Jump to content

సుమ్‌దొరాంగ్ చు ప్రతిష్ఠంభన

అక్షాంశ రేఖాంశాలు: 27°46′54″N 91°46′53″E / 27.7818°N 91.7813°E / 27.7818; 91.7813
వికీపీడియా నుండి
సుమ్‌దొరాంగ్ చు ప్రతిష్ఠంభన
తేదీ1986–1987
ప్రదేశంSumdorong Chu Valley, McMahon Line (Indo-Tibetan border)
27°46′54″N 91°46′53″E / 27.7818°N 91.7813°E / 27.7818; 91.7813
ఫలితంStandoff ended with status quo maintained
Indian prime minister invited to Beijing
ప్రత్యర్థులు
India China
సేనాపతులు, నాయకులు
President R. Venkataraman
Prime Minister Rajiv Gandhi
General Krishnaswamy Sundarji
చైనా General Secretary Zhao Ziyang
చైనా Chairman Deng Xiaoping
చైనా Premier Li Peng
చైనా President Li Xiannian
సుమ్‌దొరాంగ్ చు ప్రతిష్ఠంభన is located in Arunachal Pradesh
సుమ్‌దొరాంగ్ చు ప్రతిష్ఠంభన
Location within India Arunachal Pradesh#Tibet
సుమ్‌దొరాంగ్ చు ప్రతిష్ఠంభన is located in Tibet
సుమ్‌దొరాంగ్ చు ప్రతిష్ఠంభన
సుమ్‌దొరాంగ్ చు ప్రతిష్ఠంభన (Tibet)

1986-87లో, అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ జిల్లాకూ, టిబెట్ లోని కోనా కౌంటీకీ మధ్య సరిహద్దులో ఉన్న సుమ్‌దొరాంగ్ చు లోయలో భారత, చైనాల మధ్య సైనిక ప్రతిష్ఠంభన ఏర్పడింది. భారత భూభాగమైన సమ్డోరాంగ్ చుకు దక్షిణాన ఉన్న వాంగ్డంగ్ పచ్చిక బయళ్ల లోకి చైనా ఒక సైనిక దళాన్ని తరలించడంతో ఇది మొదలైంది. భారత దళాలు పొరుగున ఉన్న లాంగ్రో లా శిఖరంపై పాతుకుపోయాయి. రెండు వైపులా పెద్ద సంఖ్యలో దళాలను సరిహద్దుకు తరలించాయి. 1987 మేలో భారత విదేశాంగ మంత్రి బీజింగ్ సందర్శించిన తరువాత ఈ సంక్షోభం ముగిసింది. 1962 యుద్ధం తరువాత వివాదాస్పదమైన మెక్‌మహాన్ రేఖ వెంట జరిగిన తొలి సైనిక ఘర్షణ ఇది. ఇది ముదురుతుందేమోననే భయాలను కలిగించింది. తదనంతరం, భారత చైనాలు భవిష్యత్తులో వచ్చే సరిహద్దు ఉద్రిక్తతలను నిర్వహించడానికి ఒప్పందాలను రూపొందించుకున్నాయి.[1][2]

నేపథ్యం

[మార్చు]

తూర్పు-పడమరగా ప్రవహించే నమ్కా చు వాగు వద్ద 1962 లో తనకు ఎదురైన పెద్ద ఓటమి తరువాత, భారతదేశం అక్కడికి తిరిగి రాలేదు. ఉత్తరాన థాగ్ లా శిఖరాన్ని, దక్షిణాన హతుంగ్ లా శిఖరాన్ని వేరు చేస్తూ ఈ వాగు ప్రవహిస్తుంది. థాగ్ లా శిఖరాన్ని ఆక్రమించడానికి భారతదేశం చేసిన ప్రయత్నాలే 1962 అక్టోబరులో భారతదేశంపై చైనా సైనిక దాడికి యుద్ధకారణ (కాసస్ బెల్లి) మైంది.

తవాంగ్‌కు ఉత్తరాన రక్షణాత్మక ప్రదేశాలేమీ లేనందున, మళ్ళీ యుద్ధమంటూ వస్తే, తవాంగ్ పట్టణాన్ని విడిచిపెట్టి, దక్షిణాన సెలా కనుమ వద్ద యుద్ధానికి సిద్ధమవ్వాలని భారత ప్రభుత్వం దాదాపుగా నిర్ణయించింది. అయితే, 1980 లో చేసిన సమీక్ష తరువాత, భవిష్యత్తు సంఘర్షణల్లో తవాంగ్‌ను రక్షించుకోవడం చాలా ముఖ్యమని సైనిక వ్యూహకర్తలు నిర్ణయించారు.[3] తవాంగ్‌కు రక్షణ కల్పించే ఏకైక మార్గం హతుంగ్ లా శిఖరాలేనని సైన్యం స్పష్టం చేసింది.

1983 లో, ఇంటెలిజెన్స్ బ్యూరో బృందం నమ్కా చు, న్యామ్జియాంగ్ చు నదుల సంగమ స్థలానికి ఈశాన్యంగా ఉన్న సుమ్డోరాంగ్ చు పచ్చిక బయళ్ళకు వెళ్ళింది. ఇంటెలిజెన్స్ బృందం వేసవి అంతా అక్కడే ఉండి శీతాకాలంలో తిరిగి వచ్చింది. ఇలా రెండేళ్ళు చేసారు. 1986 లో, చైనా బృందం తమకంటే ముందే అక్కడికి చేరుకుందని, అక్కడ అర్థ శాశ్వత నిర్మాణాలను ఏర్పాటు చేసిందని భారత బృందం కనుగొంది. వాళ్ళు వెనక్కి తగ్గడానికి ఇష్టపడ్డంలేదని కూడా వారికి అర్థమైంది.[4]

జనరల్ సుందర్జీ ఆదేశాల మేరకు, ఆపరేషన్ ఫాల్కన్ అనే సంకేతనామం కింద భారత్, 1986 అక్టోబర్ 18 నుండి 20 వరకు జెమితాంగ్‌కు దళాలు, వాహనాలను విమానాల ద్వారా చేరవేసారు. హతుంగ్ లా రిడ్జ్‌తో సహా పలు ఎత్తైన ప్రదేశాలపై చేరుకున్నాయి. భారత దళాలు సుమ్డోరాంగ్ చు సమీపంలో ఎత్తైన ప్రదేశాలను వ్యూహాత్మకంగా ఆక్రమించాయి. దీని తరువాత ఇరువర్గాలు మరింతగా దళాలను సమీకరించాయి. నవంబరు 15 న చైనా జెండా సమావేశానికి పిలుపునిచ్చింది. 1987 మే వరకు ఈ ప్రతిష్టంభన కొనసాగింది.[4]

రాజకీయ సందర్భం

[మార్చు]

1986 చివరిలో, అరుణాచల్ ప్రదేశ్‌కు భారతదేశం రాష్ట్ర హోదా ఇచ్చింది. దీనిపై చైనా ప్రభుత్వం నిరసన వ్యక్తం చేసింది. ఈ రాజకీయ చర్యతో పాటు, తవాంగ్‌లో సైనిక కదలికలు కూడా చూసి చైనా రెచ్చిపోయింది. 1987 ప్రారంభంలో బీజింగ్ స్వరం మారింది. 1962 లో లాగా ధ్వనించింది. భారత సైన్యం తగ్గకపోవడంతో, పాశ్చాత్య దౌత్యవేత్తలు యుద్ధం రావచ్చని ఊహించారు.

చివరికి ఇరుపక్షాలూ మెత్తబడ్డాయి. భారత విదేశాంగ మంత్రి ఎన్‌డి తివారీ 1987 మేలో ఉత్తర కొరియాలోని ప్యాంగ్యాంగ్‌కు వెళ్తూ మార్గమధ్యంలో బీజింగ్ వెళ్ళాడు. పరిస్థితిని తీవ్రతరం చేసే ఉద్దేశమేదీ న్యూఢిల్లీకి లేదనే సందేశాలను తీసుకువెళ్లాడు. వాంగ్డంగ్ వ్యవహారం తరువాత, 1987 ఆగస్టు ఐదవ తేదీన, 1962 తరువాత మొదటి అధికారిక జెండా సమావేశం బమ్ లాలో జరిగింది. [5] పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని చర్చలు జరపాలని ఇరుపక్షాలూ నిర్ణయించాయి. మరుసటి సంవత్సరం, రాజీవ్ గాంధీ బీజింగ్ పర్యటించాడు..ఝౌఎన్‌లై 60 ల్లో చేసిన భారత పర్యటనకు బదులు పర్యటన ఇది. [6]

అనంతర పరిణామాలు

[మార్చు]

భారత, చైనాలు రెండూ రాగల ముప్పును గ్రహించాయి. తొలుత చేసిన రెచ్చగొట్టే చర్యల తరువాత, వారి మోహరింపులను తగ్గించాలని నిర్ణయం తీసుకున్నాయి. 1962 యుద్ధం తరువాత నిద్రాణంగా ఉన్న సంభాషణను తిరిగి ప్రారంభించడం ఈ ప్రతిష్ఠంభన వలన కలిగిన ప్రతిఫలం. రాజీవ్ గాంధీ 1988 పర్యటన తరువాత, భారతదేశంలో రాజకీయ గందరగోళం కారణంగా ఒక రకమైన విరామం ఏర్పడింది. చివరకు 1993 లో, LAC వెంట శాంతని నెలకొల్పడానికి ఇరుదేశాలూ ఒక ఒప్పందంపై సంతకం చేశాయి.

ఈ ఒప్పందం "పరస్పర, సమాన భద్రత" అనే ఆసక్తికరమైన భావనను తీసుకువచ్చింది. ఇక్కడ భౌగోళిక, రవాణా పరిగణనల కారణంగా బలగాలను తగ్గించుకుంటారని ఆశించారు. అయితే, పరస్పరం ఆమోదయోగ్యమైన వాస్తవాధీన రేఖను రూపొందించడం దీనిలో అత్యంత ముఖ్యమైన అంశం. ప్రస్తుతానికి, వాస్తవాధీన రేఖపై ఎవరి వాదనలు వారికి ఉన్నాయి. వీటి వలన కొన్ని ప్రదేశాలు వివాదాస్పద మయ్యాయి. సిక్కిం-భూటాన్-ఇండియా ట్రైజంక్షను, సుమ్‌దొరాంగ్ చు ప్రాంతం మొదలైనవి వీటిలో ముఖ్యమైనవి..

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Lintner, China's India War (2018).
  2. Pardesi, Managing the Sumdorong Chu Crisis (2020).
  3. Line of Actual Control remains sore point between India and China ("LAC: Chequered Past", printed along with "George in China Shop"), India Today, 18 May 1998.
  4. 4.0 4.1 Joshi, Manoj (3 July 2017). "Operation Falcon: When General Sundarji took the Chinese by surprise". ORF (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-10-10.{{cite web}}: CS1 maint: url-status (link)
  5. "Sikkim standoff: India should be ready for long haul as impasse may go beyond Wangdung incident". Archived from the original on 10 July 2017.
  6. Manoj Joshi, "Warrior as a Scholar", "India Today ".