కమ్మవారిపాలెం (చిలకలూరిపేట)
స్వరూపం
కమ్మవారిపాలెం | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 16°07′53″N 80°05′41″E / 16.131280°N 80.094677°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | పల్నాడు |
మండలం | చిలకలూరిపేట |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | 522611 |
ఎస్.టి.డి కోడ్ |
కమ్మవారిపాలెం, పల్నాడు జిల్లా, చిలకలూరిపేట మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
గ్రామంలో విద్యా సౌకర్యాలు
[మార్చు]ఈ ఊరిలో 1 నుండి 5 వరకు ప్రాథమిక పాఠశాల, 6 నుండి 10 వరకు ప్రాథమికోన్నత పాఠశాల ఉన్నాయి.
గ్రామంలో ప్రధాన పంటలు
[మార్చు]ఈ గ్రామంలో 1940 లో వరి ప్రధాన పంట, తరువాత వరుసగా చెరుకు, పొగాకు, ప్రత్తి, మిరప, కంది, సుబాబుల్ ప్రధాన పంటలు. 1999,2003 లో కరువు, ఋతుపవనాల రాక ఆలస్యం వంటివి ఊరిలో ఆహార వాణిజ్య పంటల పైన చాల ప్రభావం చూపించడం వలన, ప్రత్యామ్నాయంగా రైతులు సుబాబులు పంట వైపు వెల్లారు.
గ్రామంలో ప్రధాన వృత్తులు
[మార్చు]వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు
ప్రముఖులు
[మార్చు]ఈ గ్రామంలో భారత రాజకీయనాయకుడు చాపలమడుగు రామయ్య చౌదరి ఈ గ్రామంలో జన్మించాడు.నరసరావుపేట తొలి లోక్‌సభ నియోజకవర్గం సభ్యుడుగా 1952 నుండి 1957 వరకు పనిచేసాడు.నరసరావుపేట శాసనసభ నియోజకవర్గానికి 1962 నుండి 1967 వరకు ప్రాతినిధ్యం వహించాడు.