సీతారాంబాగ్ దేవాలయం
సీతారాంబాగ్ దేవాలయం | |
---|---|
స్థానం | |
దేశం: | భారతదేశం |
రాష్ట్రం: | తెలంగాణ |
ప్రదేశం: | మంగళ్‌హాట్ , హైదరాబాదు |
నిర్మాణశైలి, సంస్కృతి | |
నిర్మాణ శైలి: | మొగల్ - రాజ్‌పుట్ -కుతుబ్ షాహి |
సీతారాంబాగ్ దేవాలయం తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని సీతారాంబాగ్ ప్రాంతంలో ఉన్న దేవాలయం.[1][2] రాజస్థాన్‌లోని లక్ష్మణ్‌గఢ్ ప్రాంతం గణేరివాలా కుటుంబానికి చెందిన పురాన్‌మల్ గనేరివాల్ అనే వ్యక్తి 1820లలో 25 ఎకరాల్లో ఆలయ నిర్మాణం ప్రారంభమై, 1832లో మూల విరాట్‌ను ప్రతిష్ఠింపజేయడం జరిగింది.[3] హైదరాబాదు పట్టణ అభివృద్ధి సంస్థ (హుడా)చే వారసత్వ కట్టడంగా గుర్తించబడింది.
నిర్మాణం
[మార్చు]దేవాలయం చుట్టూ యూరోపియన్ వాస్తు శైలిలో నిర్మించిన ఎత్తైన ప్రాకారాలు ఉన్నాయి. జైపూర్ పాలరాతితో చెక్కిన సీతాసమేత శ్రీరాముడు, లక్ష్మణ, హనుమ, భరత, శత్రుజ్ఞలు సహితంగా శ్రీరాముని పట్టాభిషేక ఘట్టాన్ని తలపించే విగ్రహాలు ఈ దేవాలయంలో ప్రతిష్టించబడ్డాయి. ఏడవ నిజాం రాజు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఈ ఆలయ పునఃనిర్మాణానికి ఆర్థిక సహాయం అందించాడు.[4][5]
గ్రైనేట్, సున్నం రాయిని ఉపయోగించి ఆలయాన్ని నిర్మించారు. దర్వాజాలు 20 అడుగుల ఎత్తులో ఏర్పాటుచేయబడ్డాయి.
విశిష్టత
[మార్చు]ఆ రోజుల్లో తెలంగాణా ప్రాంతంలో విద్యా సంస్థలు లేకపోవడం వల్ల సీతారాంబాగ్ ఆలయ ప్రాంగణంలో సంస్కృత పాఠశాలను ప్రారంభించి, ఉచిత విద్యను అందించారు. ఖండవల్లి నర్సింహశాస్త్రి వ్యాకరణ పండితులుగా పనిచేసిన ఈ పాఠశాలలో దాశరథి కృష్ణమాచార్య, దివాకర్ల వెంకటావధాని, రవ్వా శ్రీహరి, కె.కె. రంగానాథాచార్యులు, ఎస్.వి. విశ్వనాథశర్మ తదితరులు విద్యను అభ్యసించారు.[6]
ఉత్సవాలు
[మార్చు]శ్రీరామ నవమి సందర్భంగా ఎనిమిది రోజులపాటు ఆలయంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. నవమిరోజు రాత్రి సమయంలో సీతారామ కళ్యాణం జరుగుతుంది.[7]
మూలాలు
[మార్చు]- ↑ "A symbol of secularism in the Old City". The Times Of India. 2004-03-15. Archived from the original on 2013-07-14. Retrieved 2018-12-14.
- ↑ "Returning home to Deccan". The Hindu. Chennai, India. 2008-01-08. Archived from the original on 2012-11-09. Retrieved 2018-12-14.
- ↑ నమస్తే తెలంగాణ, బతుకమ్మ (ఆదివారం సంచిక) (7 August 2016). "రాజును బంధించిన చెరసాల- సీతారాంభాగ్ దేవాలయం". పరవస్తు లోకేశ్వర్. Archived from the original on 10 May 2019. Retrieved 10 May 2019.
- ↑ "A 'miser' who donated generously". thehindu.
- ↑ "Nizam gave funding for temples, and Hindu educational institutions". missiontelangana. missiontelangana. Archived from the original on 8 జూలై 2018. Retrieved 14 December 2018.
- ↑ "సిటీలో పట్టాభిరాముడు". 25 February 2015. Retrieved 14 December 2018.[permanent dead link]
- ↑ ఆంధ్రజ్యోతి (23 March 2018). "భాగ్యనగరంలో అయోధ్యరాముడు". Archived from the original on 14 December 2018. Retrieved 14 December 2018.