Jump to content

సుస్మితా దేవ్

వికీపీడియా నుండి
సుస్మితా దేవ్

రాజ్యసభ సభ్యురాలు
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
4 అక్టోబర్ 2021
ముందు మానస్ భూనియా
నియోజకవర్గం పశ్చిమ బెంగాల్

లోక్‌సభ సభ్యురాలు
పదవీ కాలం
16 మే 2014 – 23 మే 2019
ముందు కాబింద్రా పూరకాయస్థ
తరువాత రాజదీప్ రాయ్
నియోజకవర్గం సిల్చార్, అస్సాం

ఎమ్మెల్యే
పదవీ కాలం
మే 2011 – 16 మే 2014
ముందు భీతిక దేవ్
తరువాత దిలీప్ కుమార్ పాల్
నియోజకవర్గం సిల్చార్

పదవీ కాలం
9 సెప్టెంబర్ 2017 – 16 ఆగష్టు 2021[1]
ముందు శోభా ఓజ

వ్యక్తిగత వివరాలు

జననం (1972-09-25) 1972 సెప్టెంబరు 25 (వయసు 52)
సిల్చార్, అస్సాం, భారతదేశం
రాజకీయ పార్టీ తృణమూల్ కాంగ్రెస్‌(since 2021)[2]
ఇతర రాజకీయ పార్టీలు కాంగ్రెస్ (2021 వరకు)
నివాసం సిల్చార్
పూర్వ విద్యార్థి ఢిల్లీ యూనివర్సిటీ (బీఏ, ఎల్‌ఎల్‌బీ)
కింగ్స్ కాలేజీ, లండన్ (ఎల్‌ఎల్‌ఎం)
వృత్తి రాజకీయ నాయకురాలు

సుస్మితా దేవ్ భారతదేశానికి చెందిన రాజకీయ నాయకురాలు.[3] ఆమె 2014లో అస్సాం రాష్ట్రంలోని సిల్చార్ నుండి లోక్‌సభ సభ్యురాలిగా ఎన్నికై ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ నుండి తృణమూల్ కాంగ్రెస్‌ నుండి రాజ్యసభ సభ్యురాలిగా ప్రాతినిధ్యం వహిస్తుంది.[4][5]

రాజకీయ జీవితం

[మార్చు]

సుస్మితా దేవ్ తన తల్లితండ్రుల అడుగుజాడల్లో కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చింది. ఆమె తండ్రి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి సంతోష్ మోహన్ దేవ్, ఆమె తల్లి బితికా దేవ్, అస్సాం అసెంబ్లీకి చెందిన సిల్చార్ శాసనసభ్యురాలు. సుస్మితా దేవ్ 2011లో తొలిసారి సిల్చార్ అసెంబ్లీ స్థానం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికైంది. ఆమె 2014లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో అస్సాంలోని సిల్చార్ నుండి లోక్‌సభకు తొలిసారి ఎంపీగా ఎన్నికైంది. ఆమె 2019లో జరిగిన ఎన్నికల్లో ఓడిపోయింది.

సుస్మితా దేవ్ 2017 నుండి 2021 వరకు అఖిల భారత మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా పని చేసి 2021 ఆగస్ట్ 16న కాంగ్రెస్ పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేసి[6] తృణమూల్ కాంగ్రెస్‌ లో చేరింది.[7] ఆమె 4 అక్టోబర్ 2021న తృణమూల్ కాంగ్రెస్‌ తరపున రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నికై, కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన బాల్య వివాహ నిషేధ చట్టం–2006కు బిల్లును పరిశీలించే స్టాండింగ్‌ కమిటీ (స్థాయీ సంఘం)లో సభ్యురాలిగా నియమితురాలైంది.[8]

మూలాలు

[మార్చు]
  1. "Sushmita Dev, Who Backed CAA, Quits Cong; Kapil Sibal Says 'Party Moves on with Eyes Wide Open'". News18. 16 August 2021. Retrieved 13 May 2022.
  2. "Sushmita Dev joins Trinamool Congress, day after leaving Congress". The Economic Times. 16 August 2021. Retrieved 17 August 2021.
  3. "Sushmita Dev". 2019. Archived from the original on 24 October 2022. Retrieved 24 October 2022.
  4. "West Bengal: TMC's Sushmita Dev elected unopposed to Rajya Sabha". 27 September 2021. Archived from the original on 24 October 2022. Retrieved 24 October 2022.
  5. The Hindu (11 February 2024). "Trinamool names Sagarika Ghose, Sushmita Dev, and two others for Rajya Sabha" (in Indian English). Archived from the original on 11 February 2024. Retrieved 11 February 2024.
  6. "కాంగ్రెస్ కి బిగ్ షాక్.. కీలక నేత రాజీనామా". 16 August 2021. Archived from the original on 24 October 2022. Retrieved 24 October 2022.
  7. "టీఎంసీ గూటికి కాంగ్రెస్‌ మాజీ ఎంపీ సుస్మితా దేవ్‌". 16 August 2021. Archived from the original on 24 October 2022. Retrieved 24 October 2022.
  8. Sakshi (3 January 2022). "ఆమె ఒక్కరే!". Archived from the original on 24 October 2022. Retrieved 24 October 2022.