Jump to content

సి.వి.చంద్రశేఖర్

వికీపీడియా నుండి
సి.వి.చంద్రశేఖర్
సి.వి.చంద్రశేఖర్
జననం (1935-05-22) 1935 మే 22 (వయసు 89)
వృత్తినాట్య కళాకారుడు, నృత్య దర్శకుడు, విద్యావేత్త
క్రియాశీల సంవత్సరాలు1947–ప్రస్తుతం [1]
Dancesభరతనాట్యం

సి.వి.చంద్రశేఖర్ (జ.1935) ఒక భారతీయ భరతనాట్య కళాకారుడు, విద్యావేత్త, నృత్య దర్శకుడు.

ఆరంభ జీవితం, నాట్య శిక్షణ

[మార్చు]

ఇతడు ఎం.ఎస్.సి. చదివాడు. తరువాత చెన్నైలోని కళాక్షేత్రలో భరతనాట్యంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా చదివాడు. అక్కడ రుక్మిణీదేవి అరండేల్, కరైకాల్ శారదాంబాళ్, కె.ఎన్.దండాయుధపాణి పిళ్ళై మొదలైన వారివద్ద భరతనాట్యంలో శిక్షణ పొందాడు.[2] కర్ణాటక సంగీతం బడలూర్ కృష్ణమూర్తిశాస్త్రి, ఎం.డి.రామనాథన్‌ల వద్ద నేర్చుకున్నాడు.[1]

వృత్తి

[మార్చు]

ఇతడు 1947లో తన నాట్య వృత్తిని ఆరంభించాడు. ఆ సమయంలో భరతనాట్యంలో పురుషులు చాలా తక్కువ.[1] ఇతడు బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో కొంత కాలం పనిచేసి తరువాత బరోడాలోని మహారాజా సయాజీరావ్ యూనివర్సిటీలో చేరి అక్కడ 1992లో పర్ఫార్మింగ్ ఆర్ట్స్ విభాగంలో డీన్‌గా పదవీ విరమణ చేశాడు.[2] ఇతడు బహుముఖ ప్రజ్ఞాశాలి. ఇతడు నర్తకుడిగా, కొరియోగ్రాఫర్‌గా, పరిశోధకుడిగా, సంగీతజ్ఞుడిగా, విద్వావేత్తగా, స్వరకర్తగా, భరతనాట్య గురువుగా రాణించాడు. ఇతడు తన భార్య జయ చంద్రశేఖర్‌తో కలిసి నాట్యప్రదర్శనలు ఇచ్చాడు. 1980-90లలో వీరు భరతనాట్య జంటలలో ఒకరిగా పేరు గడించారు. ఈ జంట తమ కుమార్తెలు చిత్ర, మంజరి, మనుమలు విరాజ్, హర్షవర్ధన్, అన్షుమన్, మనుమరాలు ధేనుకలతో కలిసి నాట్యప్రదర్శనలు ఇచ్చారు.[1] ఇతడు గత ఆరు దశాబ్దాలుగా భారతదేశంలోను, ప్రపంచమంతటా అనేక మంది నాట్యకళాకారుల ఆహ్వానంపై పర్యటించి అక్కడ ప్రదర్శనలు ఇవ్వడమే కాక భరతనాట్యం నేర్పించాడు. ఇతడు ఏడవ దశకంలో కూడా రంగస్థలంపై ప్రదర్శనలు కొనసాగిస్తున్నాడు.[3] ప్రస్తుతం ఇతడు చెన్నైలో నృత్యశ్రీ పేరుతో ఒక నాట్యపాఠశాలను నడుపుతున్నాడు.[4]

ఇతడు అనేక నృత్య నాటికలకు దర్శకత్వం వహించాడు. వాటిలో కాళిదాసుని "ఋతుసంహారం", "మేఘదూతం", అపరాజిత, పంచ మహాభూతం, ఆరోహణం, భూమిజ, భ్రమరగీతం వంటివి విమర్శకుల, ప్రేక్షకుల ప్రశంసలను అందుకున్నాయి.[5]

పురస్కారాలు

[మార్చు]

ఇతడు 1993లో కేంద్ర సంగీత నాటక అకాడమీ ఇతడికి భరతనాట్యంలో అవార్డును ప్రకటించింది.[6] 2008లో కాళిదాస్ సమ్మాన్ పురస్కారాన్ని అందుకున్నాడు.[7][8] 2011లో భారతప్రభుత్వం ఇతడిని పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది. ఇంకా చెన్నైలోని కృష్ణ గానసభ నుండి "నృత్యచూడామణి", నారద గానసభ నుండి "నాదబ్రహ్మం అవార్డు", భైరవి ఫైన్‌ఆర్ట్స్, క్లీవ్‌లాండ్ నుండి "నృత్య రత్నాకర", మైసూరు నుండి "నృత్య కళారత్న", భరతాలయ నుండి "భరత కళాసాగర", "నృత్యోదయ అవార్డు" మొదలైనవి ఇతడికి లభించాయి.

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 1.3 A tale of fortitude: C.V. Chandrasekhar and Jaya Chandrasekhar.. Archived 2008-01-29 at the Wayback Machine The Hindu, 25 January 2008.
  2. 2.0 2.1 "ARTISTE'S PROFILE". Centre for Cultural Resources and Training (CCRT) website. Archived from the original on 21 July 2011. Retrieved 15 October 2010.
  3. "Spirited performance". The Hindu. 10 January 2003. Archived from the original on 25 February 2008. Retrieved 15 October 2010.
  4. "Professor C. V. Chandrasekhar". Archived from the original on 2021-04-20. Retrieved 2021-04-20.
  5. web master. "More About Prof. C.V. Chandrasekhar". International Congress of Mathematicians 2010. Retrieved 21 April 2021.
  6. "SNA: List of Akademi Awardees". Sangeet Natak Akademi Official website. Archived from the original on 17 February 2012.
  7. "Chandrasekhar chosen for Kalidas Samman". The Hindu. 22 August 2008. Archived from the original on 26 ఆగస్టు 2008. Retrieved 20 ఏప్రిల్ 2021.
  8. "With the timing of a juggler". The Hindu. 26 Dec 2008. Archived from the original on 7 జనవరి 2009. Retrieved 20 ఏప్రిల్ 2021.

బయటి లింకులు

[మార్చు]