సుధీర్ నాయక్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Sudhir Naik
క్రికెట్ సమాచారం
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగు-
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డేలుs]]
మ్యాచ్‌లు 3 2
చేసిన పరుగులు 141 38
బ్యాటింగు సగటు 23.50 19.00
100లు/50లు -/1 -/-
అత్యధిక స్కోరు 77 20
వేసిన బంతులు - -
వికెట్లు - -
బౌలింగు సగటు - -
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు - -
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు - n/a
అత్యుత్తమ బౌలింగు - -
క్యాచ్‌లు/స్టంపింగులు -/- -/-
మూలం: [1], 2006 ఫిబ్రవరి 4

1945, ఫిబ్రవరి 21న ముంబాయిలో జన్మించిన సుధీర్ నాయక్ (Sudhir Naik) భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు. ఇతడు భారత క్రికెట్ జట్టు తరఫున 1974లో 3 టెస్టులు, 2 వన్డేలలో ప్రాతినిధ్యం వహించాడు. దేశవాళీ క్రికెట్‌లో ఇతడు కేవలం క్రికెటర్‌గానే కాకుండా కోచ్‌గా, గ్రౌండ్ క్యురేటర్‌గాను ప్రసిద్ధి చెందినాడు.

ముంబాయు విశ్వవిద్యాలయం తరఫున తొలిసారిగా క్రికెట్ ఆడినాడు. ఆ తరువాత టాటా ఆయిల్ మిల్లులో ఉద్యోగిగా పనిచేస్తూ ఆ జట్టుకు తరఫున కెప్టెన్‌గా వ్యవహరించాడు. కర్బన రసాయన శాస్త్రంలో ఎమ్మెస్సీ చేసి క్రికెటర్‌గా మారిన అరుదైన వారిలో ఇతడు ఒకడు. చాలా సంవత్సరాల పాటు రంజీ ట్రోఫిలో ముంబాయి జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఆ తరువాత ముంబాయిలోని నేషనల్ క్రికెట్ క్లబ్‌లో కోచ్‌గా సేవలందించాడు. జహీర్ ఖాన్, వసీం జాఫర్, రాజేశ్ పవార్ లాంటి క్రికెటర్లు రాటుదేలినది ఇతని శిక్షణలోనే. 2005 నుంచి వాంఖేడే స్టేడియం గ్రౌండ్ ఇంచార్జిగానూ సేవలందిస్తున్నాడు.

గణాంకాలు[మార్చు]

సుధీర్ 3 టెస్టులలో 23.50 సగటుతో 141 పరుగులు సాధించాడు. అతని అత్యధిక స్కోరు 77 పరుగులు. టెస్ట్ క్రికెట్‌లో ఇదే అతని ఏకైక అర్థసెంచరీ. వన్డేలలో 2 మ్యాచ్‌లు ఆడి 19.00 సగటుతో 38 పరుగులు సాధించాడు.

బయటి లింకులు[మార్చు]

క్రిక్‌ఇన్ఫో ప్రొఫైల్ - సుధీర్ నాయక్