సిలారపు రాజనర్సింహ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సిలారపు రాజనర్సింహ

గృహ నిర్మాణ శాఖ మంత్రి
పదవీ కాలం
1972 - 1978

ఎమ్మెల్యే
పదవీ కాలం
1967 - 1983
ముందు ఎస్. లక్ష్మి దేవి
తరువాత హద్కర్ లక్ష్మణ్ జీ
నియోజకవర్గం ఆందోల్

వ్యక్తిగత వివరాలు

జననం 1930
జోగిపేట, సంగారెడ్డి జిల్లా, తెలంగాణ రాష్ట్రం, భారతదేశం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ
సంతానం దామోదర రాజనర్సింహ, రాంచందర్[1]

సిలారపు రాజనర్సింహ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఆందోల్ శాసనసభ నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా పని చేశాడు.[2]

రాజకీయ జీవితం[మార్చు]

సి. రాజనర్సింహ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పనిచేసి 1967లో జరిగిన అస్సెంబ్లీ ఎన్నికల్లో ఆందోల్ నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థి కే. ఈశ్వరప్పపై 9757 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[3] ఆయన ఆ తరువాత 1972లో ఎన్నికల్లో తన సమీప ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థి లక్ష్మణ్ కుమార్ పై 13901 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై పి.వి.నరసింహారావు, జలగం వెంగళరావు మంత్రివర్గాల్లో గృహ నిర్మాణ శాఖ మంత్రిగా పని చేశాడు.[4]

సి. రాజనర్సింహ 1978లో జరిగిన అస్సెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఇందిరా కాంగ్రెస్ అభ్యర్థి సదానంద్ పై 738 ఓట్ల మెజారిటీతో గెలిచి మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[5] ఆయన 1983లో పోటీకి దూరంగా ఉండి 1985 ఎన్నికల్లో పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మల్యాల రాజయ్య చేతిలో 16463 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[6][7]

మూలాలు[మార్చు]

  1. Eenadu (19 November 2023). "అన్నదమ్ములు.. ఒకరు కాంగ్రెస్‌, మరొకరు భాజపా". Archived from the original on 19 November 2023. Retrieved 19 November 2023.
  2. Andhrajyothy (19 November 2023). "అది రాజనర్సింహల అడ్డా". Archived from the original on 19 November 2023. Retrieved 19 November 2023.
  3. Traceall (2023). "Andole assembly election results in Andhra Pradesh". Archived from the original on 19 November 2023. Retrieved 19 November 2023.
  4. Eenadu (29 October 2023). "అంచెలంచెలుగా.. అత్యున్నతంగా." Archived from the original on 29 October 2023. Retrieved 29 October 2023.
  5. Eenadu. "అందోలు విజయం.. అధికారానికి మార్గం". Archived from the original on 19 November 2023. Retrieved 19 November 2023.
  6. Sakshi (26 May 2014). "'అందోల్'లో దామోదర్ దే రికార్డు". Archived from the original on 19 November 2023. Retrieved 19 November 2023.
  7. Eenadu (26 October 2023). "విపక్షమైనా వారే స్వపక్షమైనా వారే". Archived from the original on 19 November 2023. Retrieved 19 November 2023.