Jump to content

సుఖ్జిందర్ సింగ్ రంధావా

వికీపీడియా నుండి
సుఖ్జిందర్ సింగ్ రంధవా
సుఖ్జిందర్ సింగ్ రంధావా


రాజస్థాన్‌కు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
డిసెంబర్ 2022
ముందు అజయ్ మాకెన్

పదవీ కాలం
20 సెప్టెంబర్ 2021 – 16 మార్చి 2022
గవర్నరు బన్వరీలాల్ పురోహిత్
ముందు సుఖ్‌బీర్ సింగ్ బాదల్

పదవీ కాలం
మార్చి 2012 – 4 జూన్ 2024
ముందు నిర్మల్ సింగ్ కహ్లాన్
నియోజకవర్గం డేరా బాబా నానక్

ప్రస్తుత పదవిలో
అధికార కాలం
4 జూన్ 2024
ముందు సన్నీ డియోల్
నియోజకవర్గం గురుదాస్‌పూర్

వ్యక్తిగత వివరాలు

జననం (1959-02-01) 1959 ఫిబ్రవరి 1 (age 66)
ధరావాలి , పంజాబ్, భారతదేశం
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
నివాసం అవాఖా, గురుదాస్‌పూర్ , పంజాబ్, భారతదేశం

సుఖ్జిందర్ సింగ్ రంధావా (జననం 1 ఫిబ్రవరి 1959) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు.[1] ఆయన మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై పంజాబ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పని చేసి, 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో గురుదాస్‌పూర్ నియోజకవర్గం నుండి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[2]

జననం, విద్యాభాస్యం

[మార్చు]

సుఖ్‌జిందర్ సింగ్ రంధావా 1959 ఏప్రిల్ 25న గురుదాస్‌పూర్ జిల్లాలోని ధరోవాలి కుగ్రామంలో డేరా బాబా నానక్ తహసీల్‌లో సంతోఖ్ సింగ్ రంధావా, మంజిత్ కౌర్ దంపతులకు జన్మించాడు. ఆయన 1975లో చండీగఢ్‌లోని ప్రభుత్వ పాఠశాల నుండి పట్టభద్రుడయ్యాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

సుఖ్‌జిందర్ సింగ్ తన తండ్రి రెండుసార్లు పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పని చేసిన సంతోక్ సింగ్ రంధావా అడుగుజాడల్లో రాజకీయాలలోకి వచ్చి 2002లో జరిగిన శాసనసభ ఎన్నికలలో ఫతేఘర్ చురియన్ నుండి పంజాబ్ శాసనసభకు పోటీ చేసి అకాలీదళ్ అభ్యర్థి నిర్మల్ సింగ్ కహ్లాన్‌ను ఓడించి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 2007లో అకాలీదళ్ అభ్యర్థి నిర్మల్ సింగ్ కహ్లాన్‌ చేతిలో ఓడిపోయి తిరిగి 2012లో డేరా బాబా నానక్ శాసనసభ నియోజకవర్గం నుండి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

సుఖ్‌జిందర్ సింగ్ 2017లో జరిగిన ఎన్నికలలో డేరా బాబా నానక్ శాసనసభ నియోజకవర్గం నుండి మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై అమరీందర్ సింగ్ రెండవ మంత్రివర్గంలో 2018 ఏప్రిల్ 25 నుండి 2021 సెప్టెంబర్ 19 వరకు జైళ్లు & సహకార శాఖ మంత్రిగా & 2021 సెప్టెంబర్ 20 నుండి 2022 మార్చి 10 వరకు పంజాబ్ ఉప ముఖ్యమంత్రిగా పని చేశాడు. ఆయన 2022 శాసనసభ ఎన్నికలలో నాల్గొవసారి ఎమ్మెల్యేగా ఎన్నికై డిసెంబర్ 2022లో రాజస్థాన్ ఏఐసీసీ ఇన్‌చార్జ్‌గా నియమితుడయ్యాడు.

సుఖ్‌జిందర్ సింగ్ 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో గురుదాస్‌పూర్ నియోజకవర్గం నుండి ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి దినేష్ సింగ్‌పై 82,861 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[3][4][5][6]

మూలాలు

[మార్చు]
  1. "Sukhjinder Singh Randhawa" (in ఇంగ్లీష్). India Today. 2024. Archived from the original on 25 March 2025. Retrieved 25 March 2025.
  2. Election Commission of India (5 June 2024). "Punjab Loksabha Results 2024". Archived from the original on 9 September 2024. Retrieved 9 September 2024.
  3. "Inheritors | Next-gen netas" (in ఇంగ్లీష్). India Today. 13 July 2024. Archived from the original on 25 March 2025. Retrieved 25 March 2025.
  4. "Who is Sukhjinder Singh Randhawa, Punjab's Likely Chief Minister & Amarinder's Successor" (in ఇంగ్లీష్). News18. 19 September 2021. Retrieved 25 March 2025.
  5. "Gurdaspur Constituency Lok Sabha Election Result 2024" (in ఇంగ్లీష్). The Times of India. 4 June 2024. Archived from the original on 25 March 2025. Retrieved 25 March 2025.
  6. "2024 Loksabha Elections Results - Gurdaspur" (in ఇంగ్లీష్). Election Commission of India. 4 June 2024. Archived from the original on 25 March 2025. Retrieved 25 March 2025.