Jump to content

సీతా సోరెన్

వికీపీడియా నుండి
సీతా సోరెన్

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2009
ముందు సునీల్ సోరెన్
నియోజకవర్గం జామ శాసనసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామి దుర్గా సోరెన్
సంతానం రాజశ్రీ సోరెన్,
జయశ్రీ సోరెన్

సీతా ముర్ము అలియాస్ సీతా సోరెన్ ఒక భారతీయ రాజకీయ నాయకురాలు. జామ నియోజకవర్గం నుండి జార్ఖండ్ శాసనసభ సభ్యురాలిగా పనిచేస్తున్న భారతీయ జనతా పార్టీ నాయకురాలు. ఆమె జెఎమ్ఎమ్ చీఫ్ శిబు సోరెన్ కోడలు, దివంగత [[:en:Durga Soren|దుర్గా సోరెన్]] భార్య.[1][2] 2012 రాజ్యసభ ఎన్నికల్లో ఓటింగ్‌లో డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలతో ఆమె ఏడు నెలల పాటు జైలులో గడిపింది. ఆ తరువాత, ఆమె బెయిల్‌పై బయటకు వచ్చింది.[3]

బాల్యం, విద్యాభ్యాసం

[మార్చు]

ఒడిశాలోని మయూర్‌భంజ్‌లో బోడు నారాయణ్ మాంఝీ, మాలతీ ముర్ము దంపతులకు సీతా సోరెన్ జన్మించింది. అక్కడ ఆమె 12వ తరగతి వరకు చదువుకుంది.

నేపథ్యం

[మార్చు]

2009లో శిబు సోరెన్ పెద్ద కుమారుడు. ఆమె భర్త దుర్గా సోరెన్ 39 సంవత్సరాల వయస్సులోనే బొకారోలో అనుమానాస్పద స్థితిలో మరణించాడు. వారికి ఇద్దరు కుమార్తెలు రాజశ్రీ సోరెన్, జయశ్రీ సోరెన్. రాజశ్రీ బిజినెస్ మేనేజ్‌మెంట్, జయశ్రీ లా కోర్సులో డిగ్రీలు పూర్తిచేసారు. విరిద్దరు తమ తండ్రి పేరిట 2021 అక్టోబరులో దుర్గా సోరెన్ సేన అని ఒక పార్టీని స్థాపించారు. రాష్ట్రంలోని అవినీతి, నిర్వాసిత, భూ దోపిడీ తదితర సమస్యలపై పోరాడటమే తమ లక్ష్యంగా ప్రకటించారు.

సోదరుని మరణానంతరం జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీలో హేమంత్ సోరెన్ స్థాయి పెరిగింది. అయితే, రాష్ట్రంలో జరిగే అక్రమ మైనింగ్, రవాణా సమస్యలపై సీతా సోరెన్ తరచూ తన గొంతు వినిపిస్తూండేది.

రాజకీయ జీవితం

[మార్చు]

2009లో జార్ఖండ్‌లోని జామా నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యింది. ఆమె ఎన్నికైన తర్వాత, ఆమె జార్ఖండ్ ముక్తి మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యింది. 2014లో అదే నియోజకవర్గం నుంచి జార్ఖండ్‌ శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించింది. 2019లో జార్ఖండ్‌లోని జామా నియోజకవర్గం నుంచి ఆమె మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచింది.[1] 2024 మార్చి 19న, ఆమె తన పార్టీ జార్ఖండ్ ముక్తి మోర్చాకు సంబంధించి అన్ని పదవులకు రాజీనామా చేసి వినోద్ తావ్డే, విశాల్ సింగ్ సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరింది.[4]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "Sita Murmu Alias Sita Soren(JMM):Constituency- JAMA (ST)(DUMKA ) - Affidavit Information of Candidate:". myneta.info. Retrieved 2022-06-22.
  2. "Who Is Sita Soren? Three-Time MLA And Daughter-In-Law Of Shibu Soren". www.shethepeople.tv. Archived from the original on 2022-06-22. Retrieved 2022-06-22.
  3. "Sita Soren gets bail in horse-trading case | India News - Times of India". The Times of India.
  4. "జేఎంఎంకు సీతా సోరెన్‌ రాజీనామా! | Sita Soren Has Resigned From JMM - Sakshi". web.archive.org. 2024-03-19. Archived from the original on 2024-03-19. Retrieved 2024-03-19.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)