సుదర్శన్ పట్నాయక్
సుదర్శన్ పట్నాయక్ | |
---|---|
జననం | |
వృత్తి | సైకత శిల్పి |
క్రియాశీల సంవత్సరాలు | 27 సంవత్సరముల నుండి |
ఆయన ఒక అద్భుత శిల్పి...శిలలను శిల్పాలుగా మార్చి గణతికెక్కిన ఎందరో శిల్పులకన్నా భిన్నంగా ఈయన సముద్రపు ఒడ్డును, ఇసుకను తన కళాత్మక ప్రతిభతో శిల్పాలుగా మార్చి...సందర్శకుల ప్రశంసలతో పాటు... భారత రాష్టప్రతి పురస్కారాన్ని కూడా అందుకున్న ప్రముఖ సైకత శిల్పి.....ప్రపంచ స్థాయి సైకత శిల్పాల ఛాంపియన్‌షిప్ పోటీల్లో భారత్ తరుపున ప్రాతినిధ్యం వహించిన ఘనత ఆయనకే దక్కింది... ఒక ప్రక్క దేశానికి కీర్తి ప్రతిష్ఠలు తెచ్చిపెట్టడంతో పాటు...సైకత శిల్పాల నిర్మాణంలో తనదైన ప్రత్యేక ముద్ర వేసుకున్న ఓ సృజనాత్మ కళాకారుడు
జీవిత విశేషాలు
[మార్చు]సుదర్శన్ పట్నాయిక్ (ఒరియా:ସୁଦର୍ଶନ ପଟ୍ଟନାୟକ) ; జననం. 1977, ఏప్రిల్ 15) ప్రఖ్యాత సైకత శిల్పి. పట్నాయక్ ఒడిషా రాష్ట్రం లోని భువనేశ్వర్కు 60 కి.మీ దూరంలో గల పూరీ పట్టణంలో జన్మించాడు. ఆయన భారతదేశం లోని ప్రఖ్యాత సైకత శిల్పి. ఈ విద్యను తన సృజనాత్మకత నుపయోగించి స్వయంగా నేర్చుకున్నాడు. తన 7 సంవత్సరాల వయస్సు నుంచే సైకత శిల్పాలను చేయుట ప్రారంభించాడు. అతడు కొన్ని వందల సైకత శిల్పాలను సృష్టించాడు. ప్రస్తుతం ప్రజలు ఈ సైకత శిల్ప కళకు ఆకర్షితులవుతున్నారు. పూరీ లోని గోల్డెన్ బీచ్ లో తన సైకత శిల్పాలను ప్రదర్శిస్తాడు.
అవార్డులు
[మార్చు]- ఆయన సృజనాత్మక సైకత శిల్పాలకు జాతీయ, అంతర్జాతీయ అవార్డులెన్నింటినో గెలుచుకున్నాడు. అతి పొడవైన "శాంతాకాస్" ఇసుకతో చేసి ప్రపంచ రికార్డును సాధించాడు.సుదర్శన్ పట్నాయక్ రష్యాలో జరిగిన మొదటి మాస్కో అంతర్జాతీయ సైకత శిల్ప పోటీలో పాల్గొని "పీపుల్స్ చాయిస్" బహుమతిని పొందారు.[1] ఆయన నేషనల్ అల్యూమినియం కంపెనీ (NALCO]) కు భారత దేశ ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు.[2]
- "అంతర్జాతీయ సైకత ఛాంపియన్‌షిప్"లో "ప్రపంచ కవోష్ణత" (global warming) ప్రమాదాల పై ప్రజలకు అవగాహన పెంచుటకు ఇసుకతో 15 అడుగుల గణేష్ సైకత శిల్పాన్ని తయారుచేశాడు. ఈ శిల్పాన్ని హిమాలయాలలోని గ్లేసియర్స్ కరిగి పోయి నీటి ప్రవాహం పెరిగిపోయి అందులో "గణేష్" ఒక ఓడలో ప్రయాణిస్తున్నట్లు సృష్టించాడు. ఇది గ్లోబల్ వార్మింగ్ ప్రభావాన్ని గూర్చి ప్రజలకు అర్థవంతంగా వివరించగలిగినది.
- సుదర్శన్ పట్నాయక్ ఉద్దేశం ప్రకారం అనేక సైకత శిల్పాలను సృజనాత్మకంగానే కాకుండా ఒక సందేశాన్ని ప్రజలకు అందించాలనేదే.ఆయన దేశంలో అనేక ప్రాంతాలకు పర్యటించి సైకత శిల్పాలపై వర్క్ షాప్ లను శిక్షణను ప్రజలకందించాడు.ఆయన "ది గోల్డెన్ సేండ్ ఆర్ట్ ఇనిస్టిట్యూట్"ను భారత దేశంలో మొదటిసారి నెలకొల్పాడు.
- పట్నాయక్ ప్రపంచ వ్యాప్తంగా 50 కి పైగా అంతర్జాతీయ సైకత శిల్ప చాంపియన్ షిప్ లలో పాల్గొని అనేక అవార్డులను పొందాడు.
- జూన్ 2012 లో ఆయన అంతర్జాతీయ సైకత శిల్ప చాంపియన్ షిప్ లో మొదటి బహుమతిని గెలుచుకున్నాడు.[3]
- అతని సైకత శిల్పాలలో "బ్లాక్ తాజ్ మహల్" అతనికి విశేష ఖ్యాతిని తెచ్చిపెట్టింది.
- జనవరి 2014 లో భారత ప్రభుత్వం చే "పద్మశ్రీ" అవార్డు పొందారు.
వివిధ పోటీల్లో
[మార్చు]పట్నాయక్ ఇప్పటి వరకూ భారత్ తరుపున అంతర్జాతీయస్థాయి పోటీల్లో 40 సార్లు పాల్గొన్నారు. పదిహేను ప్రథమ బహుమతులను గెలుచుకున్నారు. ’’ఆగస్టు 1న నిర్వహించిన ఎనిమిదవ అంతర్జాతీయ బెర్లింగ్ శాండ్ స్కల్‌ప్చర్ ఛాంపియన్ షిప్ పోటీల్లో ‘ఫిఫ్త్‌కాన్సిక్యూటివ్ విన్నర్’ అవార్డును గెలుచుకున్నాను.ఇది ప్రపంచ రికార్డు అని నిర్వాహకులు అభివర్ణించారు. ఆ తరువాత రాష్టప్రతి ప్రతిభా పాటిల్ చేతులమీదగా పురస్కార లేఖను అందించారు.’ అని పట్నాయక్ తెలిపారు. ‘ఈ ఏడాది ఆరంభంలో రాష్టప్రతి పూరి సందర్శించిన సందర్భంగా నన్ను వ్యక్తిగతంగా అభినందించారు. అని పట్నాయక్ అన్నారు. పట్నాయక్‌కు భార్య, ఒక పిల్లవాడు ఉన్నారు.లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్సు 2009లో ప్రకటించిన ఈ ఏటి మేటి వ్యక్తులలో అమితాబ్ బచ్చన్, సచిన్ టెండూల్కర్, లతామంగేష్కర్ వంటి ప్రముఖుల పేర్ల సరసన పట్నాయక్ పేరుకూడా చేరింది. అస్సాంలో ఆయనకు పెద్దఎత్తున అభిమానులున్నారు. బ్రహ్మపుత్రా నది ఒడ్డున ఒక సామాజిక అంశాన్ని ప్రతిబింబించేలా శిల్పాన్ని నిర్మించి ప్రపంచ రికార్డు సృష్ట్టిస్తానని ఆయన హమీ ఇచ్చారు. ఒడిషా, అస్సాం రాష్ట్రాలకు చెందిన విద్యార్ధుల ఉమ్మడి నిర్వహణలో ప్రపంచ రికార్డును నెల కొల్పనున్నట్లు ఆయన తెలిపారు.
అంతర్జాతీయ ప్రదర్శనలు
[మార్చు]- 1998 UNITED KINGDOM Exhibited during the world travel market held at Early Court, London in November 1998 with support of Govt. of India Tourist Office, London.
- 1999 UNITED KINGDOM Exhibited during the world cup Cricket 99 held at EDGBASTON
- 2000 FRANCE World Sand Sculpturing Championship.
- 2000 CHINA International Sand Sculpturing Championship.
- 2000 UNITED KINGDOM International Sand Sculpturing Festival at Glassgow.
- 2001 SINGAPORE Participated in Sentosa Sandstation 3 June 2001, "Splendours of Golden Asia"
- 2001 DENMARK International Sand Sculpture festival 2001 Blokhus on 25 June 2001.
- 2001 ITALY 3rd prize in world's master Sand Sculpturing championship.
- 2002 NETHERLANDS Singles International Sand Sculpturing competition at SCHEVENINGEN on 6 May 2002.
- 2002 JAPAN Champions medal in "29th International Snow Statue Contest 2002" at SAPPORO JAPAN.
- 2002 Belgium Sand Sculpture Festival BLANKENBERGE.
- 2002 NETHERLANDS The Dutch Sand Sculpture Festival Thorn 2002-03 at Holland in July.
- 2002 CHINA The First China Ningxia Sand Lake International Sand Sculpture event.
- 2003 CHINA The 3rd Luilang colour Sand Festival Demonstration Prize at china 2003.
- 2003 SPAIN 2nd Prize inInternational Sand Sculpture Championship at Valadoli, Spain.
- 2003 GERMANY 3rd Prize at Berlin International Sand Sculpture Championship.
- 2003 CHINA 4th Prize at China International Sand Sculpture competition.
- 2004 UAE Sand Sculpture Demonstration at Muscat Festival 2004 at Oman.
- 2004 GERMANY Participated at Sand World Festival at Travemunda.
- 2004 GERMANY Public Prize at 2nd Berlin Sand Station Competition.
- 2004 AUSTRALIA Participated at Sand Sculpting at Melbourne.
- 2005 USA Participated in Houston International Festival at Houston Texas. TAJMAHAL recreated in Sand.
- 2005 Germany 1st Prize at3rd Berlin International Sand Sculpture competition.
- 2006 CANADA Representing India on Tournament of World Championship of Sand Sculpture
- 2006 Doha Demonstrating on 15th Asian Game Doha, Qatar.
- 2007 JAPAN Represented India at 34th Sapporo Snow Sculpture Festival.
- 2007 UAE Demonstrating Sand Sculpture at International Student conference 2007 at Abu Dhabi.
- 2007 MALAYSIA Representing India in 1st International Sand Sculpture Festival.
- 2007 TURKEY Representing India at 1st Instansbul International Sand Sculpture Festival.
- 2007 Berlin 5th Public Prize at Berlin Representing India in 1st International Sand Sculpture Festival.
- 2007 RUHR 1st Audience prize at Representing India in 1st International Sand Sculpture Festival.
- 2008 JAPAN Represented India in Tottori Sand Museum.
- 2008 MOSCOW Won people choice prize at 1st International Sand Sculpture Festival.
- 2008 Berlin Won 1st Prize at USF World Championship 2008, Berlin. And got the title of world Champion.
- 2009 JAPAN Participated in World Sand Art Festival.
- 2009 MOSCOW Won Special Prize at world Sand Sculpture Championship 2009, by Russia Government.
- 2009 South Africa Won Korea Sand sculpture award 2009 at 4th Haeundae Sand Festival at Busan.
- 2009 Berlin Won People Choice prize at 2nd USF World Championship 2008, Berlin Germany.[4]
- 2011 Bhubaneswar Received the Odisha Living Legend Award from Orissadiary.com on Nov 11, 2011.[5]
- 2012 DENMARK International Sand Sculpture festival 2012 on August 2012.
- 2013 డెన్మార్క్లో నిర్వహించిన రెండవ కోపెన్ హగన్ అంతర్జాతీయ సైకత శిల్ప వేడుకల్లో అతడు 'గాండ్ ప్రైజ్' సాధించాడు. సోమవారం అతడీ పురస్కారం అందుకున్నాడు. 'చెట్లు పెంచండి, భూమిని కాపాడండి' అనే సందేశంతో అతడు రూపొందించిన 15 రంగుల సైకత కళారూపానికి ఈ అవార్డు దక్కింది. ఏడు రోజుల పాటు శ్రమించి అతడీ కళారూపం తయారు చేశాడు.
సూచికలు
[మార్చు]- ↑ Panda, Namita (31 May 2011). "Dream built of sand". The Telegraph. Kolkata, India. Archived from the original on 26 జూలై 2013.
- ↑ "Sudarsan Pattnaik becomes Nalco brand ambassador". Economic times. Bhubaneshwar, India. 20 May 2011. Archived from the original on 2016-03-05.
- ↑ "Odisha-based Sudarshan Pattnaik wins Copenhagen sand sculpture contest". IBN Live. India. 1 June 2012. Archived from the original on 28 ఆగస్టు 2012.
- ↑ ఆర్కైవ్ నకలు. Archived from the original on 2013-05-30. Retrieved 2013-05-22.
- ↑ ఆర్కైవ్ నకలు. Archived from the original on 2013-03-07. Retrieved 2013-05-22.
యితర లింకులు
[మార్చు]- Website Dedicated to Mr. Patnaik's work https://web.archive.org/web/20130330215651/http://www.sandindia.com/home.html
- An OrissaDiary Interview with Mr. Sudarsan Patnaik http://orissadiary.com/inerview/sudarsan-patnaik.asp Archived 2014-03-11 at the Wayback Machine
- International Sand Art by Sudarsan Patnaik (Puri District Website) https://web.archive.org/web/20130612072312/http://puri.nic.in/sandart1.htm
- Telegraph (UK) Sand sculptures by Sudarsan Pattnaik from India http://www.telegraph.co.uk/news/picturegalleries/howaboutthat/6309340/Sand-sculptures-by-Sudarsan-Pattnaik-from-India.html?image=6
- Sand Art Image of Gaddafi in Reuter Story http://in.reuters.com/article/2011/10/25/idINIndia-60118120111025 Archived 2013-07-04 at the Wayback Machine
- Sudarsan Pattnaik's sand sculpture on global warming wins Berlin contest http://www.deccanherald.com/content/85340/sudarsan-pattnaiks-sand-sculpture-global.html
- Youth projects ideas through sand art https://web.archive.org/web/20120109063327/http://www.telegraphindia.com/1110519/jsp/orissa/story_13997910.jsp
- Sand artist Patnaik yearns for government recognition http://www.thehindu.com/arts/crafts/article814449.ece
- http://atithisatkar.blogspot.com/2010/07/sudarshan-pattnaik.html Archived 2012-03-09 at the Wayback Machine
- Pattnaik creates sand sculpture to popularize Earth Hour (Sify News)
- Unique 'get well soon' wish for Big B (The Times of India)
- A sand sculpture of Amitabh Bachchan (apunkachoice.com)
- Sculptor builds his 38th Taj Mahal in Amsterdam (Sindh Today)[permanent dead link]