Jump to content

సిమ్రాన్ శర్మ

వికీపీడియా నుండి
సిమ్రాన్ శర్మ
జననం (1997-11-28) 1997 నవంబరు 28 (వయసు 27)
జాతీయతభారతీయురాలు
విద్యడిగ్రీ
విద్యాసంస్థకాన్వెంట్ ఆఫ్ జీసస్ అండ్ మేరీ, చెల్సియా, సిమ్లా
డీఏవి పబ్లిక్ స్కూల్, న్యూ సిమ్లా
వృత్తినటి, మోడల్
క్రియాశీల సంవత్సరాలు2014 - ప్రస్తుతం
సుపరిచితుడు/
సుపరిచితురాలు
బ్లూ మౌంటైన్స్ (2017)
ఫియర్ ఫైల్స్: డర్ కి సచ్చి తస్విరీన్ (2014)

సిమ్రాన్‌ శర్మ (జననం 1997 నవంబరు 28) భారతీయ సినిమా నటి, మోడల్. 2017లో మిస్ రాజస్తాన్ గా నిలిచింది. ఆమె మిస్టర్‌ ఇడియట్‌ తో కథానాయికగా తెలుగు తెరపై అరంగేట్రం చేయనుంది. నవంబరు 2023లో విడుదల కానున్న ఈ సినిమాలో హీరో రవితేజ తమ్ముడు రఘు రాజు కుమారుడు మాధవ్‌ హీరో కాగా, సిమ్రాన్‌ శర్మ హీరోయిన్‌.[1] అయితే, 2021లో నీహారిక కొణిదెల నిర్మించిన వెబ్ సిరీస్ ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీలో ఆమె సంగీత్ శోభన్ తో జతకట్టింది.[2]

ఆమె 2015లో సుమన్ గంగూలీ దర్శకత్వం వహించిన బ్లూ మౌంటైన్స్ చిత్రంతో తన నటనా జీవితాన్ని ప్రారంభించింది. ఈ చిత్రం 2016 హైదరాబాద్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఉత్తమ ఫీచర్ ఫిల్మ్‌ అవార్డును గెలుచుకుంది.[3] అలాగే. పలు జాతీయ, అంతర్జాతీయ అవార్డులనూ కైవసం చేసుకుంది. ఆ తరువాత, ఆమె ఐసీ దీవాంగీ దేఖి నహీ కహీ, చిద్యఘర్, తేరే బినా జియా జాయే నా, తు మేరా హీరో వంటి అనేక టెలివిజన్ సీరియల్‌లలో కూడా నటించింది.

బాల్యం, విద్యాభ్యాసం

[మార్చు]

సిమ్రాన్ శర్మ హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లాలో జన్మించింది. ఆమె కాన్వెంట్ ఆఫ్ జీసస్ అండ్ మేరీ స్కూల్, డీఏవి పబ్లిక్ స్కూల్ ల నుండి పాఠశాల విద్యను పూర్తి చేసింది.

కెరీర్

[మార్చు]

చదువుకుంటూనే టెలివిజన్ ప్రకటనలు, ఫోటోషూట్‌లలో చేయడం సిమ్రాన్ శర్మ ప్రారంభించింది. 2015లో, సుమన్ గంగూలీ దర్శకత్వం వహించిన బ్లూ మౌంటైన్స్ చిత్రంతో ఆమె ప్రసిద్ధి చెందింది. అదే సమయంలో ఎపిసోడిక్ షో ఫియర్ ఫైల్స్‌లో తన మొదటి పాత్రను పోషించింది. తర్వాత ఆమె ఐసీ దీవాంగీ దేఖి నహీ కహీ, తేరే బిన్, తషన్ ఇ ఇష్క్, తు మేరా హీరో, తేరే బినా జియా జాయే నాలలోనూ నటించింది.

మూలాలు

[మార్చు]
  1. "మిస్టర్‌ ఇడియట్‌". Archived from the original on 2023-10-16. Retrieved 2023-10-16.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. Eenadu (20 November 2021). "రివ్యూ: ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ". Archived from the original on 23 November 2021. Retrieved 23 November 2021.
  3. "9 Award Winning Indian Films at the International Children's Film Fest". The Better India.