సుధా రఘునాథన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పద్మభూషణ్

సుధా రఘునాథన్
సుధ రఘునాథన్, 2010లో చెన్నైలోని మ్యూజిక్ అకాడమీ వద్ద
2010లో చెన్నైలోని మ్యూజిక్ అకాడమీ వద్ద సుధా రఘునాధన్
జననం
చెన్నై
జాతీయతభారతదేశం
పౌరసత్వంభారతీయులు
విద్యఅర్థశాస్త్రంలో పోస్టు గ్రాడ్యుయేట్
విద్యాసంస్థఎతిరాజ్ కాలేజ్ ఆఫ్ ఉమెన్
వృత్తిగాయకురాలు, స్వరకర్త
జీవిత భాగస్వామిరఘునాథన్ (1982–ప్రస్తుతం)
పిల్లలు
 • Kaushik
 • Malavika
తల్లిదండ్రులు
 • వెంకట్రామన్
 • చూడామణి
పురస్కారాలుపద్మశ్రీ, సంగీత కళానిధి, కలామణి, పద్మ విభూషణ్
సంగీత ప్రస్థానం
సంగీత శైలిindian classical, carnatic

సుధా రఘునాథన్ భారతదేశానికి చెందిన కర్ణాటక గాయకురాలు, స్వరకర్త. ఆమెకు కలైమమణి పురస్కారాన్ని 1994 లో తమిళనాడు ప్రభుత్వం, పద్మశ్రీ (2004) [1] , పద్మ భూషణ్ (2015) [1] పురస్కారాలను భారత ప్రభుత్వం ప్రదానం చేసింది.

ప్రారంభ జీవితం, విద్య

[మార్చు]

సుధా రఘునాథన్ చెన్నైలో జన్మించింది. తరువాత బెంగళూరు, చెన్నైలలో నివసించింది.[2] ఆమె చెన్నైలోని గుడ్ షెపర్డ్ కాన్వెంట్‌లో పాఠశాల విద్యను అభ్యసించింది. ఆమె ఎతిరాజ్ కాలేజీలో చదువుకుంది. ఆర్థికశాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీని పొందింది.[3]

సంగీత వృత్తి

[మార్చు]

సుధ రఘునాథన్ తన తల్లి వి. చూడామణీ నుండి కర్ణాటక సంగీతంలో ప్రారంభ శిక్షణ పొందింది. మూడేళ్ల వయస్సు నుంచి ఆమె భజనలు, హిందూ భక్తి పాటలు నేర్చుకోవడం ప్రారంభించింది. బి.వి.లక్ష్మణ్ ఆధ్వర్యంలో ఆమె శిక్షణ కొనసాగింది. 1977 లో కర్ణాటక సంగీతాన్ని డాక్టర్ ఎం.ఎల్. వసంత కుమారి వద్ద అభ్యసించడానికి ఆమె భారత ప్రభుత్వ స్కాలర్‌షిప్‌ను అందుకుంది. ఆమె వద్ద 13 సంవత్సరాల పాటు విద్యార్థిగా కొనసాగింది.[4] గురుకుల శైలిలో డాక్టర్ ఎం.ఎల్. వసంతకుమారి ఆధ్వర్యంలో శిక్షణ పొందింది. గురువుగారి శైలి, విలక్షణతలను గ్రహించడానికి గణనీయమైన స్థాయిలో వినేది. ఆమె విధుల్లో భాగంగా గురువుగారి కచేరీలలో తంబురా వాయిస్తూ తోడుగా ఉండేది.[2][4][5]  

జనవరి 2015 నాటికి, అశోక మిత్రాన్ 2009 లో ప్రచురించిన ఒక నవల ఆధారంగా రాబోయే తమిళ చిత్రం 'తన్నీర్' తో సంగీత దర్శకురాలిగా కోలీవుడ్‌లోకి ప్రవేశించింది.[6]

ఆమె గురువు డాక్టర్ ఎంఎల్ వసంతకుమారి 1990లో మరణించింది. అప్పటి నుండి ప్రతి సంవత్సరం సుధా రఘునాథన్ మద్రాస్ మ్యూజిక్ సీజన్లో ప్రదర్శనలను ఇచ్చింది.[7] ఆమె భారతదేశపు ప్రముఖ కర్ణాటక ప్రదర్శనకారులలో ఒకరిగా పరిగణింపబడింది.[8] 2013 లో ఆమెకు మద్రాస్ మ్యూజిక్ అకాడమీ సంగిత కలానిధి పురస్కారం ప్రదానం చేసింది.[3] ఆమెకు జనవరి 2015 లో భారతదేశపు మూడవ అత్యున్నత పౌర గౌరవం అయిన పద్మ భూషణ్ లభించింది.

2 అక్టోబర్, 2016 న, ఐక్యరాజ్యసమితి భారతదేశ కర్ణాటక సంగీత కళాకారుడు భారత్ రత్న డాక్టర్ ఎంఎస్ సుబ్బలక్ష్మిని గౌరవించటానికి స్టాంప్‌ను విడుదల చేసింది. ఈ స్టాంప్‌ను 2 అక్టోబర్ 2016 న ఐక్యరాజ్యసమితిలో ఆమె ప్రదర్శనను గౌరవించటానికి సుధ రఘునాథన్‌కు అందజేశారు.[9]

కచేరీ ప్రదర్శనలు

[మార్చు]

రఘునాథన్ ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శనలిచ్చింది. ఇతర కళాకారుల సహకారంతో కూడా ప్రదర్శనలిచ్చింది. ఆమె ఐక్యరాజ్యసమితి,[10] పారిస్‌లోని థెట్రే డి లా విల్లే వద్ద ప్రదర్శనలను ఇచ్చింది. భారతీయ విద్యా భవన్‌కు 50 సంవత్సరాల జ్ఞాపకార్థం న్యూయార్క్ బ్రాడ్‌వేలోని లింకన్ సెంటర్‌లోని ఆలిస్ తుల్లీ హాల్‌లో సుధా ప్రదర్శన ఇచ్చింది. జర్మనీలోని లోరాచ్‌లో 'బర్గోఫ్' అకాడమీ ఆఫ్ మ్యూజిక్ అండ్ ఆర్ట్స్ నిర్వహించిన స్టిమెన్ వాయిసెస్ ఇంటర్నేషనల్ వోకల్ ఫెస్టివల్ నిర్మించిన గ్లోబల్ వోకల్ మీటింగ్‌లో పాల్గొన్న ఏకైక భారతీయ గాయకురాలు ఆమె.

ఇతర సంగీతం

[మార్చు]

రఘునాథన్ తమిళ సినిమాలో ప్లేబ్యాక్ సింగర్‌గా కూడా పనిచేసింది.[11] ఆమె ఇళయరాజా సంగీత సారధ్యంలోని సినిమా "ఇవాన్" లో "ఎన ఎన్న సెతాయ్" పాటకు నేపధ్యగాయకురాలిగా పనిచేసింది.  

బోధన

[మార్చు]

కర్ణాటక సంగీతకారులను అనుసరించి, సుధా రఘునాథన్ తన విద్యార్థులకు కూడా సంగీత సంప్రదాయాన్ని నేర్పించారు.[12] సుధా 2017 లో విజయదశమి రోజున తన సొంత పాఠశాల "సుధర్నవ అకాడమీ ఫర్ మ్యూజికల్ ఎక్సలెన్స్" ను ప్రారంభించింది. ఈ పాఠశాలలో సుధ రఘునాథన్ తో పాటు ఆమె విద్యార్థులలు కూడా అధ్యాపకులుగా ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా అనేక వేదికలలో ప్రదర్శనలు, వర్క్‌షాపులు నిర్వహించింది.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

సుధా రఘునాథన్ వివాహంచేసుకుంది. ఆమెకు కౌశిక్, మాలవికా అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.

ఆమె స్వచ్ఛంద సేవా కార్యక్రమాలలో పాల్గొనేది. 1999 లో సముదాయ ఫౌండేషన్‌ను ప్రారంభించింది. దానికి ఆమె వ్యవస్థాపకురాలు, మేనేజింగ్ ట్రస్టీ. పిల్లల ఆరోగ్య సంరక్షణ, గృహాలకు మౌలిక సదుపాయాలు, పిల్లలకు గుండె శస్త్రచికిత్సలు వంటి విభాగాలలో ఫౌండేషన్ స్వతంత్రంగా సహాయం చేసింది.[2] ఒరిస్సాలో గుజరాత్ భూకంపం, తుఫాను ఉపశమన బాధితుల కోసం ఈ ఫౌండేషన్ నిధులు సేకరించింది.[13]  

ఆల్బమ్స్

[మార్చు]
ఇయర్ సాంగ్ ఆల్బమ్ సంగీతం కో-సింగర్స్
2012 కొనియాడ తారమే [14] త్రహిమామ్ 2 ప్రణం కమలకర్ రూప రేవతి
సన్నుతింథుమో ప్రభు [14] త్రహిమామ్ 2 ప్రణం కమలకర్

పురస్కారాలు

[మార్చు]
పద్మశ్రీపురస్కారం

మూలాలు

[మార్చు]
 1. 1.0 1.1 ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; వెబ్ మూలము అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
 2. 2.0 2.1 2.2 Ranjani Govind (15 March 2013). "Holding the new wave". The Hindu. Retrieved 8 November 2013.
 3. 3.0 3.1 3.2 B. Kolappan (29 July 2013). "Sangita Kalanidhi for Sudha Ragunathan". The Hindu. Retrieved 8 November 2013.
 4. 4.0 4.1 Deepa Ganesh (13 September 2013). "In the flow of things". The Hindu. Retrieved 8 November 2013.
 5. Shobha Warrier (4 February 2011). "Wanted to be a doctor, became Carnatic star". Retrieved 8 November 2013.
 6. Sudha Raghunathan Debut as Music Director with film version of Ashoka Mitran's novel 'Thanneer'
 7. Ranjani Govind (22 December 2006). "For a song". The Hindu. Retrieved 8 November 2013.
 8. M. Balaganessin (18 March 2006). "A saga of magic". The Hindu. Retrieved 8 November 2013.
 9. http://indianexpress.com/article/india/india-news-india/united-nations-issues-stamp-to-honourcarnatic-music-artist-m-s-subbulakshmi-3062172/
 10. "Looking beyond the summit". The Hindu (in ఇంగ్లీష్). Retrieved 29 January 2017.
 11. Sreedhar Pillai (14 September 2007). "Shhh... He's back". The Hindu. Retrieved 8 November 2013.
 12. G. Swaminathan (31 August 2007). "In the footsteps of her guru". The Hindu. Retrieved 8 November 2013.
 13. Ranjani Govind (21 August 2007). "Sudha is doing her bit for society". The Hindu. Retrieved 8 November 2013.
 14. 14.0 14.1 https://itunes.apple.com/in/album/thrahimam-2/id650910155
 15. "Padma Awards" (PDF). 2015. Archived from the original (PDF) on 15 అక్టోబరు 2015. Retrieved 21 July 2015.


బాహ్య లింకులు

[మార్చు]