గోల్డెన్ బీచ్, పూరి
19°49′N 85°50′E / 19.81°N 85.83°E
ప్రదేశము | పూరి,ఒడిశా | |||||
---|---|---|---|---|---|---|
సముద్రతీరము | బంగాళాఖాతం | |||||
రకం | సహజమైన ఇసుక తీరం | |||||
ప్రభుత్వ విభాగం | ఒడిశా పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్-OTDC |
గోల్డెన్ బీచ్ భారతదేశంలోని ఒడిశా రాష్ట్రంలోని పూరి నగరంలో ఉన్న ఒక పర్యాటక సముద్ర తీరం (బీచ్). తూర్పు సరిహద్దుగా ఉన్న పూరి నగరం బంగారు బీచ్‌లకు ప్రసిద్ధి చెందింది. ఇది బంగాళాఖాతం సముద్రం ఒడ్డున ఉంది. దీనిని 'పూరి బీచ్' అని కూడా అంటారు. ఇది హిందూ పవిత్ర స్థలంగా ప్రసిద్ధి చెందిన పూరి లోనే ఒక పర్యాటక ఆకర్షణగా పరిగణిస్తారు. [1]
ఇది దేశంలోని సురక్షితమైన బీచ్‌లలో ఒకటిగా పరిగణించబడుతోంది. ఇక్కడ గురునానక్ పూరీ సందర్శన సమయంలో బస చేసిన బౌలిమాత వంటి చరిత్రలోని కొన్ని ముఖ్యమైన ఘట్టాల విశేషాలు పూరీ బీచ్‌లో ఉన్నాయి. సాయంత్రం పూట పిల్లలకోసం ఈ బీచ్‌లో ఒంటె సవారీ లేదా గుర్రపు స్వారీ వంటివి, ఇంకా ఇతర ఆటవస్తువులు ఉన్నాయి. బీచ్ లో సాయంత్రం పూట దుకాణాలు సావనీర్ నుండి అవసరమయే వస్తువుల వరకు లభిస్తాయి. ఒడిశా చేనేత వస్త్రాలను విక్రయించే అనేక దుకాణాలు కళాఖండాలతో పాటు బీచ్ లో రోడ్డు పక్కన ఉంటాయి. [2]
ఈ బీచ్ వార్షికంగా జరిగే పూరి బీచ్ ఫెస్టివల్ కు (సముద్రపు ఒడ్డున జరిగే ఉత్సవాలకు) నిలయం, ఇది భారత పర్యాటక మంత్రిత్వ శాఖ, పూరి నగరం, హస్తకళల అభివృద్ధి అధికారి, కోల్ కాతా లోని తూర్పు క్షేత్ర సాంస్కృతిక కేంద్రం సహకారంతో జరుగుతుంది. [3] ఈ బీచ్ లో అంతర్జాతీయ పురస్కారం గెలుచుకున్న సుదర్శన్ పట్నాయక్ స్థానిక ఇసుక కళా రూపాలతో సహా అనేక ఇతర స్థానిక ఇసుక కళల ప్రదర్శనలు నిర్వహిస్తారు.[4][5][6][7] పూరీలోని గోల్డెన్ బీచ్ కు 2020 అక్టోబర్ 11న ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ (ఎఫ్ఈఈ), డెన్మార్క్, ప్రతిష్టాత్మకమయిన 'బ్లూ ఫ్లాగ్' (Blue Flag) ట్యాగ్ ను ప్రదానం చేసింది.
-
పూరి బీచ్ ఉత్సవం
-
ఇసుక కళారూపం
-
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వీక్షిస్తున్న ఇసుక కళారూపం
రవాణా
[మార్చు]పూరి బీచ్ పూరి నగరంలో ఉంది. పూరి రైల్వే స్టేషన్ నుంచి ఈ సముద్రపు ఒడ్డు కేవలం 2 కి. మీ. దూరంలో ఉంది. సమీపంలో భువనేశ్వర్ విమానాశ్రయం 60 కి. మీ.ల దూరంలో ఉంది. స్థానిక రవాణా కోసం బస్సులు, టాక్సీలు అందుబాటులో ఉన్నాయి.
19°47'41.6400"N, 85°49'29.8920"E
సూచనలు
[మార్చు]- ↑ "Indian journal of marine sciences", Volume 15, 1986. publisher: Council of Scientific & Industrial Research (India), Indian National Science Academy
- ↑ "Puri Beach". Odisha Tourism. Retrieved 2024-10-22.
- ↑ "Puri Beach Festival,Beach Festival in Orissa,Beach Festival in Orissa India". Archived from the original on 3 March 2016. Retrieved 26 May 2010.
- ↑ "Section ONE". Archived from the original on 2010-08-28. Retrieved 2010-05-26.
- ↑ "Indian sand artist wins gold in Russia". 6 May 2010.
- ↑ "Sudarsan Pattnaik the Sand Artist from Orissa Wins Berlin Contest". Archived from the original on 2011-01-02. Retrieved 2010-05-26.
- ↑ "Orissa sand artist Sudarsan Patnaik's highest Sand-Taj Mahal placed in Limca book of World record, Odisha Current News, Odisha Latest Headlines". Archived from the original on 10 August 2016. Retrieved 26 May 2010.