సూపర్ పోలీస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సూపర్ పోలీస్
(1994 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.మురళీమోహన్ రావు
నిర్మాణం డి. సురేష్
కథ వి.సి. గుహనాథన్
తారాగణం వెంకటేష్,
నగ్మా
సంగీతం ఏ.ఆర్.రెహమాన్
నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్
భాష తెలుగు

కె. మురళి మోహన్ రావు దర్శకత్వంలో సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై డి. సురేష్ బాబు నిర్మించిన 1994 నాటి యాక్షన్ చిత్రం సూపర్ పోలీస్ . ఎఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ చిత్రంలో వెంకటేష్, నగ్మా, సౌందర్య ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాను అదే పేరుతో తమిళంలోకి అనువదించారు. దీనిని 1997 లో ఖేల్ ఖిలాడి కా అని హిందీలోకి అనువదించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్‌గా నమోదైం. [1]

విజయ్ ( వెంకటేష్ ) నిజాయితీగల పోలీసు ఇన్స్పెక్టర్. అతని గత ప్రేయసి భారతి ( సౌందర్య ) అనే జర్నలిస్టు రోడ్డు ప్రమాదంలో మరణిస్తుంది. ఆ రోజు నుండి, అతను తాగుబోతు అయ్యాడు. విజయ్ ఒక జర్నలిస్ట్ రేణుక ( జయసుధ ) ఇంటికి అద్దెకు వస్తాడు, ఆమె తన భర్త ఎస్.పి.ప్రకాష్ ( అహుతి ప్రసాద్ ) నుండి, అతడి అనైతిక ప్రవర్తన కారణంగా,విడాకులు తీసుకుని,, ఆమె ముగ్గురు పిల్లలతో నివసిస్తూంటుంది. విజయ్ రేణుక కుటుంబానికి దగ్గరగా వచ్చి ఆమె పిల్లలతో అనుబంధాన్ని పెంచుకుంటాడు.

అబ్బన్న ( కోట శ్రీనివాసరావు ) సమాజంలో పెద్ద మనిషి. అతను నటుడే కాని త్వరలోనే తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శకుడు అవుతాడు. అయితే, అతని సినిమాల్లో చాలా హింస ఉంటుంది. దీనిపై ఒక నిర్మాత కోపగించి, అతన్ని దర్శకత్వం నుండి తొలగిస్తాడు. అతను ఒక గొప్ప వ్యక్తి అని అందరూ అనుకుంటారు, కాని అతను నిజంగా పెద్ద స్మగ్లరూ, గ్యాంగ్ స్టరు. ఉగ్రవాదులతో చాటుమాటు సంబంధాలున్నాయి. హోంమంత్రి ( చలపతి రావు ), ప్రకాష్ కూడా వారి అనుచరులే. రోజా ( నగ్మా ) అనే చిన్న దొంగ విజయ్ తో ప్రేమలో పడుతుంది.

విజయ్ అబ్బన్నను, అతని ముఠానూ ఎప్పుడూ ఎదుర్కొంటూంటాడు. అతడి కుమార్తెకు ఆమె ప్రేమికుడితో అబ్బన్న అనుమతి లేకుండా పెళ్ళి చేస్తాడు. ఈ కారణంగా అబ్బన్న విజయ్‌పై శత్రుత్వాన్ని పెంచుకుంటాడు. ఇంతలో, విజయ్ రేణుక సహాయంతో అబ్బన్నపైన, అతని ముఠాపైనా రుజువులను సేకరిస్తాడు. దాంతో అబ్బన్న విజయ్ ను చంపడానికి ప్రణాళిక వేస్తాడు. విజయ్ ఇంట్లో అబ్బన్న బాంబు పెడతాడు, కాని దురదృష్టవశాత్తు ఆ బాంబు పేలుడులో రేణుక మరణిస్తుంది. దానికి కోపించిన విజయ్, అబ్బన్న పైన, అతడి ముఠాపైనా దాడి చేస్తాడు. అది అతని సస్పెన్షన్‌కు దారితీస్తుంది. అదే సమయంలో, ప్రకాష్ తన ముగ్గురు పిల్లలను వారి ఇంటి నుండి బయటకు గెంటేస్తాడు. విజయ్ వారిని దత్తత తీసుకుంటాడు. అకస్మాత్తుగా, అబ్బన్న ముఠా విజయ్ పై దాడి చేసి, అతన్ని చాలా ఘోరంగా కొడతారు. అతను ఆసుపత్రిలో చేరతాడు. రోజా విజయ్‌ని, పిల్లలనూ చూసుకుంటుంది. అతను కూడా ఆమెను ప్రేమించడం ప్రారంభిస్తాడు.

త్వరగా కోలుకున్న తరువాత, విజయ్ వికలాంగుడైన ఇబ్రహీం (శివ కృష్ణ) ను కలుస్తాడు. అతను అబ్బన్నపై కాల్పులు జరుపుతాడు. అబ్బన్న మనుషులు ఇబ్రహీంను ఎదుర్కొన్నప్పుడు, విజయ్ వాళ్ళకు అడ్డుగా నిలబడతాడు. విజయ్ అబ్బన్న పట్ల తనకు ఉన్న శత్రుత్వం గురించి ఇబ్రహీంను అడుగుతాడు. అప్పుడు ఇబ్రహీం గతాన్ని వెల్లడిస్తాడు. రెండు సంవత్సరాల క్రితం, అతను అబ్బన్న కర్మాగారంలో కాపలాదారు. ఒక రోజు, అతను ఉగ్రవాదులతో అబ్బన్న రహస్య కార్యకలాపాలను గమనించి పోలీసులకూ, పత్రికలకూ సమాచారం ఇస్తాడు. ఇంతలో, అబ్బన్న ఇబ్రహీం కుటుంబాన్ని చంపి అతన్ని వికలాంగుడుగా చేస్తాడు. యాదృచ్ఛికంగా, భారతి అక్కడికి చేరుకుని మొత్తం ఎపిసోడ్‌ను వీడియోలో కవర్ చేస్తుంది. వారు ఆమెను వెంబడించి చంపుతారు. అది ప్రమాదవశాత్తు జరిగిన మరణంగా చిత్రిస్తారు. భారతి ప్రమాదంలో మరణించలేదని విజయ్‌కు అప్పుడు అర్థమౌతుంది. ఆమె వీడియో క్యాసెట్‌ను రహస్యంగా దాచిపెట్టిందని కూడా తెలుసుకుంటాడు. క్యాసెట్ సంపాదించడంలో విజయ్ విజయం సాధిస్తాడు. అబ్బన్న ఈ విషయం తెలుసుకుని, పిల్లలను కిడ్నాప్ చేస్తాడు. వీడియో క్యాసెట్ కోసం విజయ్ ను బ్లాక్ మెయిల్ చేస్తాడు. చివరగా, విజయ్ పిల్లలను రక్షిస్తాడు. విలన్లను పోలీసులకు అప్పగిస్తాడు, ఉద్యోగాన్ని తిరిగి పొందుతాడు. రోజాను పెళ్ళి చేసుకుంటాడు.

తారాగణం

[మార్చు]

పాటలు

[మార్చు]
సం.పాటపాట రచయితగాయనీ గాఉఅకులుపాట నిడివి
1."సూపర్ పోలీస్"వేటూరి సుందరరామమూర్తిసురేష్ పీటర్స్, అనుపమ, స్వర్ణలత5:40
2."బాబూ లవ్ చెయ్యరా"వేటూరి సుందరరామమూర్తిఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర5:07
3."తేలు కుట్టిన తెనాలిలో"వేటూరి సుందరరామమూర్తిమనో, సుజాత4:48
4."పక్కా జెంటిల్మన్ని"వేటూరి సుందరరామమూర్తిఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి5:31
5."ముక్కాంబే ముక్కాంబే"సాహితిమనో, కె.ఎస్.చిత్ర4:27
మొత్తం నిడివి:25:50

మూలాలు

[మార్చు]
  1. "Success and centers list — Venkatesh". idlebrain.com. Retrieved 16 December 2012.