సూర్యదేవర రామమోహనరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సూర్యదేవర రామ్ మోహన్ రావు
జననం1942
మున్నలూరు గ్రామం, కంచికచర్ల మండలం, కృష్ణా జిల్లా, ఆంధ్ర ప్రదేశ్
క్రియాశీల సంవత్సరాలు1985 - ప్రస్తుతం
జీవిత భాగస్వామిపద్మజా రాణి
పిల్లలుకాళి అనంత్, తేజస్వి అనంత్
తల్లిదండ్రులు
 • అనంతయ్య (తండ్రి)
 • వెంకట నరసాంబ (తల్లి)

సూర్యదేవర రామ్ మోహన్ రావు ఒక ప్రముఖ తెలుగు రచయిత. తెలుగు కన్నడ భాషల్లో నవలా రచనలో సుప్రసిద్ధుడు. ఈయన రాసిన నవలలు స్వాతి లాంటి ప్రముఖ పత్రికల్లో ప్రచురించబడ్డాయి.

ఈయన కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం మున్నలూరు గ్రామంలో 1942లో అనంతయ్య, వెంకట నరసాంబ దంపతులకు రామమోహనరావు 6 వ సంతానంగా జన్మించారు.

1985 నుండి సుమారు 95 నవలలు వ్రాశారు. ఈయన నవలలు దిన, వార, మాస పత్రికల్లో సీరియళ్ళుగా ప్రచురితమవుతున్నాయి. తెలుగు సాహిత్యంలో రామ్మోహనరావు అత్యధికంగా నవలలు వ్రాసి చరిత్ర సృష్టించారు. ఈయన వ్రాసిన 200 చిన్నపాటి కథలు కన్నడ, తమిళంలో అనువాదమయ్యాయి. కొన్ని నవలలు సినిమాలుగా, టి.వి సీరియళ్ళుగా చేయబడ్డాయి.

ఈయన వ్రాసిన నవల ముక్తేశ్వరి పునరాగమనం తెలుగు నవలా ప్రపంచంలో రికార్డుకెక్కింది. ప్రతి నవలకు ప్రత్యేకమైన బ్యాక్ గ్రౌండ్స్ సృష్టించడం రామమోహనరావు ప్రత్యేకత. 2002లో 60 వ పుట్టిన రోజున మైసూరులో శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారి చేతులమీదుగా దత్తపీఠం ఆస్థాన విద్యాన్ పురస్కారాన్ని అందుకున్నారు. 1996 లో కళాభారతి వారి బెస్ట్ రైటర్ ఆఫ్ ది ఈయర్ అవార్డును భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడైన వెంకయ్య నాయుడు చేతుల మీదుగా గెల్చుకున్నారు. రామమోహనరావుకు సతీమణి పద్మజ రాణి, ఇద్దరు కుమారులు - కాళి అనంత్, తేజస్వి అనంత్ ఉన్నారు.

నవలలు

[మార్చు]

రచయిత నవలలు అత్యధికం వ్యాపారం, సైన్స్ పిక్షన్, అత్మలు, పునర్జన్మలు, అతీంద్రియ శక్తుల మీద రాయబడినవి. వాటిలో కొన్ని

 • రెండోసారి కూడా నిన్నే ప్రేమిస్తా
 • వశీకరణ యజ్ఞం
 • మృత్యుంజయుడు
 • త్రికాల యజ్ఞం
 • మాయ
 • మనీ మనీ మనీ
 • దేవుడు వర్సెస్ మానవుడు
 • మాయసభ
 • మోహిత
 • ముక్తేశ్వరి పునరాగమనం
 • మోడల్
 • అహో !విక్రమార్క
 • క్రిమినల్స్
 • అక్షర యజ్ఞం
 • వ్యూహం
 • క్రాస్ రోడ్స్
 • ఆత్మా గమనం
 • ప్రేమ, ఆకర్షణ, మోహం
 • ది బ్యూటీ
 • అంతర్యుద్ధం
 • సాహసమే ఆమె ఊపిరి
 • పరిచయం
 • మూడో మనిషి
 • ప్రేమకు పెట్టుబడి కావాలి
 • నన్ను ప్రేమించిన అపరిచితుడు
 • ఫలాక్షుడు
 • చిక్కలేదు చిన్నదాని ఆచూకీ
 • ఆమె అతడు ఆమె
 • పెళ్ళి కొడుకు లేచిపోయాడు
 • అపూర్వ
 • సౌందర్య లహరి
 • మనోగతం
 • వాస్తవం నుంచి వాస్తవంలోకి
 • హోమం
 • శతపత్ర
 • జీవాత్మ
 • కిడ్నాప్
 • యోధుడు
 • గోడచాటు ముద్దు
 • ఈ రోజు గడిస్తే చాలు
 • ఏక వ్యక్తి సైన్యం
 • సృష్టి
 • మొగలి బాకు
 • నైమిష
 • పేపర్ కటింగ్
 • ఛాలెంజ్
 • త్రివేణి
 • నువ్వక్కడ - నేనిక్కడ
 • సంభవం
 • ది బెట్
 • ప్రేమయాత్ర
 • ప్లే
 • డార్లింగ్
 • రక్తచందనం
 • నా జీవితం నీ కౌగిలిలో
 • లక్ష్యం
 • ముగ్ధ
 • జనవరి 5
 • సూపర్ స్టార్ 2
 • నిశీధ నియంత
 • అనితర సాధ్యుడు
 • రివెంజ్
 • స్టార్ వార్స్
 • ఎర్ర సముద్రం
 • లవర్
 • పెళ్ళి చూపులు
 • ప్రేమ
 • వసంతం
 • విజయం
 • బ్లాక్ అండ్ వైట్
 • అనూహ్యం
 • ది బ్యూటీ
 • మేమూ ప్రేమించుకున్నాం
 • ఐశ్వర్యరాయ్ వర్సెస్ ఆకలి
 • ఆరో రుద్రుడు
 • ఆక్రోశం
 • నేడే విడుదల
 • సాహసి
 • డియర్
 • అశ్వ భారతం
 • 1985 సెప్టెంబరు 17
 • సూపర్ స్టార్ 1
 • ఏ దేశమేగినా
 • స్త్రీ విజయం వెనుక పురుషుడు
 • మానవ యజ్ఞం
 • సక్సెస్
 • మాయావి
 • పెళ్ళిళ్ళు స్వర్గంలోనే జరుగుతాయి
 • త్రినేత్రుడు 1
 • త్రినేత్రుడు 2
 • ది లాస్ట్ డిక్టేటర్
 • ఆమెది ఒంటరి పోరాటం
 • మేడ్ ఫర్ ఈచ్ అదర్
 • దేవుడు వర్సెస్ మానవుడు
 • కృతయుగం
 • గాడ్స్ ఓన్ ప్లాన్
 • మనోయజ్ఞం

మూలాలు

[మార్చు]

లంకెలు

[మార్చు]

https://web.archive.org/web/20120919020514/http://www.suryadevararammohanrao.com/html/aboutus.html