సుఖ్‌దేయో భగత్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సుఖ్‌దేయో భగత్

అధ్యక్షుడు, జార్ఖండ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ[1]
పదవీ కాలం
మే 2013 – నవంబర్ 2017
తరువాత అజోయ్ కుమార్

ఎమ్మెల్యే
పదవీ కాలం
2014 – 2019
తరువాత రామేశ్వర్ ఒరాన్
నియోజకవర్గం లోహర్దగా

వ్యక్తిగత వివరాలు

జననం 22 అక్టోబర్ 1960
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
తల్లిదండ్రులు గంధర్వ భగత్, బుడియా భగత్
జీవిత భాగస్వామి అనుపమ భగత్
నివాసం నదియా హిందూ హైస్కూల్ వెనుక, లోహర్దగా, జార్ఖండ్

సుఖ్‌దేయో భగత్ (జననం 22 అక్టోబర్ 1960) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఒకసారి ఎమ్మెల్యేగా ఎన్నికై, 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో లోహర్దగా లోక్‌సభ నియోజకవర్గం నుండి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[2][3]

సుఖ్‌దేయో భగత్ మే 2013లో జార్ఖండ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమితుడయ్యాడు.[4]

రాజకీయ జీవితం

[మార్చు]

సుఖ్‌దేయో భగత్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాలలోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2015లో లోహర్దగా శాసనసభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి సాధ్ను భగత్ పై 6,780 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన ఆ తర్వాత 2009, 2014 ఎన్నికలలో ఓడిపోయి 2015లో లోహర్దగా శాసనసభ నియోజకవర్గంకు జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఏజెఎస్‌యూ అభ్యర్థి నిరు శాంతి భగత్ పై 23,288 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[5] ఆయన ఆ తరువాత బీజేపీ పార్టీలో చేరి 2019 జార్ఖండ్ శాసనసభ ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయి అనంతరం జనవరి 2022లో తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరాడు.

సుఖ్‌దేయో భగత్ 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో లోహర్దగా లోక్‌సభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ పార్టీ అభ్యర్థి సమీర్ ఒరాన్ పై 139138 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[6]

మూలాలు

[మార్చు]
  1. The Telegraph (14 May 2013). "New tribal face for state Congress". Archived from the original on 26 July 2024. Retrieved 26 July 2024.
  2. Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Lohardaga". Archived from the original on 26 July 2024. Retrieved 26 July 2024.
  3. India Today (13 July 2024). "Ex-administrators | From desk to dais" (in ఇంగ్లీష్). Archived from the original on 27 July 2024. Retrieved 27 July 2024.
  4. "Sukhdeo Bhagat appointed Jharkhand Congress president".
  5. The Economic Times (23 November 2015). "JPCC President Sukhdeo Bhagat to contest assembly by-poll from Lohardaga". Archived from the original on 26 July 2024. Retrieved 26 July 2024.
  6. TV9 Bharatvarsh (5 June 2024). "कांग्रेस के सुखदेव भगत लोहरदगा से 81 हजार से अधिक वोटों के अंतर से जीते, दिलचस्प है उनका सियासी सफर". Archived from the original on 26 July 2024. Retrieved 26 July 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)