Jump to content

సుమన్ శర్మ

వికీపీడియా నుండి
సుమన్ శర్మ
}
Aviation career
Known forమొట్టమొదట మిగ్-35 యుద్ధవిమానాన్ని నడిపిన మహిళ

సుమన్ శర్మ యుద్ధవిమానాలను కూడా అలవోకగా నడిపించగలిగే భారతదేశ మహిళ. ఈమె F-16IN సూపర్ వైపర్, మిగ్-35 యుద్ధవిమానాలను మొట్టమొదట నడిపించె మొదటి మహిళగా చరిత్రపుటల్లోకెక్కారు. ఆమె 2009 జనవరిలో జరిగిన వైమానిక ప్రదర్శనలో ఎఫ్-16, మిగ్-35 లో కో-పైలెట్గా వ్యవహరించారు.[1][2][3]

జీవిత విశేషాలు

[మార్చు]

సుమన్ తండ్రి స్వగ్రామం ఉత్తర ప్రదేశ్ లోని చిన్నపల్లె. ఈమె సైన్యం, ప్రసార మాధ్యమాల సంబంధాల మీద పి.హె.డి చేశారు. ఈమె తండ్రి కెప్టెన్ ఎం.వి.శర్మ. నౌకాదళ ఉన్నతాధకారిగా విశాఖపట్నం పనిచేస్తున్నప్పుడు ఈమె జన్మించారు. కేంద్రీయ విద్యాలయంలో చదువు పూర్తి చేసిన తర్వాత సైన్స్ పట్టభద్రురాలైనది. ఆంగ్ల సాహిత్యంలో ఎం.ఎ చేసి9 ఎం.ఫిల్ పూర్తి చేశారు. 2009 లో సైన్యం, ప్రసార మాధ్యమాల సంబంధాల మీద గాఢాధ్యయనం, పరిశోధన ప్రారంభించారు. పి.హె.డి సాధించారు.

విజ్ఞాన శాస్త్ర పట్టభద్రురాలవుతున్న కాలంలోనే ఈమె ఉపాధ్యాయురాలిగా పనిచేశారు. ఈమె ఇండియన్ మిలిటరీ అకాడమీలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నప్పుడు పైలట్ శిక్షణపట్ల ఆసక్తి కలిగింది. 2006, మార్చిలో బెంగళూరు లోని వాయుసేన ఆస్పత్రిలో అవసరమిన పరీక్షలన్నీ చేయించుకున్నారు. 2008 లో అమెరికా ఎఫ్-16 కర్మాగారాన్ని పరిశీలించారు. అరగంట పాటు దాని సిములేటర్ లో కూర్చున్నారు. అన్నీ విజయవంతంగా ముగిసిన అనంతరం యుద్ధ విమానాన్ని నడపగలననే విశ్వాసాన్ని ఆమె పొందారు. 2009 జనవరిలో జరిగిన వైమానిక ప్రదర్శనలో ఎఫ్-16, మిగ్-35 లో కో-పైలట్ గా వ్యవహరించారు.

మహిళలు హెలీకాఫ్టర్లకే పరిమితం కాదనీ వరు యుద్ధవిమానాలను నడపగలరనే విశ్వాసాన్ని అందిపుచ్చుకున్న సుమన్ శర్మ గారు కో-పైలట్ గా రెండు యుద్ధ విమానాల నియంత్రన వ్యవస్థలను చేపట్టారు. రణరంగంలో భయంకరమైన యుద్ధవిమానాలు ఎఫ్-16, మిగ్-35 లో వాయువిహారం చేసిన తొలి భారతీయురాలిగా చరిత్రకెక్కారు. మిగ్-35 లో అయితే ప్రపంచంలోనే తొలివనితగా రికార్డు సృష్టించారు. 2008, జనవరిలో ఢిల్లీ నుంచి షికాగో వరకూ బోయింగ్ విమానాన్ని ఎక్కడా ఆపకుండా 15 గంటలు నడిపిన ఘనత సుమన్ గారిదే.

మూలాలు

[మార్చు]

ఇతర లింకులు

[మార్చు]