సీక్కుగే ప్రసన్న
వ్యక్తిగత సమాచారం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | సీక్కుగే ప్రసన్న | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | బలపిటియ, శ్రీలంక | 1985 జూన్ 27||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ఎత్తు | 5 అ. 9 అం. (1.75 మీ.) | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి లెగ్ బ్రేక్ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | Bowling ఆల్ రౌండరు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ఏకైక టెస్టు (క్యాప్ 117) | 2011 సెప్టెంబరు 8 - ఆస్ట్రేలియా తో | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 148) | 2011 ఆగస్టు 20 - ఆస్ట్రేలియా తో | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 2019 జనవరి 5 - న్యూజీలాండ్ తో | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
వన్‌డేల్లో చొక్కా సంఖ్య. | 41 | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి T20I (క్యాప్ 51) | 2013 డిసెంబరు 13 - పాకిస్తాన్ తో | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి T20I | 2017 అక్టోబరు 29 - పాకిస్తాన్ తో | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2006–present | Sri Lanka Army | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2008–2010 | కందురాటా | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2012–2013 | Basnahira | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2012 | Uva Next | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2014 | Southern Express | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2015 | Barisal Bulls | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2016 | Hambantota Troopers | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2016–2018 | నార్తాంప్టన్‌షైర్ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2016 | Dhaka Dynamites | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2017 | Khulna Titans | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2019 | Rajshahi Kings | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2019 | Trinbago Knight Riders | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2020 | Lahore Qalandars | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2020 | Kandy Tuskers | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2021 | Colombo Stars | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: Cricinfo, 2019 జనవరి 5 |
సీక్కుగే ప్రసన్న (జననం 1985, జూన్ 27), శ్రీలంక క్రికెట్ ఆటగాడు. పరిమిత ఓవర్ల క్రికెట్ ఆడాడు. అతను శ్రీలంక ఆర్మీలో వారెంట్ అధికారిగా ఉన్నాడు.[1] ప్రసన్న వన్డేలలో చివరి ఓవర్లలో దూకుడుగా బ్యాటింగ్ చేయడం, ఉపయోగకరమైన లెగ్ స్పిన్నర్, బహుశా శ్రీలంక మాజీ లెగ్ స్పిన్నర్ ఉపుల్ చందన తర్వాత అత్యుత్తమంగా గుర్తించబడ్డాడు. ప్రసన్న 2014 ఐసీసీ వరల్డ్ ట్వంటీ 20 గెలిచిన శ్రీలంక జట్టులో సభ్యుడిగా ఉన్నాడు
దేశీయ, టీ20 క్రికెట్
[మార్చు]2019 మార్చిలో 2019 సూపర్ ప్రావిన్షియల్ వన్ డే టోర్నమెంట్ కోసం కొలంబో జట్టులో ఎంపికయ్యాడు.[2] 2020 అక్టోబరులో లంక ప్రీమియర్ లీగ్ ప్రారంభ ఎడిషన్ కోసం క్యాండీ టస్కర్స్ చేత డ్రాఫ్ట్ చేయబడ్డాడు.[3]
2021 ఏప్రిల్ లో 2021 పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో రీషెడ్యూల్ చేసిన మ్యాచ్‌లలో ఆడేందుకు లాహోర్ క్వాలండర్స్ చేత సంతకం చేయబడ్డాడు.[4] 2021 ఆగస్టులో 2021 ఎస్ఎల్సీ ఇన్విటేషనల్ టీ20 లీగ్ టోర్నమెంట్ కోసం ఎస్ఎల్సీ రెడ్స్ జట్టులో ఎంపికయ్యాడు.[5] 2021 నవంబరులో 2021 లంక ప్రీమియర్ లీగ్ కోసం ఆటగాళ్ల డ్రాఫ్ట్ తర్వాత కొలంబో స్టార్స్ కోసం ఆడటానికి ఎంపికయ్యాడు.[6] 2022 జూలైలో లంక ప్రీమియర్ లీగ్ మూడవ ఎడిషన్ కోసం కొలంబో స్టార్స్‌తో సంతకం చేశాడు.[7]
అంతర్జాతీయ క్రికెట్
[మార్చు]ప్రసన్న 2011 సెప్టెంబరు 8న పల్లెకెలె అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక తరపున టెస్టు క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు.[8] 2011లో ఇదే సిరీస్‌లో ఆస్ట్రేలియాపై వన్డే అరంగేట్రం జరిగింది. ట్వంటీ-20 అంతర్జాతీయ అరంగేట్రం 2013లో యుఏఈలో పాకిస్థాన్‌తో జరిగింది.
2015 ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్‌లో గాయపడిన దిముత్ కరుణరత్నే స్థానంలో ఇతన్ని ప్రపంచ కప్ జట్టులోకి పిలిచారు. తన మొదటి ప్రపంచ కప్ ఆటను 2015 మార్చి 11న స్కాట్లాండ్‌తో ఆడాడు.[9]
సైనిక వృత్తి
[మార్చు]ఇతను 2017 మార్చి 1న పదోన్నతి పొందిన శ్రీలంక ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్, 2వ రెజిమెంట్‌కి అటాచ్ చేసిన వారెంట్ ఆఫీసర్‌గా శ్రీలంక ఆర్మీలో పనిచేస్తున్నాడు.[10]
మూలాలు
[మార్చు]- ↑ "Army Promotions For Seekkuge Prasanna and Asela Gunaratne". News First. Retrieved 2023-08-25.
- ↑ "Squads, Fixtures announced for SLC Provincial 50 Overs Tournament". The Papare. Retrieved 2023-08-25.
- ↑ "Chris Gayle, Andre Russell and Shahid Afridi among big names taken at LPL draft". ESPN Cricinfo. Retrieved 2023-08-25.
- ↑ "Lahore Qalandars bag Shakib Al Hasan, Quetta Gladiators sign Andre Russell". ESPN Cricinfo. Retrieved 2023-08-25.
- ↑ "Sri Lanka Cricket announce Invitational T20 squads and schedule". The Papare. Retrieved 2023-08-25.
- ↑ "Kusal Perera, Angelo Mathews miss out on LPL drafts". ESPN Cricinfo. Retrieved 2023-08-25.
- ↑ "LPL 2022 draft: Kandy Falcons sign Hasaranga; Rajapaksa to turn out for Dambulla Giants". ESPN Cricinfo. Retrieved 2023-08-25.
- ↑ Coverdale, Brydon. "Sri Lanka bat, Prasanna in for injured Herath". ESPNcricinfo. Retrieved 2023-08-25.
- ↑ "Seekkuge Prasanna joins Sri Lanka World Cup squad - Yahoo News". news.yahoo.com. Archived from the original on 2015-04-02.
- ↑ Army Cricketers Selected for T-20 Tour in India