సునంద నాయర్
కళాశ్రీ డా. సునంద నాయర్ | |
---|---|
జననం | ముంబై, భారతదేశం |
విద్య | ముంబయి విశ్వవిద్యాలయం (PhD) |
వృత్తి | వ్యవస్థాపకురాలు/దర్శకురాలు, సునంద పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ సెంటర్ |
Dances |
సునంద నాయర్ మోహినిఅట్టంలో శిక్షణ పొందిన భారతీయ నృత్యకారిణి. ఆమె ముంబై విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న నలంద నృత్య కళా మహావిద్యాలయం నుండి ఈ నృత్య రూపంలో మాస్టర్స్ డిగ్రీ చేసింది. ఆమె తన థీసిస్ "ఇంట్రిన్సిక్ లిరికల్ ఫెమినిజం ఇన్ మోహినియాట్టం" విషయంలో ముంబై విశ్వవిద్యాలయం నుండి పిహెచ్‌డి పూర్తి చేసింది.
2011లో కేరళ సంగీత నాటక అకాడమీ నుండి కళాశ్రీ అవార్డు అందుకున్న ఆమె ఎన్నో దేశవిదేశాలలో పలు పురస్కారాలు అందుకుంది.[1]
ప్రారంభ జీవితం
[మార్చు]ఆమె మహారాష్ట్రలోని ముంబైలో జన్మించింది.[2] ఆమె ఆరేళ్ల వయసులో భరతనాట్యంలో శిక్షణ మొదలుపెట్టింది. ఆమె కళామండలం కృష్ణంకుట్టి వారియర్ వద్ద కథాకళి అభ్యసించింది. ఆమె పద్మభూషణ్ డా. కనక్ రెలె శిష్యురాలు, ఈ శాస్త్రీయ కేరళ నృత్య శైలికి పునరుజ్జీవనం, ప్రాచుర్యం కల్పించిన ఘనత ఆమెకు దక్కింది.
విద్యాభ్యాసం
[మార్చు]మోహినియాట్టంలో మాస్టర్స్ డిగ్రీని పొందిన మొదటి విద్యార్థిగా ఆమె గుర్తింపుపొందింది. ఆమె ముంబై విశ్వవిద్యాలయంలోని నలంద నృత్య కళా మహావిద్యాలయంలో మాస్టర్స్ పూర్తి చేసింది. ఆమె ఏడేళ్ల కోర్సును ఐదేళ్లలో పూర్తి చేసింది.
ఆమె ముంబై విశ్వవిద్యాలయం నుండి వాణిజ్యశాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీ పట్టాపుచ్చుకుంది. అదే విశ్వవిద్యాలయం నుండి ఆమె పెర్ఫార్మింగ్ ఆర్ట్స్‌లో బ్యాచిలర్స్, అలాగే మాస్టర్స్ డిగ్రీని కూడా కలిగి ఉంది. అక్కడే ఆమె నృత్యంలో పి.హెచ్.డి చేసింది. మోహినిఅట్టంలో పరిశోధన చేసిన ఆమె "ది ఇంట్రిన్సిక్ లిరికల్ ఫెమినిజం ఇన్ మోహినియాట్టం" థీసిస్ రాసింది.
కెరీర్
[మార్చు]నలంద విద్యాలయంలో లెక్చరర్‌గా చేరిన ఆమె 1999 వరకు తొమ్మిదేళ్ల పాటు కొనసాగింది. ఆమె ఎన్నో ఇదే సమయంలో ఎన్నో ప్రదర్శనలు కూడా ఇచ్చింది.
ఆమె కళైమామణి కదిర్వేలు, కలైమామణి మహాలింగం పిళ్లై, గురు టి.వి.సౌందర్రాజన్, దీపక్ మజుందార్, తేజిస్విని రావు వంటి మాస్టర్స్ నుండి కట్టుమనార్ ముత్తుకుమార్ పిళ్లై బాణీలో అభ్యసించింది.
1980లో హైస్కూల్‌లో ఉండగానే ఆమె మోహినిఅట్టం, భరతనాట్యం రెండింటిలోనూ విద్యార్థులకు శిక్షణనిచ్చే శ్రుతిలయ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్‌ను ప్రారంభించింది.
ప్రస్తుతం ఆమె అమెరికాలో SPARC సంస్థను స్థాపించి భారతీయ శాస్త్రీయ నృత్యంలో శిక్షణను ఇచ్చి కొత్త నృత్యకారులను తయారుచేస్తోంది.
మూలాలు
[మార్చు]- ↑ "Kerala Sangeetha Nataka Akademi Award: Dance". Department of Cultural Affairs, Government of Kerala. Retrieved 26 February 2023.
- ↑ Srikanth, Rupa (2018-12-27). "Sunanda Nair shows the essence of the 'Nalanda Bani'". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2021-03-18.
- CS1 Indian English-language sources (en-in)
- ముంబై కళాకారులు
- మోహినియాట్టం ఘాతాంకాలు
- భారతీయ మహిళా శాస్త్రీయ నృత్యకారులు
- మహారాష్ట్ర నృత్యకారులు
- మహారాష్ట్ర మహిళా కళాకారులు
- భారతీయ నృత్యకారులు
- భారత శాస్త్రీయ నృత్య ప్రదర్శనకారులు
- ఇండియన్ క్లాసికల్ కొరియోగ్రాఫర్స్
- భారతీయ కళా అధ్యాపకులు
- భారత మహిళా కొరియోగ్రాఫర్లు
- భారతీయ నృత్య దర్శకులు
- మోహినియాట్టం
- భరతనాట్యం ఘాతాంకాలు
- కేరళ సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీతలు
- జీవిస్తున్న ప్రజలు