Jump to content

సుకృతి అంబటి

వికీపీడియా నుండి
సుకృతి అంబటి
జననం (1993-07-05) 1993 జూలై 5 (వయసు 31)
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2014 – ప్రస్తుతం

సుకృతి అంబటి దక్షిణాది సినీనటి, ప్రచారకర్త. 2015లో తెలుగు లో వచ్చిన కేరింత[1] చిత్రం ద్వారా చిత్రరంగంలోకి అడుగుపెట్టింది.

జననం

[మార్చు]

సుకృతి, జూలై 5న ఢిల్లీ లో జన్మించింది. సుకృతి తండ్రి స్వగ్రామం నెల్లూరు జిల్లా, కావలి. ఆయన ఉద్యోరీత్యా (సివిల్ ఇంజనీర్) ఏళ్ల క్రితం ఢిల్లీలో స్థిరపడ్డారు.[2]

విద్యాభ్యాసం

[మార్చు]

ఢిల్లీ లోని కలుచిహన్స్ రాజ్ మోడల్ పాఠశాలలో పాఠశాల విద్యను పూర్తిచేసింది. రాజస్థాన్ లోని బనస్తలి విశ్వవిద్యాలయంలో ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్‌ లో డిగ్రీ చదివింది. చిన్నప్పటినుండి సుకృతికి డాన్స్ ఇష్టం. స్కూల్లో, కాలేజీలో ఎక్కడైనా డాన్స్ కాంపిటీషన్ జరిగినా పాల్గొనేది, నాటకాలలో నటించేది.[2]

సినీరంగ ప్రస్థానం

[మార్చు]

కురుక్షేత్ర విశ్వవిద్యాలయంలో జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాలకు వెళ్ళిన సుకృతికి ‘కేరింత’ 'జాంబి రెడ్డి' స్టార్ హంట్ తెలిసి, ఫొటోలు, నటించిన వీడియోలు పంపించగా... వాటిని చూసిన యూనిట్ వాళ్లు సుకృతిని భావన పాత్రకు ఎంపిక చేశారు. అలా కేరింత సినిమాలో నటించింది.

నటించిన సినిమాల జాబితా

[మార్చు]
Key
విడుదలకాని చిత్రాలు
సంవత్సరం చిత్రంపేరు భాష పాత్రపేరు Notes
2015 కేరింత[3] తెలుగు భావన
2016 (ఇంకా నిర్ణయించలేదు) † తెలుగు ప్రధాన పాత్రలో చిత్రీకరణ
2021 జాంబి రెడ్డి తెలుగు భావన

మూలాలు

[మార్చు]
  1. "Kerintha: Coming-of-age stories".
  2. 2.0 2.1 సాక్షి. "భావన గుర్తుంది కదూ!". Retrieved 11 May 2017.
  3. తెలుగు గ్రేట్ ఆంధ్ర. "సినిమా రివ్యూ: కేరింత". telugu.greatandhra.com. Retrieved 11 May 2017.