండి సాహితీమేఖల అనే మాసపత్రిక ఈ సంస్థ తరఫున పున్న అంజయ్య సంపాదకత్వంలో ప్రారంభమైంది. 1946లో ఈ సంస్థ దశమ వార్షికోత్సవాలకు వానమామలై వరదాచార్యులు, దేవులపల్లి రామానుజరావు, కొప్పరపు సోదరకవులు, సత్యదుర్గేశ్వర కవులు, మాడపాటి హనుమంతరావు, సురవరం ప్రతాపరెడ్డి, దాశరథి రంగాచార్య, సి.నారాయణ రెడ్డి, బిరుదురాజు రామరాజు మొదలైన వారిని ఆహ్వానించి సత్కరించారు. ఈ సంస్థ ద్వారా జమ్మలమడక మాధవరామశర్మ మొదలైన వారి ప్రసంగాలను, దూపాటి సంపత్కుమారాచార్యచే అష్టావధానాలు ఏర్పాటు చేయబడింది.

పండిత ప్రశంస

[మార్చు]

ఈ సంస్థ గురించి దీని కార్యకలాపాల గురించి పలువురు ప్రముఖులు అనేక సందర్భాలలో ప్రశంసించారు. దేవులపల్లి రామానుజరావు తన గ్రంథము తెలుగుదేశములో సాహితీమేఖల గురించి ఈవిధంగా స్తుతించాడు.

యిల నైజాము యిలానులో తెలుగులో యీ పల్లె గ్రామాలలో
పల సస్యాటవులన్ కృషీవలుల రూపంబొంది నెవ్వారికిన్
తెలియన్ రాక వసించు తెల్గు కవులందే దృష్టిసారించి ర
చ్చల కీడ్పించితివమ్మ నీవు గురుదీక్షన్ సాహితీమేఖలా

తెలువుల్గల్గియు లేని వారివలె హృత్తేజంబు గోల్ఫోయి మూ
లల పన్నుండిన మా తెలుంగు కవులన్ లాలించి పాలించు త
ల్లుల ఠేవన్ మధురాంధ్ర కావ్యరసమున్ గ్రోలింపగా జేసి ము
ద్దుల పల్కుల్ బలికించి కుల్కెదవు గాదో సాహితీమేఖలా

ప్రచురణలు

[మార్చు]

ఈ సంస్థ ముఖ్యకార్యకలాపాలలో పుస్తక ప్రచురణ ఒకటి. ఈ సంస్థ ప్రచురించిన గ్రంథాల జాబితా:

ప్రచురణ సంఖ్య గ్రంథం పేరు గ్రంథకర్త పేరు వివరాలు
1 భార్గవానందలహరి సిరిప్రెగడ భార్గవరావు ఖండకావ్య సంపుటి
2 ప్రబోధ మంజరి రావిలాల వీరయ్య గేయ సంపుటి. ఆంధ్రదేశ ప్రాశస్త్యము దీనిలో వర్ణింపబడింది.
3 వేంకటేశ్వర, భద్రాద్రిరామ, రామయతండ్రి శతకములు పులిజాల గోపాలరావు
4 తెలుగుదేశము దేవులపల్లి రామానుజరావు
5 రాగవీణ రామడుగు శ్రీమన్నారాయణశర్మ
6 గుంటూరు కాలేజీ శతావధానము వేలూరి శివరామశాస్త్రి శివరామశాస్త్రి గుంటూరులో చేసిన శతావధాన పద్యాలన్నీ దీనిలో కూర్చబడింది. దీనిలో వేపకాయపై పంచచామరము, గండుచీమపై కవిరాజ విరాజితము, అలుకుగుడ్డపై సీసము, సమస్యలు, వర్ణనలు ఉన్నాయి.
7 శాంతి తీరాలకు అంబటిపూడి వెంకటరత్నం
8 ఇందిరావిజయమ్‌ అంబటిపూడి వెంకటరత్నం సంస్కృత నాటకమ్‌
9 చంద్రశాలా అంబటిపూడి వెంకటరత్నం సంస్కృత కావ్యమ్‌
10 ఇంద్రధనువు అంబటిపూడి వెంకటరత్నం
11 ప్రభుసప్తతి అంబటిపూడి వెంకటరత్నం కృష్ణప్రభూ అనే మకుటంతో వెలువడిన 70 భక్తి పద్యాలు.
12 మధురయాత్ర అంబటిపూడి వెంకటరత్నం
13 వివేకశిఖరాలు అంబటిపూడి వెంకటరత్నం
14 తర్కభాష అంబటిపూడి వెంకటరత్నం
15 ప్రణయవాహిని అంబటిపూడి వెంకటరత్నం
16 మైనాదేవి అంబటిపూడి వెంకటరత్నం
17 మొరాన్‌కన్య అంబటిపూడి వెంకటరత్నం
18 వత్సలుడు అంబటిపూడి వెంకటరత్నం
19 వనవాటి అంబటిపూడి వెంకటరత్నం
20 దక్షిణ అంబటిపూడి వెంకటరత్నం
21 వీరాంజలి అంబటిపూడి వెంకటరత్నం
22 చంద్రశాల (తెలుగు) అంబటిపూడి వెంకటరత్నం
23 కథాకళి అంబటిపూడి వెంకటరత్నం
24 కౌమోదకి అంబటిపూడి వెంకటరత్నం
25 కృష్ణకథ అంబటిపూడి వెంకటరత్నం
26 ఓటర్లకొకమాట అంబటిపూడి వెంకటరత్నం
27 సంధ్యావిద్య అంబటిపూడి వెంకటరత్నం ఇది ఒక ఆధ్యాత్మిక గద్య గ్రంథము. సంధ్యావందన ప్రక్రియకు సరళ గద్యానువాదము.
28 భారతీయ సంస్కృతి అంబటిపూడి వెంకటరత్నం
29 అగ్నిధార దాశరథి కృష్ణమాచార్య
30 నెహ్రూ దేవులపల్లి రామానుజరావు
31 ఖడ్గతిక్కన పులిజాల గోపాలరావు
32 అహల్య వంగల వెంకట చలపతిరావు ఈ కావ్యంలో అహల్య, శ్రీరామ విజయము, పాదుకా ప్రదానము, సీతాపహరణము, హనుమద్విక్రాంతి, తిరస్కృతి, ముద్రికా ప్రదానము, శ్రీరామ పట్టాభిషేకము అనే రామకథలు ఉన్నాయి. ఈ రామకథామంజరిలో మొదటి గాథ అహల్యది అగుటచేత ఈ కావ్యానికి అహల్య అనే పేరు పెట్టారు.
33 ఉన్మాది వంగల వెంకట చలపతిరావు విధవా పునర్వివాహము అశాస్త్రీయమని దీనిలో ప్రతిపాదింపబడింది.
34 తెలుగుసిరి (ఆంధ్రలక్ష్మి) అంబటిపూడి నరసింహశర్మ ఆంధ్రభాషాభిమానమును, ఆంధ్రదేశభక్తిని చాటిచెప్పిన కావ్యము.
35 రత్నకవి సాహిత్యానుశీలనము[2] నిష్టల సుబ్రహ్మణ్యం అంబటిపూడి వెంకటరత్నం జీవిత సాహిత్యాలపై నిర్వహించిన పోటీలో 1500 రూపాయల బహుమతి పొందిన గ్రంథం.
36 సంధ్యావిద్య (పద్యం) అంబటిపూడి వెంకటరత్నం
37 ప్రభు సప్తతి (వచనము) అంబటిపూడి వెంకటరత్నం
38 ఇందిరా విజయమ్‌ (తెలుగు) అంబటిపూడి వెంకటరత్నం
39 Reflections అంబటిపూడి వెంకటరత్నం
40 వజ్రనవకము అంబటిపూడి వెంకటరత్నం
41 వ్యాసావళి అంబటిపూడి వెంకటరత్నం
42 కావ్యవిచారం అంబటిపూడి వెంకటరత్నం
43 ఒడిదుడుకులు అంబటిపూడి వెంకటరత్నం
44 చూడాల అంబటిపూడి వెంకటరత్నం
45 హితోపదేశం అంబటిపూడి వెంకటరత్నం
46 గోపీకావ్యం అంబటిపూడి వెంకటరత్నం
47 తూర్పుపడమరలు అంబటిపూడి వెంకటరత్నం
48 తాత్విక తరంగాలు అంబటిపూడి వెంకటరత్నం
49 ధర్మజనిర్వేదం అంబటిపూడి వెంకటరత్నం
50 నేనెరిగిన కవులు అంబటిపూడి వెంకటరత్నం
51 వేదాంతసారములు అంబటిపూడి వెంకటరత్నం
52 షడ్దర్శనములు అంబటిపూడి వెంకటరత్నం
53 భాగవతమహాత్మ్యం అంబటిపూడి వెంకటరత్నం
54 అకృతజోనరః అంబటిపూడి వెంకటరత్నం
55 భగవద్గీత అంబటిపూడి వెంకటరత్నం
56 కృష్ణబోధ అంబటిపూడి వెంకటరత్నం
57 తెలుగుతల్లి అంబటిపూడి వెంకటరత్నం
58 భావరేఖలు అంబటిపూడి వెంకటరత్నం
59 గాంధీస్మృతి అంబటిపూడి వెంకటరత్నం
60 చైతన్యస్పృహ అంబటిపూడి వెంకటరత్నం
61 వర్తమానకవిత అంబటిపూడి వెంకటరత్నం
62 శతకానువాదాలు అంబటిపూడి వెంకటరత్నం
63 ఏరినపూలు అంబటిపూడి వెంకటరత్నం

మూలాలు

[మార్చు]
  1. నిష్టల, సుబ్రహ్మణ్యం (1986). రత్నకవి సాహిత్యానుశీలనము. చండూరు, ఏదుబాడు: సాహితీమేఖల. pp. 23–32. Retrieved 31 December 2014.
  2. నిష్టల, సుబ్రహ్మణ్యం (1986). రత్నకవి సాహిత్యానుశీలనము. చండూరు, ఏదుబాడు: సాహితీమేఖల. Retrieved 31 December 2014.