శిబు సోరెన్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

పదవీ కాలము
30th December 2009 - 20th May 2010
ముందు President's Rule
నియోజకవర్గము Dumka

జననం (1944-01-11) 11 జనవరి 1944 (వయస్సు: 74  సంవత్సరాలు)
Hazaribagh, Jharkhand
రాజకీయ పార్టీ JMM
జీవిత భాగస్వామి Roopi Soren
సంతానము 3 sons and 1 daughter
నివాసము Bokaro
25 September, 2006నాటికి

మూలం: [1]

శిబు సోరెన్ (జననం: 1944 జనవరి 11) ఒక భారతీయ రాజకీయ నాయకుడు, ఆయన భారతదేశంలోని జార్ఖండ్ రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి.[1] జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన తరువాత, ఇతను 2009 డిసెంబరు 30న 7వ జార్ఖండ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.[2] భారతీయ జనతా పార్టీ నుంచి సంకీర్ణానికి మద్దతు పొందడంలో విఫలం కావడంతో ఆయన 2010 మే 30న రాజీనామా చేశారు.[3] ప్రస్తుతం UPA భాగస్వామ్య పక్షంగా ఉన్న జార్ఖండ్ ముక్తి మోర్చా (JMM) అనే రాజకీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న సోరెన్ దీనికి ముందు 14వ లోక్‌సభకు జార్ఖండ్‌లోని డుంకా నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు.

2009 జనవరి 9న తమార్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో ఎటువంటి రాజకీయ అనుభవం లేని జార్ఖండ్ పార్టీ అభ్యర్థి గోపాల్ క్రిషన్ పతార్ అలియాస్ రాజా పీటర్‌పై సోరెన్ 9,000 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. దీనికి ముందు శశినాథ్ ఝా హత్య కేసులో సోరెన్ ప్రమేయాన్ని నిరూపించడంలో CBI (సిబిఐ) విఫలం కావడంతో, ఈ నేరంలో ఆయన ప్రమేయం లేదని ఢిల్లీ హైకోర్టు నిర్ధారించింది, హైకోర్టు ఆగస్టు 2007లో గతంలో ఆయనకు విధించిన యావజ్జీవ శిక్షను రద్దు చేసింది, దీనితో 2008 ఆగస్టు 27న ఆయన ముఖ్యమంత్రిగా తిరిగి నియమితులయ్యారు. అసెంబ్లీ ఎన్నికల తరువాత సోరెన్ మరోసారి BJPతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు, 2009 డిసెంబరు 30న జార్ఖండ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

నవంబరు 2006లో ఆయన కేంద్ర మంత్రివర్గంలో బొగ్గు శాఖా మంత్రిగా ఉన్నారు, ఈ సమయంలో ఢిల్లీ జిల్లా కోర్టు 1994లో జరిగిన తన వ్యక్తిగత కార్యదర్శి శశినాథ్ ఝా హత్య కేసులో సోరెన్‌ను దోషిగా నిర్ధారించింది.[4] గతంలో కూడా ఆయన మీద మరికొన్ని ఇతర నేరాభియోగాలు నమోదయ్యాయి.

జీవితం[మార్చు]

సోరెన్ రామ్‌గడ్ జిల్లాలోని నెమ్రా గ్రామంలో జన్మించారు, ఈ ప్రాంతం అప్పట్లో భారతదేశంలోని బీహార్ రాష్ట్రంలో భాగంగా ఉండేది. ఇదే జిల్లాలో ఆయన పాఠశాల విద్యని పూర్తి చేశారు. పాఠశాల విద్య తరువాత ఆయన వివాహం చేసుకొని, స్థానిక రైతు అయిన తండ్రితో కలిసి పనిచేశారు. ఆయనకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు- వారి పేర్లు దుర్గ, హేమంత్, బసంత్, కూతురి పేరు-అంజలి. దుర్గా సోరెన్ 2009 మే 22న బొకారోలో మరణించాడు. అప్పుడు అతని వయస్సు 39 సంవత్సరాలు.

సోరెన్ తన రాజకీయ జీవితాన్ని 1970వ దశకంలో ప్రారంభించారు, ఆ తరువాత వెంటనే ఒక గిరిజన నాయకుడిగా పేరుగాంచారు. 1975 జనవరి 23న జంతరా జిల్లాలోని చిరుదిహ్ గ్రామంలో గిరిజనేతరులుగా పరిగణించే "బయటి వ్యక్తుల"ను వెళ్లగొట్టే ఉద్దేశంతో సామూహిక హత్యాకాండను రెచ్చగొట్టారని ఆయన ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఈ మారణకాండలో పదకొండు మంది హత్యకు గురైయ్యారు. ఈ సంఘటనకు సంబంధించి సోరెన్‌తోపాటు, పలువురు ఇతరులపై వివిధ నేరాభియోగాలు నమోదయ్యాయి. సుదీర్ఘమైన న్యాయ విచారణల తరువాత సోరెన్ 2008 మార్చి 6న ఈ కేసులలో నిర్దోషిగా నిరూపించబడ్డారు.[5] ఇదిలా ఉంటే, ఈ సంఘటనకు (1974) ముందు జరిగిన రెండు హత్యలకు సంబంధించి ఆయనపై నమోదు చేసిన నేరాభియోగాలపై ఇప్పటికీ విచారణలు కొనసాగుతున్నాయి, ఈ కేసుల్లో ఆయన హత్యలకు ప్రేరేపించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.[6][7]

1977లో ఆయన మొదటిసారి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి పరాజయం పాలైయ్యారు. 1980 ఎన్నికల్లో మొదటిసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1986లో ఆయనపై ఒక అరెస్ట్ వారెంట్ జారీ అయింది. ఆయన తరువాత 1989, 1991, 1996 సంవత్సరాల్లో లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2002లో భారతీయ జనతా పార్టీ సహకారంతో రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఇదే ఏడాది జరిగిన ఉప ఎన్నికలో డుంకా లోక్‌సభ నియోజకవర్గంలో విజయం సాధించి తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. 2004లో ఆయన తిరిగి ఎన్నికయ్యారు.

మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో ఆయన కేంద్ర బొగ్గు శాఖా మంత్రిగా నియమించబడ్డారు, అయితే ముప్పై ఏళ్ల క్రితంనాటి చిరుదిహ్ కేసులో ఆయన పేరుపై అరెస్ట్ వారెంట్ జారీ కావడంతో మంత్రి పదవికి రాజీనామా చేశారు. వారెంట్ జారీ అయిన తరువాత ఆయన మొదట అజ్ఞాతంలోకి వెళ్లారు. 2004 జూలై 24న రాజీనామా చేశారు. జ్యుడిషియల్ కస్టడీలో నెల రోజులు గడిపిన తరువాత బెయిల్ పొందారు; సెప్టెంబరు 8న బెయిల్‌పై విడుదలయ్యారు, 2004 నవంబరు 27న కేంద్ర మంత్రివర్గంలో బొగ్గు శాఖను తిరిగి ఆయనకు ఇచ్చారు, ఫిబ్రవరి/మార్చి 2005లో జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్-JMM మధ్య కుదిరిన రాజకీయ భాగస్వామ్య ఒప్పందంలో భాగంగా ఆయనకు తిరిగి కేంద్ర మంత్రి బాధ్యతలు ఇచ్చారు.[2]

2005 మార్చి 2న పెద్దఎత్తున రాజకీయ బేరసారాలు మరియు లాలూచీలు సాగిన తరువాత గవర్నర్ సయద్ సిబ్టి రజీ ఆయనను జార్ఖండ్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఆహ్వానించారు. శాసనసభలో ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానంలో తన బలాన్ని నిరూపించుకోలేకపోవడంతో, బాధ్యతలు చేపట్టిన తొమ్మిది రోజుల తరువాత, మార్చి 11న ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.

యావజ్జీవ శిక్ష మరియు నిర్దోషిగా విడుదల[మార్చు]

2006 నవంబరు 28న సోరెన్ పన్నెండేళ్ల క్రితంనాటి తన మాజీ వ్యక్తిగత కార్యదర్శి శశినాథ్ ఝా అపహరణ మరియు హత్య కేసులో దోషిగా నిరూపించబడ్డాడు. ఝాను ఢిల్లీలోని దౌలా కౌన్ ప్రాంతం నుంచి 1994 మే 22న అపహరించి, రాంఛీకి సమీపంలోని పిస్కా నగరి గ్రామానికి తీసుకెళ్లి హత్య చేశారనేది ఈ కేసులో ఆరోపణ. జూలై 1993నాటి అవిశ్వాస తీర్మానం నుంచి నరసింహారావు ప్రభుత్వాన్ని కాపాడేందుకు కాంగ్రెస్ మరియు JMM మధ్య కుదిరిన ఒప్పందం మరియు ఒక అసహజమైన రతి క్రీడ గురించి ఝాకు తెలియడం అతని హత్య వెనుక కారణాలని CBI తమ నేరాభియోగ పత్రంలో పేర్కొంది. నేరాభియోగ పత్రంలో పేర్కొన్న స్థిరాభిప్రాయం ఏమిటంటే: "ఝాకి అక్రమ లావాదేవీలన్నింటి గురించి తెలుసు, అతను సోరెన్ నుంచి ఈ అక్రమ సంపాదనలో గణనీయమైన వాటాని ఆశించడం మరియు డిమాండ్ చేయడం జరిగి ఉండవచ్చు." [3]

ఈ కేసుకు సంబంధించి తీర్పు వెలువడిన నేపథ్యంలో, ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ పట్టుబట్టడంతో బొగ్గు శాఖ కేంద్ర మంత్రిగా ఆయన రాజీనామా చేశారు. భారతదేశ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా విధులు నిర్వహిస్తున్న వ్యక్తి ఒక హత్య కేసులో దోషిగా నిర్ధారించబడటం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. 2006 డిసెంబరు 5న శిబు సోరెన్‌కు జీవిత ఖైదు విధించారు. ఒక ఢిల్లీ కోర్టు ఆయన బెయిల్ కోసం చేసిన విజ్ఞప్తిని తిరస్కరించింది, ఈ సందర్భంగా కోర్టు ఈ విధంగా అభిప్రాయపడింది: పైకోర్టు అభ్యర్థన దాఖలు చేసిన కక్షిదారుకు (సోరెన్) నవంబరు 2006లో ఒక సమగ్ర మరియు విస్తృత విచారణ జరిగిన తరువాత డిసెంబరు 2006లో శిక్ష విధించారనే వాస్తవాన్ని మేము విస్మరించలేమని కోర్టు తీర్పు వెలువరించింది.

జార్ఖండ్‌లో ఒక సామూహిక హత్యాకాండ కేసుతోపాటు, అనేక ఇతర కేసుల్లో ఆయన విచారణలు ఎదుర్కొంటున్న విషయాన్ని కూడా ధర్మాసనం ప్రస్తావించింది. '[8]

2007 జూన్ 25న జార్ఖండ్‌లోని డుంకాలో సోరెన్‌ను జైలుకు తీసుకొస్తుండగా, ఆయన ప్రయాణిస్తున్న వాహన శ్రేణిపై బాంబులతో దాడి జరిగింది,[9] ఈ దాడిలో ఎవరూ గాయపడలేదు.

అయితే తరువాత న్యాయస్థానం నేరవిచారణ బృందం (సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్) తమ పని సరిగా చేయకుండా, బలహీనమైన సాక్ష్యాలను చూపిస్తున్నందుకు వారి తరపు న్యాయవాది ఆర్ఎం తివారీని తొలగించింది.[10]

ఢిల్లీ హైకోర్టు 2007 ఆగస్టు 23న జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేసి సోరెన్‌ను [4] నిర్దోషిగా విడుదల చేసింది, నేరారోపణలు ఎదుర్కొంటున్న నిందితులపై నేరవిచారణ యంత్రాంగం సంబంధిత అభియోగాలను నిరూపించడంలో విఫలమైందని హైకోర్టు తీర్పు వెలువరించింది. విచారణ కోర్టు యొక్క విశ్లేషణ ఆమోదయోగ్యతకు చాలా దూరంగా, పసలేనిదిగా ఉందని అభిప్రాయపడింది.

జార్ఖండ్‌లో కనిపెట్టిన ఒక మృతదేహం యొక్క శవపంచనామా నివేదిక అందించిన ఫోరెన్సిక్ సాక్ష్యాన్ని ఆధారంగా చేసుకొని నేరసంబంధిత కుట్ర, అపహరణ మరియు హత్య అభియోగాలపై తీస్ హజారీ కోర్టు ఐదుగురు వ్యక్తులను దోషులుగా పరిగణించింది, ఒక పుర్రె ఆధ్యారోహణ పరీక్ష మరియు పుర్రె గాయం నివేదికను ప్రాథమిక ఆధారంగా చేసుకొని న్యాయస్థానం వీరిని దోషులుగా నిర్ధారించడం జరిగింది. ఒక ప్రత్యక్ష సాక్షి కథనం, కొన్ని ప్రాసంగిక సాక్ష్యాలు వీరిపై నేరాభియోగాలకు అదనపు బలాలుగా ఉన్నాయి.[11] అయితే అస్థిపంజరం నుంచి సేకరించిన DNA ఝా యొక్క కుటుంబ సభ్యులతో కలవలేదు: కింది కోర్టు విచారణలో కేవలం సంభవనీయతను మాత్రమే తెలియజేసే ఆధ్యాహరణ పరీక్షలు పరిగణలోకి తీసుకొని, DNA పరీక్షను నిర్ణయాత్మక సాక్ష్యంగా పరిగణలోకి తీసుకోవచ్చనే వాస్తవాన్ని విస్మరించడం ఆశ్చర్యం కలిగిస్తుందని జిల్లా న్యాయస్థానం ఇచ్చిన తీర్పును కొట్టివేస్తూ, హైకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది,[ఆధారం కోరబడింది] అస్థిపంజరం ఝాకు సంబంధించినది కాదని నిర్ధారించింది, దీంతో కేసులో బలం ఒక ప్రాసంగిక సాక్ష్యానికి మాత్రమే పరిమితమైంది.

సూచనలు[మార్చు]

బాహ్య లింకులు[మార్చు]

! ఇండియా న్యూస్ స్టొరీ 2004 జూలై 24 న