సుఖ్‌బీర్ సింగ్ బాదల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సుఖ్‌బీర్ సింగ్ బాదల్
సుఖ్‌బీర్ సింగ్ బాదల్


లోక్‌సభ సభ్యుడు
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
23 మే 2019
ముందు షేర్ సింగ్ గుబాయ
నియోజకవర్గం ఫిరోజ్‌పూర్
పదవీ కాలం
2004–2009
ముందు జాగ్ మీత్ సింగ్ బ్రార్
తరువాత పరంజిత్ కౌర్ గుల్షన్
నియోజకవర్గం ఫరీద్‌కోట్
పదవీ కాలం
1996–1999
ముందు జాగ్ మీత్ సింగ్ బ్రార్

రాజ్యసభ సభ్యుడు 2001 - 2004

తరువాత జాగ్ మీత్ సింగ్ బ్రార్
నియోజకవర్గం ఫరీద్‌కోట్

ఉప ముఖ్యమంత్రి
పదవీ కాలం
10 ఆగష్టు 2009 – 11 మార్చి 2017
ముందు రాజిందర్ కౌర్ భత్తల్
తరువాత *సుఖ్జిందర్ సింగ్ రంధావా
సెప్టెంబర్ 2021
  • ఓం ప్రకాష్ సోని
    సెప్టెంబర్ 2021
పదవీ కాలం
21 జనుఅరీ 2009 – 1 జులై 2009

పరిశ్రమల శాఖ మంత్రి
పదవీ కాలం
19 మార్చి 1998 – 12 అక్టోబర్ 1999
ముందు మురసోలి మారన్
తరువాత మురసోలి మారన్

ఎమ్మెల్యే
పదవీ కాలం
ఆగష్టు 2009 – మే 2019
ముందు షేర్ సింగ్ గుబాయ
తరువాత రమిందర్ సింగ్ ఆవాల
నియోజకవర్గం జలాలాబాద్

వ్యక్తిగత వివరాలు

జననం (1962-07-09) 1962 జూలై 9 (వయసు 61)
ఫరీద్ కోట్, పంజాబ్, భారతదేశం
రాజకీయ పార్టీ శిరోమణి అకాలీదళ్
జీవిత భాగస్వామి హర్‌సిమ్రత్ కౌర్ బాదల్
బంధువులు గురుదాస్ సింగ్ బాదల్ (బాబాయ్)
మాన్ ప్రీత్ సింగ్ బాదల్
సంతానం 3
నివాసం చండీగఢ్
వెబ్‌సైటు http://sukhbirsinghbadal.co.in

సుఖ్‌బీర్ సింగ్ బాదల్ భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ప్రస్తుతం శిరోమ‌ణి అకాలీద‌ళ్ అధ్య‌క్షుడిగా,[1] ఫిరోజ్‌పూర్ లోక్‌సభ సభ్యుడిగా ఉన్నాడు.

జననం, విద్యాభాస్యం[మార్చు]

సుఖ్‌బీర్ సింగ్ బాదల్ 1962 జూలై 9న ప్రకాశ్‌సింగ్‌ బాదల్, సురీందర్‌ కౌర్‌ బాదల్‌ దంపతులకు పంజాబ్ రాష్ట్రం, ఫరీద్‌కోట్లో జన్మించాడు. ఆయన చండీగఢ్‌ యూనివర్సిటీలో డిగ్రీ, అమెరికా లాస్‌ఏంజెలిస్‌లో ఎంబీఏ పూర్తి చేశాడు.

రాజకీయ జీవితం[మార్చు]

సుఖ్‌బీర్ సింగ్ బాదల్ తన తండ్రి అడుగుజాడల్లో రాజకీయాల్లోకి వచ్చి 1996లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఫరీద్‌కోట్ నియోజకవర్గం నుంచి శిరోమణి అకాలీదళ్ పార్టీ నుండి పోటీ చేసి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఆయన 1998లో రెండోసారి ఎంపీగా ఎన్నికై ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి మంత్రివర్గంలో పరిశ్రమల శాఖ సహాయ మంత్రిగా పని చేశాడు.

సుఖ్‌బీర్ సింగ్ బాదల్ 1999లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోయి, అనంతరం రాజ్యసభ సభ్యుడిగా 2001 నుంచి 2004 వరకు పని చేశాడు. ఆయన 2004లో మూడోసారి ఎంపీగా ఎన్నికై, 2008 జనవరిలో శిరోమణి అకాలీదళ్‌ (ఎస్‌ఏడీ) అధ్యక్షుడయ్యాడు. సుఖ్‌బీర్ సింగ్ బాదల్ 2009లో పంజాబ్ శాసనసభ ఎన్నికల్లో జలాలాబాద్ నియోజకవర్గం నుండి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై 2009 నుండి 2017 వరకు పంజాబ్‌ ఉప ముఖ్యమంత్రిగా పని చేశాడు.[2]

సుఖ్‌బీర్ సింగ్ బాదల్ 2019లో పంజాబ్‌ ఫిరోజ్‌పూర్‌ నుంచి పోటీ చేసి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికలయ్యాడు.  ఆయన 2022లో జరిగిన ఎన్నికల్లో  జలాలాబాద్ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఆప్‌ అభ్యర్థి జగ్‌దీప్ కాంబోజ్ చేతిలో ఓడిపోయాడు.

మూలాలు[మార్చు]

  1. "Sukhbir Badal becomes youngest president of Shiromani Akali Dal". Punjab Newsline. 31 January 2008. Archived from the original on 28 November 2010. Retrieved 10 December 2010.
  2. Sakshi (23 January 2022). "వ్యూహకర్త బాదల్‌". Archived from the original on 28 March 2023. Retrieved 28 March 2023.