Jump to content

సుభాష్ గుప్తే

వికీపీడియా నుండి
సుభాష్ గుప్తే
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
సుభాష్ చంద్ర పండరినాథ్ గుప్తే
పుట్టిన తేదీ(1929-12-11)1929 డిసెంబరు 11
బొంబాయి, బొంబాయి ప్రెసిడెన్సీ
మరణించిన తేదీ2002 మే 31(2002-05-31) (వయసు 72)
పోర్ట్ ఆఫ్ స్పెయిన్, ట్రినిడాడ్ టొబాగో
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగులెగ్‌బ్రేక్ గూగ్లీ
బంధువులుబాలూ గుప్తే (సోదరుడు)
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 58)1951 డిసెంబరు 30 - ఇంగ్లాండు తో
చివరి టెస్టు1961 డిసెంబరు 13 - ఇంగ్లాండు తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1948/49–1958/59ముంబై క్రికెట్ జట్టు
1953/54–1957/58బెంగాల్
1954–1957రిష్టన్ క్రికెట్ క్లబ్
1958హేవుడ్ క్రికెట్ క్లబ్
1960–1961లాంకాస్టర్ క్రికెట్ క్లబ్
1960/61–1962/63రాజస్థాన్ క్రికెట్ క్లబ్
1963/64ట్రినిడాడ్
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్ట్ క్రికెట్ ఫస్ట్ క్లాస్ క్రికెట్
మ్యాచ్‌లు 36 115
చేసిన పరుగులు 183 761
బ్యాటింగు సగటు 6.31 8.18
100లు/50లు 0/0 0/0
అత్యధిక స్కోరు 21 47
వేసిన బంతులు 11,284 29,632
వికెట్లు 149 530
బౌలింగు సగటు 29.55 23.71
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 12 36
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 1 11
అత్యుత్తమ బౌలింగు 9/102 10/78
క్యాచ్‌లు/స్టంపింగులు 14/– 52/–
మూలం: ESPNcricinfo, 2017 మార్చి 16

సుభాశ్చంద్ర పండరినాథ్ "ఫెర్గీ" గుప్తే (1929 డిసెంబర్ 11 – 2002 మే 31) టెస్ట్ క్రికెట్‌లో అత్యుత్తమ స్పిన్ బౌలర్లలో ఒకడు. సర్ గ్యారీ సోబర్స్, EAS ప్రసన్న, జిమ్ లేకర్‌లు అతనిని అత్యుత్తమ లెగ్ స్పిన్నర్‌ అని ప్రకటించారు. [1] [2]

గుప్తే బంతిని ప్లైటు చేస్తూ, గిర్రున తిప్పేవాడు. అతను రెండు వేర్వేరు గూగ్లీలు వేసేవాడు. 1958/9లో భారత్‌లో పర్యటించిన వెస్ట్ ఇండియన్లు గుప్తే, బంతిని గ్లాస్‌పై కూడా తిప్పగలడని అనేవారు. అతని ఏకైక లోపం ఏమిటంటే, బ్యాట్స్‌మెన్ అతని బౌలింగ్‌పై దాడి చేసినప్పుడు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయే వాడు. దేశీయంగా గుప్తే బెంగాల్, బొంబాయి, రాజస్థాన్ తరపున, UKలోని రిష్టన్, హేవుడ్, లాంకాస్టర్ ల తరపున ఆడాడు. [3] 2000లో అతను సికె నాయుడు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును అందుకున్నాడు. ఇది మాజీ ఆటగాళ్ళకు బిసిసిఐ అందించే అత్యున్నత గౌరవం. [4]

కెరీర్

[మార్చు]

గుప్తే 1951–52లో కెరీర్‌ను మొదలుపెట్టి, తరువాతి సీజన్ నుండి వినూ మన్కడ్ నుండి భారతదేశపు ప్రముఖ స్పిన్నర్‌గా బాధ్యతలు స్వీకరించాడు. అతనికి వెస్ట్ ఇండియన్ లెగ్ స్పిన్నర్ విల్ఫ్రెడ్ ఫెర్గూసన్ పేరిట అతనికి ముద్దుపేరు పెట్టారు. 1952-53లో వెస్టిండీస్‌లో గుప్తే 27 వికెట్లు తీశాడు. 1958-59లో కాన్పూర్‌లో, అతను ఒక ఇన్నింగ్స్‌లో 102 పరుగులకు తొమ్మిది వెస్టిండీస్ వికెట్లు తీశాడు. ఆ మిగిలిన ఒక్క బ్యాట్స్‌మెన్ లాన్స్ గిబ్స్‌, గుప్తే బౌలింగులో ఇచ్చిన క్యాచ్‌ను వికెట్ కీపర్ నరేన్ తమ్హానే జారవిడిచాడు. 1954 డిసెంబరులో పాకిస్తాన్ కంబైన్డ్ సర్వీసెస్, బహవల్‌పూర్ XIకి వ్యతిరేకంగా బాంబే తరపున ఆడుతున్నప్పుడు, అతను ఒక ఇన్నింగ్స్‌లో మొత్తం పది వికెట్లు తీసి 10/78 అనే గణాంకాలను నమోదు చేశాడు. [5] [6] ఈ క్రమంలో ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో పది వికెట్లు తీసిన తొలి భారతీయుడిగా నిలిచాడు. [2]

అతను 1954-55లో విజయవంతమైన పాకిస్తాన్ పర్యటనలో ఐదు టెస్టుల సిరీస్‌లో 21 వికెట్లు తీశాడు. వెస్టిండీస్ 1958-59 భారత పర్యటనలో రెండో టెస్టులో రోహన్ కన్హాయిని అవుట్ చేయడంతో వినూ మన్కడ్ తర్వాత 100 టెస్ట్ వికెట్లు సాధించిన రెండో బౌలర్‌గా గుప్తే నిలిచాడు. న్యూజిలాండ్ 1955–56 భారత పర్యటనలో అతను నాలుగు టెస్టుల్లో 34 వికెట్లు తీశాడు. అతను తన చివరి టెస్ట్ సిరీస్‌ను 1960-61లో పాకిస్తాన్ భారత పర్యటనలో ఉండగా ఆడాడు, అతను మొదటి మూడు టెస్ట్‌లలో ఆడి ఎనిమిది వికెట్లు సాధించాడు.[2]


1955 ఆగస్టులో గుప్తే ఒకే ఇన్నింగ్స్‌లో పది వికెట్లు (10/101) రెండవ సారి సాధించాడు. టాడ్‌మోర్డెన్‌తో జరిగిన లాంకాషైర్ లీగ్ వోర్స్లీ కప్ ఫైనల్‌లో రిష్టన్ తరపున ఆడాడు. [7] 1956 జూన్‌లో లాంకషైర్ లీగ్‌లో అక్రింగ్టన్‌తో ఆడుతున్నప్పుడు, అతను ఒక ఇన్నింగ్స్‌లో 7.3 ఓవర్లలో 8/19తో రెండు హ్యాట్రిక్‌లు సాధించాడు. [8]

కెరీర్ ముగింపు వివాదం

[మార్చు]

గుప్తే అంతర్జాతీయ కెరీర్ 1961–62లో ఇంగ్లండ్ భారత పర్యటనలో వివాదాస్పద పరిస్థితుల్లో ముగిసింది. ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లాలో జరిగిన మూడో టెస్టులో, జట్టు ఇంపీరియల్ హోటల్‌లో బస చేసింది, అక్కడ గుప్తేను సహచరుడు AG కృపాల్ సింగ్‌తో పాటు రూమ్ నంబర్ 7లో ఉంచారు. ఆ సమయంలో, హోటల్‌లోని రిసెప్షనిస్ట్ తన షిఫ్ట్ పూర్తయిన తర్వాత ఆ గదిలోని తనను పిలిచారని ఆరోపిస్తూ ఇండియా టీమ్ మేనేజర్‌కి ఫిర్యాదు చేసింది. ఈ ఆటగాళ్ళిద్దరూ అమె ఆరోపణను ఖండించారు. అప్పటికి పెళ్ళైన గుప్తే, సింగ్ ఆమెకు ఫోన్ చేసి డ్రింక్స్ తీసుకురావాలని మాత్రమే అడిగాడని వివరించాడు. [9]

అధికారులు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని టీమ్ నుంచి ఆ ఇద్దరినీ సస్పెండ్ చేసారు. ఆ సమయంలో BCCI ప్రెసిడెంట్ అయిన MA చిదంబరం తనకు వాగ్దానం చేసినట్లుగా నాలుగో టెస్టు వేదిక అయిన కలకత్తాలో విచారణ జరపలేదని గుప్తే తర్వాత గుర్తు చేసుకున్నాడు. కరీబియన్ పర్యటనకు జట్టును ఎంపిక చేసేందుకు సెలెక్టర్లు, BCCI సమావేశమైన మద్రాసులో చివరికి విచారణ జరిగింది. సింగ్‌ను కాల్ చేయకుండా ఆపలేదని BCCI కార్యదర్శి AN ఘోష్ గుప్తేను మందలించాడు. దానికి అతను ఇలా సమాధానమిచ్చాడు, "అతను పెద్ద మనిషి. నేను అతనిని ఎలా ఆపగలను?" ఆటగాళ్ళిద్దరినీ తదుపరి పర్యటన కోసం ఎంపిక చెయ్యలేదు. ఆ తరువాత గుప్తే, మళ్లీ భారతదేశం తరపున ఆడలేదు. [10] గుప్తే 36-మ్యాచ్‌ల టెస్ట్ కెరీర్ 29.55 సగటుతో 149 వికెట్లతో ముగిసింది. [9]

1981/82లో షార్జాలో గుప్తే కోసం ఒక బెనిఫిట్ మ్యాచ్ జరిగింది. 2002లో, అతను తాను బౌలింగ్ చేసిన "అత్యంత క్లిష్టమైన బ్యాట్స్‌మన్" ఆస్ట్రేలియాకు చెందిన నీల్ హార్వే అని పేర్కొన్నాడు. [11]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

గుప్తే సోదరుడు బాలూ కూడా భారతదేశం తరపున ఆడిన లెగ్ స్పిన్నరు.

గుప్తే 1952–53లో కరీబియన్‌లో టూర్‌లో ఉండగా ఒక అధికారిక కార్యక్రమంలో కరోల్‌ను కలిశాడు. ఆ టూరులో అతను 50 ఫస్ట్-క్లాస్ వికెట్లు సాధించాడు.[12] వారు 1950ల చివరలో వివాహం చేసుకున్నారు. ఆ తరువాత అతను ట్రినిడాడ్‌ తరలి వెళ్లాడు. అక్కడ అతను 1964లో క్రికెటర్‌గా తన కెరీర్‌ను ముగించాడు. వారికి అనిల్ అనే కుమారుడు,[13] కరోలిన్ అనే కుమార్తె ఉన్నారు.[9][14]

మూలాలు

[మార్చు]
  1. "Sobers says recent Australian teams aren't the best". ESPNcricinfo (in ఇంగ్లీష్). 27 February 2006. Retrieved 24 July 2018.
  2. 2.0 2.1 2.2 Chughtai, Arshad. "Sobers prefers Gupte over Warne". Archived from the original on 1 August 2013. Retrieved 24 July 2018.
  3. "Obituary: Subhash Gupte". The Telegraph. 20 June 2002. Retrieved 24 July 2018.
  4. "C.K. Nayudu award for Kapil Dev". The Hindu (in Indian English). 2013-12-18. ISSN 0971-751X. Retrieved 2023-04-25.
  5. "Which Indian batsman made hundreds in five successive Tests this century?". ESPN Cricinfo. Retrieved 19 November 2020.
  6. "Bombay v Pakistan Combined Services and Bahawalpur XI". CricketArchive. Archived from the original on 12 October 2013. Retrieved 24 July 2018.
  7. "Todmorden v Rishton, Lancashire League Worsley Cup 1955 (Final)". CricketArchive. Archived from the original on 2 November 2013. Retrieved 25 July 2018.
  8. "Hat-trick Twice in Innings". The Gleaner. Reuters. 25 May 1956. p. 12. Retrieved 24 July 2018.
  9. 9.0 9.1 9.2 Williamson, Martin (28 March 2009). "Dropped over a drink". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 24 July 2018.
  10. Wadhwaney, K. R. (2002). Indian Cricket Controversies (in ఇంగ్లీష్). Diamond Pocket Books (P) Ltd. pp. 150–152. ISBN 9788128801136. Retrieved 24 July 2018.
  11. "Gupte: Kumble's experience should have been utilised". ESPNcricinfo (in ఇంగ్లీష్). 28 April 2002. Retrieved 24 July 2018.
  12. Bhattacharya, Rahul (10 August 2013). "Love letters". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 24 July 2018.
  13. "An Indian cricket star's Trini love story - Trinidad Guardian".
  14. "Subhash Gupte is no more". The Hindu. 1 June 2002. Archived from the original on 2 December 2014. Retrieved 24 July 2018.