సురభి పాపాబాయి

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
సురభి పాపాబాయి
Surabhi papabai.JPG
సురభి పాపాబాయి
జననం సురభి పాపాబాయి
1869
కోలార్
మరణం 1933
ఇతర పేర్లు సురభి పాపాబాయి

తొలి తెలుగు రంగస్థల నటి సురభి పాపాబాయి. ఈవిడ 1869 వ సంవత్సరంలో, కోలార్లో జన్మించారు. 1887వ సంవత్సరంలో సురభి గ్రామంలో మొదటిసారిగా సురభివారు ప్రదర్శించిన ‘కీచకవధ’ అను నాటకంలో సైరంధ్రిగా స్త్రీ పాత్రను స్త్రీయే నటించిన ఖ్యాతి గడించిన ప్రప్రథమ తెలుగు రంగస్థల నటీమణి. ఆనాడు స్త్రీ పాత్రయేగాక పురుషపాత్రలు కూడా ధరించిన మొదటి నటి పాపాబాయి. 1911లో మొట్టమొదటి తెలుగు గ్రామఫోన్ రికార్డు యిచ్చిన మొదటి గాయని. ఈమె సంగీత విద్వాంసురాలు. నృత్య ప్రతిభాశాలి. యీ అపురూపనటి 1933వ సంవత్సరంలో స్వర్గస్తులైనారు.

నటీమణిగా[మార్చు]

కీచకవధ, స్త్రీ సాహసం, జయంతజయపాల, శకుంతల, రామాంజనేయ యుద్ధం, జగక్మోహిని, సారంగధర, రుక్మాంగద, హరిశ్చంద్ర, లంకాదహనం మొదలగు ఎన్నో నాటకములలో స్త్రీ పాత్రలు, పురుష పాత్రలు ధరించారు.

ఇతరాలు[మార్చు]

మూలాలు[మార్చు]

సురభి పాపాబాయి, కళాదీపికలు (సమకాలీన రంగస్థల నటీమణులు), ప్రథమ ముద్రణ, సంపాదకులు: వి.ఎస్. రాఘవాచారి., కళాదీపిక మాసపత్రిక, తిరుపతి, అక్టోబరు 2011, పుట. 3.