చాపలమడుగు రామయ్య చౌదరి
చాపలమడుగు రామయ్య చౌదరి, (1912 - 1971) భారత రాజకీయనాయకుడు. తొలి పార్లమెంట్ లో సభ్యులగాను, ఆంధ్ర పదేశ్ శాసన సభ్యులుగాను పనిచేసారు.
జననం
[మార్చు]రామయ్య చౌదరి గారు గుంటూరు జిల్లా, చిలకలూరిపేట మండలానికి చెందిన కమ్మవారిపాలెం గ్రామంలో 1912 లో జన్మించాడు. ఇతని తల్లి దండ్రులు రంగమ్మ,సుబ్బయ్య.అదే గ్రామానికి చెందిన అతని మేనమామ గురవయ్య కుమార్తె వెంకటనరసమ్మను 1936 లో వివాహమాడాడు.వీరికి ఒక కుమారుడు చంద్రశేఖరరావు, ఒక కుమార్తె ప్రభావతి.
విద్య, వృత్తి.
[మార్చు]రామయ్య చౌదరి ప్రాథమిక విద్య తను జన్మించిన స్వగ్రామం కమ్మవారిపాలెంలోనే చదివాడు.ఉన్నత పాఠశాల విద్య నరసరావుపేట పురపాలక సంఘం హైస్కూలులో చదివాడు.ఆ తరువాత ఎ.సి.కాలేజీ, గుంటూరులో చదివి డిగ్రీ పూర్తిచేసాడు.లా కోర్సు చదవాలనే ఆకాంక్షతో మద్రాసు న్యాయ కళాశాలలో చేరి బి.ఎ.,బి.యల్.పూర్తిచేసి న్యాయ శాస్త్రంలో పట్టా పొందాడు.వృత్తిరీత్యా న్యాయవాది అయినందున నరసరావుపేటలో స్థిరనివాసం ఏర్పరుచుకున్నాడు.న్యాయవాది వృత్తిలో 1935 నుండి 1968 వరకు కొనసాగాడు.నరసరావుపేట న్యాయవాదుల సంఘం సభ్యులుగా కొంతకాలం పనిచేసాడు.[1]
రాజకీయ ప్రవేశం
[మార్చు]సి.ఆర్. చౌదరి న్యాయవాది వృత్తి చేస్తూనే 1951లో రాజకీయలలో ప్రవేశించాడు. నరసరావుపేట నియోజకవర్గం 1951 లో ఏర్పడింది.1952లో జరిగిన తొలి పార్లమెంటు ఎన్నికలలో రామయ్య చౌదరి స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొంది 1957 వరకు తొలి లోక్‌సభలో నరసరావుపేట నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించాడు.[2] ఇదే కాలంలో కేంద్ర ప్రభుత్వం తరుపున ప్రతినిధిగా లోక్‌సభ సభ్యుని హోదాలో చైనాలో పర్యటించాడు.
1962లో కాంగ్రెసు అభ్యర్థిగా నరసరావుపేట శాసనసభ నియోజకవర్గం నుండి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికయ్యాడు.[3] వీరు స్వతంత్ర పార్టీ తరుపున ప్రత్యర్థిగా నిలబడిన కొత్తూరి వెంకటేశ్వర్లుపై గెలుపొందాడు.[4]
అయితే 1967లో గుంటూరు జిల్లా, ప్రత్తిపాడు నియోజకవర్గం నుండి కాంగ్రెసు అభ్యర్థిగా పోటిచేసి ఓటమి పొందాడు.
నిర్యాణం
[మార్చు]రామయ్య చౌదరి గారు 1971 వ సంవత్సరం సెప్టెంబరు నెల 3 న అంతిమశ్వాస విడిచారు.
మూలాలు
[మార్చు]- ↑ నరసరావుపేట పురపాలక సంఘం శత వసంతోత్సవ సంచిక పేజీ సంఖ్య 80
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-06-04. Retrieved 2020-06-04.
- ↑ https://web.archive.org/web/20140404203355/http://eci.nic.in/eci_main/StatisticalReports/LS_1951/VOL_1_51_LS.PDF
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-06-04. Retrieved 2020-06-04.