సునీల్ లహరి
సునీల్ లహ్రీ | |
---|---|
జననం | దామోహ్, మధ్యప్రదేశ్, భారతదేశం | 1961 జనవరి 9
జాతీయత | భారతీయుడు |
విద్యాసంస్థ | విల్సన్ కాలేజ్ ముంబై |
వృత్తి | నటుడు |
క్రియాశీల సంవత్సరాలు | 1980-1996 2017-ప్రస్తుతం |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | రామాయణం (1987 టీవీ సిరీస్) (1987)లో లక్ష్మణుడు పాత్ర |
జీవిత భాగస్వామి | రాధా సేన్ (divorced)భారతీ పాఠక్ |
పిల్లలు | 1, క్రిష్ (కుమారుడు) |
సునీల్ లహరి (జననం 1961 జనవరి 9), సునీల్ లహ్రీ అని కూడా పిలుస్తారు. భారతీయ నటుడు.[1] టెలివిజన్ షో రామాయణం (1987-1988)లో లక్ష్మణుడి పాత్రకు ప్రసిద్ధి చెందాడు.
వ్యక్తిగత జీవితం
[మార్చు]ఆయన మధ్యప్రదేశ్‌లోని దామోహ్‌లో 1961 జనవరి 9న మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్‌గా ఉన్న షికర్ చంద్ర లాహిరి, తారా లహ్రీ దంపతులకు జన్మించాడు.[2] ఆయనకి ఇద్దరు తమ్ముళ్లు. భోపాల్లో పాఠశాల విద్యను పూర్తి చేసిన ఆయన, ముంబైలోని విల్సన్ కళాశాల నుండి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీని పొందాడు.[3]
2012లో, తన తండ్రి మరణించాడు. తన తండ్రి కోరికమేరకు అతని శరీరాన్ని వైద్య విద్యార్థులకు వారి చదువులో సహాయం చేయడానికని మృతదేహాన్ని భోపాల్‌లోని జెకె మెడికల్ కాలేజీ ఫోరెన్సిక్స్ విభాగానికి విరాళంగా ఇచ్చాడు.
అతనికి క్రిష్ అనే కొడుకు ఉన్నాడు.[4] మళ్లీ రామాయణంలో నటించే అవకాశం వస్తే రావణుడి పాత్రలో నటిస్తానని దైనిక్ భాస్కర్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు.[5]
కెరీర్
[మార్చు]అతని తొలి చిత్రం ది నక్సలైట్స్ (1980), ఇందులో అతను స్మితా పాటిల్‌తో కలిసి నటించాడు. అతను 1985లో అనురాధ పటేల్‌తో కలిసి ఫిర్ ఆయీ బర్సాత్ చిత్రంలో కూడా నటించాడు.[6]
అతను 1991 సంగీత బహరోన్ కే మంజిల్‌లో ప్రధాన పాత్ర పోషించాడు.[7] అతను 1990 టీవి సిరీస్ పరమ వీర చక్రలో 2వ లెఫ్టినెంట్ రామ రఘోబా రాణే పాత్రను పోషించాడు. 1995లో, అతను జనం కుండ్లి చిత్రంలో చేసాడు. ఈ సినిమాలో వినోద్ ఖన్నా కొడుకు అశ్వనీ మెహ్రా పాత్రలో నటించాడు.[8] 2017లో, అతను ఎ డాటర్స్ టేల్ పంఖ్ అనే హిందీ చిత్రంలో కూడా నటించాడు.[9]
మూలాలు
[మార్చు]- ↑ Vohra, Meera (5 March 2012). "Sunil Lahiri donates fathers body". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 11 January 2021.
- ↑ "150 लड़कों में इन्हें मिला था लक्ष्मण का रोल, आज कहां है सुनील लहरी". Dainik Bhaskar (in హిందీ). 22 July 2018. Retrieved 8 March 2020.
- ↑ "दमोह का पम्मी 150 लड़कों को पछाड़कर बना था रामायण में लक्ष्मण". Dainik Bhaskar (in హిందీ). 2 April 2020. Retrieved 19 September 2020.
- ↑ "Netizens swoon over Sunil Lahri's son's handsomeness; a look at rare and unseen pics of the cast of Ramayan's family members". The Times of India (in ఇంగ్లీష్). 9 May 2020. Retrieved 11 October 2020.
- ↑ "दमोह का पम्मी 150 लड़कों को पछाड़कर बना था रामायण में लक्ष्मण". Dainik Bhaskar (in హిందీ). 2 April 2020. Retrieved 19 September 2020.
- ↑ Raghuvanshi, Aakanksha (28 April 2020). "Sunil Lahri And Anuradha Patel In A Rare Pic From 1985 Film Phir Aayee Barsat". NDTV. Retrieved 13 June 2023.
- ↑ "Baharon Ke Manzil Film details". IBOS. Archived from the original on 1 అక్టోబరు 2014. Retrieved 2 October 2014.
- ↑ "Ramayan's Laxman, Sunil Lahri reminisces the time he worked with Smita Patil, Vinod Khanna". Mumbai Mirror (in ఇంగ్లీష్). 24 April 2020. Retrieved 13 June 2023.
- ↑ "A look at what actors from DD's Ramayana serial are doing now". Hindustan Times. 5 April 2020. Retrieved 13 June 2023.